Kumbham Anil Kumar Reddy
-
కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు: కుంభం అనిల్ రెడ్డి
-
కాంగ్రెస్‌కు షాక్! కోమటిరెడ్డి ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు కుంభం.. కారులో షి‘కారు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్‌రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు. తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్ చెప్పుకొచ్చారు. (బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్‌షాతో కరీంనగర్ ఎంపీ భేటీ, కీలక సూచన) కారెక్కనున్న కుంభం కాంగ్రెస్‌లో వర్గపోరుతో కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డితోపాటు అనిల్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది. (బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) -
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తాం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీనగర్‌లో గల నిమ్స్ ఆస్పత్రికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించాలంటూ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిమ్స్ వద్ద మంగళవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రిని నిర్మించారని, అలాగే 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు.