సమాజ హితమే జర్నలిస్టుల ఆకాంక్ష
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి
‘కేయూ ఎక్స్‌ప్రెస్ ల్యాబ్ జర్నల్’ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్ :
సమాజహితమే ఆకాంక్షగా జర్నలిస్టులు నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేస్తున్నారని.. ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో జర్నలిజం కీలక పా త్ర పోశిస్తుందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. కాకతీయ యూని వర్సిటీలోని జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో వెలువరించనున్న కేయూ ఎక్స్‌ప్రెస్ ల్యాబ్ జర్నల్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడు తూ సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలోను జర్నలిస్టుల పాత్ర ఎనలేదని కొనియాడారు. చాలా రంగాల్లోని వారు ఆర్థికంగా ఎదిగినా, 30ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న పలువురు తమకు ఇళ్లు మం జూరు చేయాలని కోరే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో పత్తి పండించకముందే పత్తి ఆధారిత మిల్లుగా ఆజాంజాహి మిల్లు ఎందరికో ఉపాధినిచ్చినా, గత పాలకుల నిర్లక్ష్యంగా అది మూ తపడిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లా ల్లో పత్తి విస్తారంగా సాగు చేస్తుండగా మిల్లు మూత పyìందని, ఇలాంటి విషయాలపై జర్నలిస్టులు లోతుగా అధ్యయనం చేసి పరిశోధనాత్మక కథనాలు రాయాలని సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బంగారు తె లంగాణ సాధనలో జర్నలిజం విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేయూ ఎక్స్‌ప్రెస్ ద్వా రా ప్రజలను ఆలోపింపచేసే కథనాలు వస్తాయని ఆకాంక్షించారు. కేయూ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడుతూ కేయూలో జర్నలిజం పూర్తిచేసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, వైస్‌ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.దయాకర్‌రావు, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ మహేశ్వర్‌రావు, నగర డిప్యూటీ మేయర్ సిరాజోద్దీన్, జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, కె.నర్సింహారాములు, రామాచారి, ఎస్.నర్సయ్య, శ్రీకాంత్, పులి శరత్‌కుమార్, వంగాల సుధాకర్, పద్మశ్రీ, వెంకట్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను నిర్వాహకులు సన్మానించారు.