Lack of sanitation
-
పారిశుధ్య లోపంపై నిరసన
- కడెంలో ప్రజల రాస్తారోకో - సందర్శించిన ఎమ్మెల్యే రేఖ కడెం : పారిశుధ్య లోపం కారణంగా కడెంలో విషజ్వరాలు, డెంగీ ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తూ స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు వంద మందికి పైగా స్థానికులు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మల్-మంచి ర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని, పందులను గ్రామానికి దూరంగా తరలించడంతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకో కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కలెక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే కడెంలో స్థానికులు రాస్తారోకో చేస్తున్నారన్న సమాచా రం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్ వ చ్చారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితు లు తెలుసుకున్న ఆమె.. ఫోన్లో కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నియామకం, పారి శుధ్య పరిస్థితిపై తెలిపారు. పారిశుధ్య ప నులు చేపట్టడంతో పాటు పందుల తరలింపు చర్యలు చేపట్టాలని తహశీల్దార్ నర్సయ్య, ఎంపీడీవో విలాస్‌ను ఆదేశిం చారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా, డ్యూటీ డాక్టర్ లేరు. ఈ మేరకు ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తక్కళ్ల సత్యనారాయ ణ, రఫీఖ్, మీనాజ్, సయ్యద్ ఆశాం, కలీం తదితరులు పాల్గొన్నారు. -
ఆ పల్లెలు..మచ్చతునకలు
రూ. కోట్లు కుమ్మరించినా.. - కదలిక లేని పనులు - ప్రణాళికా లేదు.. పర్యవేక్షణా కరువు - సమీక్షలతోనే అధికారుల టైంపాస్ - ఆ ఆరు గ్రామాల్లో ‘సాక్షి’ పర్యటన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి; ‘పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటిద్దాం.. పల్లెలకు మౌలిక వసతులు కల్పిద్దాం. ఇక ఆసుపత్రుల్లో వైద్యం అందక ఎవరూ మరణించడానికి వీల్లేదు’.. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి మండలి (గడా) సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు చేసిన సూచన ఇది. చెప్పినట్టే కేసీఆర్ నిధుల వరద పారించారు. రెండు దఫాలుగా ‘గడా’ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్నుంచి ఆయన రూ.కోట్లు గుమ్మరిస్తూనే ఉన్నారు. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు.. నాణేనికి మరోవైపు.. ఒకరిద్దరు కాదు.. అధికార యంత్రాంగమంతా ఉరుకులు పరుగులు పెడుతోంది. గజ్వేల్ చుట్టూనే తిరుగుతోంది. ‘గజ్వేల్ జనాల కాలికి ముళ్లు గుచ్చుకుంటే.. నా పంటితో దాన్ని పీకేస్తా’ అనేంతగా పోటీపడి ఆయా విభాగాల అధికారులు బిల్డప్ ఇస్తున్నారు. జిల్లా అంతా ఇది చూసి ‘అబ్బో.. అదృష్టమంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలదే’ అనుకుంటున్నారు. జనాన్ని ఇలా భ్రమలో ముంచి పబ్బం గడిపేస్తున్న అధికారులు అంతలో.. ‘ఇక్కడి ఆరు పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం. అవి బంగారు తెలంగాణకు ఆరు పిల్లర్లవంటివి. సీఎం కలలకు అవి ప్రతిరూపాలు. భవిష్యత్తు తెలంగాణకు మచ్చు తునకలు’ అంటూ కొత్త నాన్సెప్ట్ ప్రచారంలోకి తెచ్చారు. ఏడాది కిందటి సంగతి ఇది. ఇప్పుడు తాజాగా ‘సాక్షి’ ఆ ఆరు గ్రామాలకు వెళ్లింది. ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే.. -
పుష్కరఘాట్లను తనిఖీ చేసిన ఏపీ సీఎం
పారిశుద్ధ్య లోపంపై ఆగ్రహం శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రీల సస్పెన్షన్ సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: గోదావరి పుష్కరాల ఏర్పాటు పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపం, అడ్డదిడ్డంగా బ్యారికేడ్ల ఏర్పాటుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజమండ్రి 30వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సతీశ్, మేస్త్రీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవసరం లేకున్నా పుష్కర ఘాట్ మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణపై సీరి యస్ అయ్యారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం నేరుగా ఘాట్ల పరి శీలనకు బయల్దేరారు. మధ్యలో ఆగుతూ కోటిలింగాల ఘాట్‌ను, పుష్కరాల ఘాట్లను పరిశీలించారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం గోష్పాద క్షేత్రంలో పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పుష్కర సాన్నాలకు వీలుగా 5 అడుగుల నీటి నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి 3 గంటలకు నీటిని శుభ్రం చేయటానికి శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. ఘాట్లను, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లను సీఎం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెల్డన్ అంటూ.. కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల ఏర్పాట్ల్లపై సమీక్షించారు. కొవ్వూరు పర్యటనలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పీతల సుజాత, ఎంపీ మురళీమోహన్ తదితరులు ఉన్నారు. -
ఇదేం తీరు?
