kranthi constructions
-
కల.. నెరవేరే వేళ..
పాలకుర్తి: సాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల త్వరలో నెరవేరబోతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ముందుకు కదిలించారు. నిత్యం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో విడతలో భాగంగా 2009 సంవత్సరంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పాలకుర్తి ప్రాజెక్టు పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు. రిజర్వాయర్‌కు రూ. 11 కోట్లు మంజూరు.. పాలకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో 250 ఎకరాలు ఉన్న పాలకుర్తి ఊరచెరువు కొత్తగా సేకరించిన 700 ఎకరాలతో 950 ఎకరాల విస్తీర్ణానికి చేరింది. కాగా, 2009లో శంకుస్థాపన జరిగిన పనులు ఎట్టకేలకు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 0.25 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ అధినేత సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడు నెలల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి పాలకుర్తి మండలంలోని తీగారం, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, వల్మిడి, ముత్తారం, మంచుప్పుల శిరసన్నగూడెం తదితర గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
కాంట్రాక్టర్లో కదలిక
గద్వాల, న్యూస్‌లైన్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మూడేళ్ల క్రితం పనులను నిలిపేసిన కాంట్రాక్టర్.. అధికారుల నోటీసులు, చర్చలతో ఎట్టకేల కు స్పందించి పనులు చేపట్టేందుకు అంగీకరించారు. ఈ మేరకు గ త రెండురోజులుగా పనులు నిలిచిపోయిన ప్రాంతాలకు యంత్రాలను తరలించడంతో పాటు కార్మికులు ఉండేందుకు షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరోవారం రోజుల్లో ఈ ప్యాకేజీల వద్ద పనులు ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు నిర్వహించేందుకు పది ప్యాకేజీలుగా విభజించా రు. ఇందులో 101, 108 ప్యాకేజీ పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ కం పెనీ చేపట్టింది. ఈ పనులను రూ.115 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేయాల్సి ఉంది. 2006లో పనులు ప్రారంభించి 2009 వరకు కొనసాగించారు. అనంతరం బిల్లుల సమస్య, తదుపరి భూసేకరణ సమస్యలతో అర్ధంతరంగా ఆగిపోయాయి. మళ్లీ పనులను ప్రా రంభించేందుకు రాకుండా పూర్తి నిర్లక్ష్యం వ హించారు. దీంతో అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందించలేదు. చివరకు విసిగివేసారిన ఉన్నతాధికారులు గతనె ల రెండో వారంలో క్రాంతి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 61 ఫైనల్ నోటీసును జారీచేశారు. ఈ నోటీసు ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి పను లు చేసేందుకు అంగీకరించడం, చేయని ప క్షంలో కాంట్రాక్ట్‌ను రద్దుచేయాల్సి ఉంటుం దని హెచ్చరించడంతో సదరు కాంట్రాక్టర్ స్పందించి అధికారులతో సంప్రదింపులు ని ర్వహించారు. చర్చలు సఫలం కావడంతో వారంరోజుల క్రితం నెట్టెంపాడు ప్యాకేజీ ప నులను ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ అం గీకరించారు. ఈ మేరకు రెండు ప్యాకేజీల వ ద్దకు యంత్రసామగ్రిని ఇప్పటికే చేర్చారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై జూరాల ఎస్ఈ ఖగేందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారని, రోజుల వ్యవధిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. నెట్టెంపాడు అన్ని ప్యాకేజీల్లోనూ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా ప్రాధాన్యత క్రమంలో పనులు నిర్వహిస్తున్నామని ఎస్ఈ వివరించారు.