డెంగీతో చిన్నారి మృతి
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లెకు చెందిన పదేళ్ల బాలుడు డెంగీతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వేంపల్లె దేవాంగుల వీధికి చెందిన ఫయాజీ, మెహబూబా దంపతుల కుమారుడు షేక్ ఉమర్ (10) డెంగీ వ్యాధి బారిన పడగా మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు.
పరిస్థితి సీరియస్గా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఉమర్ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.