ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు షోకాజ్ నోటీసులు
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రర్ దశరథ రామయ్యపై ఆర్టీఏ కమిషనర్ తాంతియా కుమారి మండిపడ్డారు. సమాచార చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు ఈసందర్భంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ. 2 వేలు జరిమానా విధించారు.
బుధవారం అనంతపురంలో సమాచార హక్కు చట్టంపై తాంతియా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తాంతియా కుమారి హెచ్చరించారు.