ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 10.90 అడుగులకు చేరింది. దీంతో 4,47,138 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదిలారు. వరద ఉధృతి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి అంత్య పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరద ఉధృతి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోని పాత స్నానఘట్టంతోపాటు వీఐపీ, కొత్త గౌతమి ఘాట్లను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం గోష్పాద క్షేత్రంలోని నూతనంగా నిర్మించిన ఘాట్లలోనే స్నానాలు చేయాలని భక్తులకు అధికారులు సూచించారు.