krishna gadi veera prema gadha
-
నెల్లూరు ఆతిథ్యం చాలా బాగుంది
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ హీరో నాని ఎస్2 థియేటర్లో చిత్ర యూనిట్ సందడి నెల్లూరు, సిటీ : నెల్లూరు ఆహారం, ఆతిథ్యం చాలా బాగుందని సినీ హీరో నాని అన్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవ యాత్రను పురస్కరించుకొని చిత్ర బృం దం గురువారం నెల్లూరు నగరంలోని ఎస్2 థియేటర్లో సందడి చేసింది. ఈ సందర్భం గా నాని మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందన్నారు. సినిమాకు ఇంతటి విజ యం అందించిన ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే యాత్రను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లో కంటే నెల్లూరులోనే థియేటర్లు బాగుయన్నారు. బుధవారం నుంచే నెల్లూరులో ఉన్నానని, ఇక్కటి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రేమగాథ విజయం ఇచ్చిన ఎనర్జీతో కొత్త సినిమాలో మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా నాని సినిమాలోని ఓ డైలాగ్ చెప్పడంతో ప్రేక్షకులు విజిల్స్‌తో కేరింతలు కొట్టారు. చిత్ర నిర్మాత గోపి, డెరైక్టర్ హను రాఘవపూడి, హీరోయిన్ మెహరన్, నటులు శ్రీనివాసులు, హుస్సేన్, డిస్ట్రిబ్యూటర్ హరి, థియేటర్ మేనేజర్లు ఆదిత్యబాబు, లీలాప్రసాద్లు పాల్గొన్నారు. -
ఏలూరులో ‘కృష్ణగాడు’
సందడి చేసిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ యూనిట్ ఏలూరు (ఆర్ఆర్ పేట) :నాని, మెహరీన్ హీరోహీరోయిన్లగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో భాగంగా బుధవారం ఏలూరు చేరుకుంది. స్థానిక బాలాజీ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉదయం ఆట ప్రేక్షకులతో తమ అనుభూతులను పంచుకుంది. నాని, మోహరీన్ చిత్రంలోని కొన్ని డైలాగులు చెప్పి ఉల్లాసపరిచారు. అనంతరం విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ మంచి ప్రయత్నాలే తెలుగు సినిమా విజయానికి ఫార్ములా అన్నారు. తన ప్రతి చిత్రాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, ఏలూరు వస్తే కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. విజయోత్సవ యాత్ర లో భాగంగా విశాఖ, కాకినాడ, రాజ మండ్రిలో పర్యటించామని, అన్నిచోట్లా మంచి స్పందన వస్తోందన్నారు. మోహనకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. కృష్ణగాడి విజయంతో మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించే ఉత్తేజాన్నిచ్చిందని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నానని త్వరలో కొత్త ప్రాజెక్టు చేపట్టనున్నారన్నారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ తన మొదటి చిత్రానికే ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, బాల నటులు మోక్ష, ప్రతమ్, సహాయ నటుడు శతృవు పాల్గొన్నారు. -
బాలకృష్ణను గుర్తు తెచ్చుకుని తొడ కొట్టా!
