Lambada
-
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
ఢిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు
సాక్షి, న్యూఢిల్లీ: హక్కుల సాధన కోసం ఆదివాసీలు కదంతొక్కారు. అస్తిత్వ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉధృతం చేశారు. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం జోడెఘాట్ కేంద్రంగా పురుడుపోసుకున్న ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు వేల సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు. ప్రత్యేక రైళ్లు, వాహనాల్లో ఢిల్లీ బాటపట్టారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ భూమిపై హక్కులు కల్పించాలని, ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సరైన విధానం పాటించకుండా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీనివల్ల ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. వందలో మూడు ఉద్యోగాలు కూడా దక్కడం లేదు: సోయం లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వందలో 3 ఉద్యోగాలు కూడా ఆదివాసీలకు దక్కడం లేదని, 97 శాతం రిజర్వేషన్ ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ, సమితి అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆది వాసీలు హక్కులు కోల్పోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సభ నిర్వహించినట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఎమ్మెల్యే సీతక్క సహా పలు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
లంబాడి భాషకు లిపి
ఇందల్వాయి : గిరిజన తెగలలో ఒకటైన లంబాడీలకు మాట్లాడటానికి భాషా ఉన్నా రాయడానికి సరైన లిపి లేదు. దీని పర్యావసనంగా లంబాడి భాషా, సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావించిన ఓ గిరిజన యువకుడు.. తమ భాష మీద ప్రేమ, తమ సం స్కృతిపై మమకారంతో ప్రత్యేక లిపి రూపొందించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆరు సంవత్సరాలు గా ఇతర భాషల లిపిలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అకుంఠిత దీక్షతో చివరకు ఎలాంటి లోపాలు లేని 50 అక్షరాలతో కూడిన లిపిని లంబాడి భాష కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశాడు. అతడే ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండా గ్రామ పంచాయతీకి చెందిన జగత్ సింగ్ పవార్. డిగ్రీ వరకు చదువుకున్న జగత్సింగ్.. లిపి లేని ఎన్నో భాషలు అంతరించి పోతున్నాయని గుర్తించి, లంబాడి భాషా కూడా అలా అంతరించి పోకుండా కాపాడేందుకు పూనుకున్నాడు. తండ్రి నూర్సింగ్ పవార్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రత్యేక లిపిని తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. శోధించి.. సాధించి.. దేశంలో 10 శాతం జనాభా ఉన్న లంబాడీలకు ప్రత్యేక లిపి లేక ఇతర భాషలపై ఆధారపడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో లంబాడి భాషకు ప్రత్యేక లిపి అవసరమని జగత్సింగ్ లిపి రూపకల్పనకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం దేవనాగరి, హిందీ తదితర ప్రాచీన భాష ప్రావీణ్య పుస్తకాల నుంచి ఆధారాలు సేకరించాడు. అలాగే, భాషా పండితుల ఆత్మకథలను చదివి, పలువురు భాషా పండితుల సూచనలు తీసుకొని అహర్నిషలు శ్రమించి చివరికి ఇతర భాషాల లిపిలతో పోలిక లేని విధగా లంబాడి భాషా లిపికి రూపకల్పన చేశాడు. 13 అచ్చులు.. 37 హల్లులు.. జగత్సింగ్ రూపొందించిన లంబాడి భాష లిపిలో 13 అచ్చులు, 37 హల్లులు ఉన్నాయి. వీటికి వొత్తు లు కూడా ఉన్నాయని, వీటి ఆధారంగా మహాభారతంలోని కొన్ని శ్లోకాలు కూడా రాశానని జగత్ సింగ్ తెలిపాడు. ఈ లిపితో లంబాడి భాషలో మాట్లాడే ఏ పదాన్నైనా సులభంగా రాయవచ్చని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ లిపిని ప్రభుత్వం గుర్తించి, లిపిలో మరింత పరిపక్వత సాధించేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నాడు. లంబాడ యువత ఈ లిపిని ఆదరించాలని, ఆసక్తి ఉన్న వారికి అవగాహన, శిక్షణ ఇస్తానంటున్నాడు జగత్సింగ్. ఈ లిపితో తమ భాషా, సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. లిపిపై ఆసక్తి ఉన్న వారు ఫోన్ నెం.83281 72129లో సంప్రదించాలని కోరాడు. -
లంబాడా రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : లంబాడా కులానికి చెందిన రెవెన్యూ సిబ్బంది కొలాం రైతులను మోసం చేస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. సోమవారం కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొలాం రైతులకు రైతుబంధు పథకం వర్తించకుండా లంబాడా కులానికి చెందిన రెవెన్యూ ఉద్యోగులు కుటిల ప్రయత్నాలు చేస్తూ అన్యాయం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఐదెకరాలు ఉన్న కొలాం గిరిజన రైతు భూమిని గుంటలుగా చూపిస్తూ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఆదిలాబాద్, నార్నూర్ తహసీల్దార్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్వార్టర్స్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి సమస్యను విన్నవించారు. మామిడిగూడ, సల్పలగూడ, పోతగూడ, హత్తిగుట్ట, తిప్ప, చితగుడ, ముక్తాపూర్, అడ్డగుట్ట, యాపల్‌గూడ, తదితర గ్రామాల రైతులు తానాజీ కురుసింగా, రత్నజాడె ప్రజ్ఞకుమార్, టేకం సురేష్, నందులాండ్గే పాల్గొన్నారు. -
లంబాడాలను తొలగించేదాకా.. లడాయే
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్‌బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్, గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య, పాండురంగ్, మారుతి, జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్, వెంకటేశ్ హైమన్‌డార్ఫ్ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. అస్తిత్వం కోసమే పోరాటం మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉద్యమించక పోతే మనల్ని క్షమించరు ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. – ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
తక్షణమే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం హన్మకొండ ఏకశిల పార్కు వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగింది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గిరిజనులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.