lakka
-
ప్రపంచాన్ని చుట్టేసిన ఏటికొప్పాక లక్కబొమ్మ (ఫొటోలు)
-
లక్కీ బిజినెస్
ఈ ప్రాంత మహిళల నుంచి ఎంతో నేర్చుకోవాలి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.. నిత్యం చేసుకునే పనులే కాకుండా అదనంగా కొత్త పని చేస్తున్నారు. తమ పని ద్వారా ఏడాదికి పాతిక వేల నుంచి లక్షన్నర వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ఇప్పుడు కాదు... కొన్ని తరాలుగా వారు ఈ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఆనందంగా ఉంటున్నారు. చిన్నిచిన్ని Mీ టకాలే వీరికి ఈ పెద్ద మొత్తాన్ని అందిస్తున్నాయి. జార్ఖండ్ సిమ్డెగా జిల్లాలో ఉంటున్న ఆమ్రెన్షియా బార్లా కుటుంబం కొన్ని తరాలుగా లక్కతో వ్యాపారం చేస్తున్నారు. లక్క అనేది గుగ్గిలం వంటి రసం... కొన్ని రకాల కీటకాల నుంచి స్రవిస్తుంది. గుడ్లు పెట్టి పొదగడానికి సిద్ధంగా ఉన్న కర్రను రైతులు తీసుకువచ్చి పెద్దపెద్ద చెట్లకు కట్టడంతో లక్క సాగు ప్రారంభమవుతుంది. సౌందర్య సాధనాల నుంచి ఆయుధాల తయారీ వరకు లక్కను పుష్కలంగా ఉపయోగిస్తారు. అనేక రకాల చెట్ల మీద లక్కను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పళ్ల చెట్లు, నీడనిచ్చే బెర్రీ, కుసుమ, పలాస, సాల వృక్షాల మీద వీటి సాగు విస్తృతంగా జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వస్తోంది. 2016 లో ఆమ్రెన్షియా ‘లైవ్లీహుడ్ ప్రొమోషన్ సొసైటీ’ అనే ఒక స్వయం సహాయక సంఘంలో చేరారు. అక్కడ ‘మహిళా కిసాన్ స్వశక్తికారణ్ పరియోజన’ సంస్థ వారి దగ్గర లక్కను శాస్త్రీయంగా పెంచటంలో శిక్షణ పొందారు. ఇప్పుడు ఆమ్రెన్షియా సంప్రదాయ పద్ధతుల్లో సంపాదించిన దాని కంటె మూడు రెట్లు అధికంగా ఆదాయం పొందుతున్నారు. ఆమ్రెన్షియా వంటివారు సుమారు 73 వేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా సంవత్సరానికి పాతిక వేల నుంచి యాభై వేల రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ‘‘శాస్త్రీయ విధానంలో వ్యవసాయం చేయటం వల్ల ఉత్పత్తి పెరిగింది. గతంలో నాకు ఏడాదికి పదివేల రూపాయలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు సీజన్లో ఏడాదికి అరవై వేల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. రెండుసార్లు లక్క సాగు చేస్తున్నాం’’ అంటున్నారు. లతేహార్కు చెందిన ఆశ్రిత గురియా ఏడాదికి ఒకటిన్నర లక్షలు సంపాదిస్తున్నారు. ‘‘మాకు సూచించిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా రెట్టింపు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అలాగే మాకు 5 కేజీల లక్కవిత్తనాలు కూడా అందిస్తున్నారు’’ అంటున్నారు మరో మహిళా రైతు రంజీతాదేవి. గుగ్గిలం, మైనం, లక్క... వీటిని కీటకాల నుంచి తయారు చేస్తారు. ఉన్ని, పట్టు, వైన్ వంటివి అందంగా కనపడటానికి ఈ పదార్థాలే కారణం. ఆయుర్వేద ఔషధాలలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే చెక్క వస్తువులకు పాలిష్ పెట్టడానికి కూడా ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వీటిని చాలా ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఈ మహిళలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
కలెక్టర్‌కు లక్కపురుగుల బెడద!
పెద్దపల్లిలో గోదాం పక్కనే కలెక్టరేట్? ఐటీఐపై అధికారుల తర్జన భర్జన పెద్దపల్లి : కొత్త కలెక్టర్‌కు లక్కపురుగులు స్వాగతం పలకనున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ముందుచూపు లేమి కారణంగా ఉన్నతాధికారులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను పట్టణ శివారులోని ఐటీఐలో కొనసాగించాలని నిర్ణయించారు. కళాశాల ప్రహరీ పక్కనే సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ బియ్యం గోదాములున్నాయి. ఇక్కడ నిత్యం లక్కపురుల బెడద తీవ్రంగా ఉంటోంది. చుట్టుపక్కల వారు ఏళ్లకు ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కలెక్టరేట్ నిర్వహణ ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొందరు పురుగుల బెడద నివారించడానికి క్రిమిసంహారక మందు వాడకం మోతాదు పెంచాలని నిర్ణయించారు. క్రిమిసంహారక మందు వినియోగం పెంచితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. మందు ప్రభావం ఎక్కువైతే నిల్వచేసిన బియ్యం మొత్తానికి పనికిరాకుండా పోతాయని నిపుణులు అంటున్నారు. గోస ఇప్పుడు తెలిసిందా..? రాఘవాపూర్‌లోని గోదాముల ద్వారా పుట్లకొద్డీ లక్కపురుగులు దాడిచేసి నిద్రలేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారుల ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ఆ అధికారులే కలెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. లక్కపురుగులంటూ హైరానపడుతున్నారు. ‘మేం పడుతున్న గోస ఇప్పుడు అర్థమైతంది’ అని రాఘవాపూర్ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సంబరపడుతున్నారు. ఆందోళనకు సై.. పెద్దపల్లి కలెక్టరేట్‌ను ఐటీఐలో నిర్వహించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐటీఐని క్రమంగా కలెక్టరేట్ ఆక్రమిస్తే తాము ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పెద్దపల్లి ఐటీఐని అధికారులు ఉనికి లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొత్తకోర్సులతో వందలాది మందికి శిక్షణఇచ్చి ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఐటీఐని లాక్కొని బయటికి పంపే ప్రయత్నం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక అవసరాల కోసం ఐటీఐని వాడుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారని, శాశ్వతంగా ఐటీఐని కలెక్టరేట్ స్వాధీనం చేసుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టంచేస్తున్నారు.