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి ఘనవిజయాల తర్వాత నాని నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. నాని పంచుకున్న ముచ్చట్లు... ♦ ఈ చిత్రానికి ముందే ‘అందాల రాక్షసి’, మరో రెండు కథలను హను నాకు వినిపించాడు. అయితే అవి నాకు నప్పవని చేయలేదు. ఆ తర్వాత నన్ను దృష్టిలో పెట్టుకునే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రాశారు. సినిమా కథ, షూటింగ్, రిజల్ట్ విషయంలో మేము టెన్షన్ పడలేదు. అయితే సినిమా టైటిల్ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడ్డాం. ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చర్చించుకుని నా పాత్ర పేరు కృష్ణ కాబట్టి, ఫైనల్‌గా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ యాప్ట్ అవుతుందని పెట్టాం. ♦ ఈ కథలో నాయకుడు కృష్ణ బాగా పిరికివాడు. అయినా పైకి గంభీరంగా, ధైర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. నాకు తెలిసి పైకి ధైర్యవంతుల్లా కనిపించే వాళ్లందరూ పిరికివాళ్లే. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఇందులో ఇంగ్లీష్ రాదు కానీ, వచ్చినట్టు మేనేజ్ చేస్తుంటా. రియల్ లైఫ్‌లో నాకు బాగా ఇంగ్లీష్ వచ్చు. ‘టైటానిక్’ సినిమా చాలాసార్లు చూడటంతో ఇంగ్లీష్ పరీక్షల్లో ఆ చిత్రం స్టోరీ రాసేవాణ్ణి. అయినా ఒక్కసారి కూడా నేను ఇంగ్లీష్‌లో ఫెయిల్ కాలేదు. ♦ రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హీరో బోర్లు వేసే కాంట్రాక్ట్ తీసుకుని వేయిస్తుంటాడు. ఉదయం నుంచి ఆ పనిలో ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్‌ను కలవడం, సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తుంటాడు. నేను రియల్ లైఫ్‌లో కమల్‌హాసన్‌గారి అభిమానిని. ఇందులో బాలకృష్ణగారి అభిమానిగా నటించా. అనంతపురం, హిందూపురాలకు స్టోరీతో లింక్ ఉంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్లోనే బాలకృష్ణగారి పేరు చెప్పుకుని బయటపడే సీన్ ఉంటుంది. ప్రతి సీన్ కథలో కనెక్ట్ అయి ఉంటుంది. ఓ సీన్లో విలన్లను కొట్టేందుకు అవసరమైన ధైర్యం కోసం బాలకృష్ణ గారిని గుర్తుకు తెచ్చుకుని తొడ కొట్టే సీన్ కూడా ఉంది. ♦ ఆడియో రోజున జూ. ఎన్టీఆర్, మహేశ్‌బాబు మాటలు విన్నప్పుడు ఇగో లేకుండా మాట్లాడారనిపించింది. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ విజయాలతో ఈ చిత్రం గురించి టెన్షన్ పోయింది. అంతకు ముందు ఫ్లాపులు వచ్చినప్పుడు టెన్షన్ ఉండేది. ‘జెండాపై కపిరాజు’ చిత్రం కోసం రెండేళ్లకుపైగా కష్టపడ్డా ఆశించిన ఫలితం రాలేదు. ‘భ లే భలే మగాడివోయ్’ని ఆరే నెలల్లో పూర్తి చేసినా ఘన విజయం సాధించింది. ♦ రెమ్యునరేషన్ పెంచానంటున్నారు. పెంచక తప్పదు. ఎందుకంటే నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన మొదటి చిత్రానికి రూ. 2500, రెండో సినిమాకు 3500 తీసుకున్నా. ఇప్పుడు హీరో అంటే తప్పదుగా. నేనే కాదు.. ఎవరైనా సినిమా సినిమాకు పెంచుతారు. ♦ ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నా. ఆ చిత్రం తరు వాత ఆనంది ఆర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తా. ఇకపై గ్యాప్ లేకుండా సిన్మాలు చేస్తా. -
వీర ప్రేమ!
మహాలక్ష్మి అంటే కృష్ణకు బోల్డంత ప్రేమ. ఆమె ప్రేమ దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అంత వీర ప్రేమ అన్నమాట. ఇంతకీ మహాలక్ష్మి ప్రేమను దక్కించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు? అనే కథాంశంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర మాట్లాడుతూ -‘‘ఇటీవల హీరో మహేశ్‌బాబు విడుదల చేసిన మా చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరిన్ నటన అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ విధంగా ఈ ప్రేమకథ ఉంటుంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రత్నవేలు శిష్యుడు యువరాజ్ కెమెరా పనితనం ఈ చిత్రానికి హెలైట్ అవుతుంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది’’ అని తెలిపారు. సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృధ్వీ, హరీశ్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, లైన్ నిర్మాత: హరీశ్ కట్టా.