గజ్వేల్/ములుగు: గజ్వేల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘నేను ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే తొవ్వల.. మర్కుక్‌లో మురుగునీటి కాల్వలు బాగాలేవు... స్పెషల్ డ్రైవ్‌లు చేసినమన్నరు... ఫలితమేముంది... ఇదేం బాగాలేదు... ఏంచేస్తున్నారు మీరంతా..?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని అటవీశాఖ పరిశోధనా కేంద్రంలో నియోజవర్గంలోని వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో సీఎం చేసిన వ్యాఖ్యలివి. ‘ఏం చేస్తారో నాకు తెల్వదు.. గజ్వేల్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాలు, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండల కేంద్రాలు, గ్రామాలన్నీ సం పూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతీకలుగా నిలవాలి...అద్దంలా మారాలి’ అంటూ ఆదేశించారు. ముందుగా గజ్వేల్ పట్టణం లో ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలె...అంటూ ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుకు సూచించారు. అంతేకాకుండా చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టండి...అన్ని వర్గాల సహకారం తీసుకోండి....అంటూ ఆదేశించారు. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో యుద్ధప్రాతికదికన మొక్కల నాటడానికి చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలోని ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్‌లోని 132/33కేవీ సబ్‌స్టేషన్ వరకు, ఇందిరాపార్క్ అంగడిబజార్ నుంచి కోటమైసమ్మ గుడి వరకు కూడా మొక్కలు నాటి వాటికి కం చెలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు విస్తరణకు స్థానికుల సహకారాన్ని కోరాలని తెలిపారు. మొక్కల పరిరక్షణకు రోడ్డు పక్కన బోరుబావులను తవ్వించి వాటి ద్వారా నీటిని అందించాలన్నారు. వీటి పరిరక్షణ బాధ్యత పూర్తిగా నగర పంచాయతీ కమిషనర్‌దేనని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంకానర్గీస్, అటవీశాఖ అధికారి సోనీబాల, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, నాయకులు జహంగీర్, అంజిరెడ్డి, మాదాసు శ్రీనివాస్, దేవి రవిందర్ తదితరులు పాల్గొన్నారు. మంచినీటికి శానా తిప్పలైతుంది... - సీఎంతో మర్కుక్ మహిళల ఆవేదన ములుగు మండలం మర్కుక్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకసిక్మంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధి గుండా కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగునీటి కాల్వలను పరిశీలించారు. సీఎం ఆకస్మిక సందర్శనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆనందోత్సహాలకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘గ్రామంలో.. మంచినీళ్లు దొరకక శాన తిప్పలైతుంది సారు...మేం పదిమందిమి కలిసి సొంత పైసలతో బోరు వేయించుకున్నం’ అని కొందరు నిట్టూర్చగా...మరి కొందరు ‘మాకు నల్లా నీళ్లు వస్తలేవు... మా ఇబ్బంది తీర్చండి...’ అంటూ సీఎంతో వేడుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్ మర్కుక్‌లో వారం రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అదేవిధంగా మహిళా సంఘాల గురించి సీఎం ఆరా తీశారు. సంఘాలకు భారీ ఎత్తున పథకాలను వర్తింపజేసీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరో రైతువద్దకు వెళ్లి..పెద్దాయనా నీకేం కావాలే...అంటూ సీఎం ప్రశ్నించగా కరెంటు సరిగా వస్తలేదు సారూ...కరెంటు మంచిగియ్యాలే...అంటూ వేడుకున్నారు....దీనిపై స్పందించిన కేసీఆర్ కరెంటు సరఫరా తీరు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గ్రామస్తులతో మాట్లాడుతూ..అంతా కలిసి శ్రమదానం చేసుకుందాం...మోరీలు బాగు చేసుకుందాం...కొద్ది రోజుల్లో నేను కూడా మీ ఊరికి వస్తా..అంటూ పేర్కొన్నారు. ములుగు అటవీ కేంద్రంలో జింకలను పెంచండి పోచారం అభయారణ్యంలోని సుమారు 200కుపైగా జింకలను ములుగులోని అటవీశాఖ పరిశోధన కేంద్రంలోకి తరలించి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శుక్రవారం ఈ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో సిల్వి కల్చరిస్ట్ ప్రియాంకవర్గీస్, డీఎఫ్ఓ సోనిబాల తదితరులతో మాట్లాడుతూ పర్యావరణం వికసించేలా పోచారం అభయారణ్యం నుంచి ఇక్కడికి జింకలను తరలించి పెంచాలని సూచించారు. అదేవిధంగా ఇక్కడి కేంద్రానికి పెద్ద ఎత్తున మొక్కలను తీసుకువచ్చి నిల్వ చేసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, కొండపాక, జగదేవ్‌పూర్ మండలాలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తన ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. -
మన్యానికి జ్వరమొచ్చింది!
పారిశుద్ధ్య లోపం, కలుషిత తాగునీటితో రోగాల పడగ రోగులతో పాడేరు ప్రాంతీయ ఆసుపత్రి కిటకిట పాడేరు రూరల్ : మన్యంలో వర్షాలతో గ్రామా ల్లో లోపించిన పారిశుద్ధ్యం, కలుషిత నీరు తాగడం ప్రధాన కారణాలతో రోగాలు పడగవిప్పాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు మండలాలకు చెందిన పలువురు గిరిజనులు రోగాల బారినపడ్డారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో కేవలం ఓపీ సమయంలోనే గత మూడు రోజుల్లో దాదాపు 700 మంది వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరో వంద మంది ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందుతున్నారు. దీంతో వార్డులన్నీ కిక్కిరిసిపోయాయి. ఒక్కో బెడ్‌ను ఇద్దరేసి రోగులకు ఇస్తున్నారు. చివరకు వార్డుల్లో ఖాళీలేక ఆస్పత్రి వరండాలోనూ బెడ్లు వేసి రోగులకు వైద్యం చేస్తున్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ ఆశ్ర మ వసతిగృహాల్లోని విద్యార్థులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో పది మంది చేరారు. కొంతమంది ఆస్పత్రి ఓపీ సమయంలో వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు. జ్వరాల తీవ్రత పెరగడంతో పాడేరు ఇన్చార్జి ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్ బుధవారం ప్రాంతీయ ఆస్పత్రిని సం దర్శించారు. మందుల స్టాక్‌పై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు.