land deals
-
ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్‌లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ వివరించింది. -
నోట్ల రద్దు: ఆ భూ ఒప్పందాల మర్మమేమిటి?
పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పెద్ద నోట్ల రద్దుకు కొద్దిరోజుల ముందే బిహార్‌లో బీజేపీ నేతలు పార్టీ కార్యాలయాల కోసం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై దుమారం రేగుతోంది. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికే బీజేపీ నేతలు ఇలా భూములు కొనుగోలు చేశారని, అత్యంత గోప్యంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు గురించి బీజేపీ నేతలకు ముందే తెలిసిందని, అందుకే పార్టీ కార్యాలయాల కోసం ఉద్దేశించిన భూముల కొనుగోళ్లను గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ముందు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని అధికార జేడీయూ ఆరోపించింది. పార్టీ కార్యాలయాల కోసం 23 భూ ఒప్పందాలను బీజేపీ కుదుర్చుకుంది. ఇందులో ఎక్కువశాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జరగడంతో ఈ అంశాన్ని జేడీయూ అస్త్రంగా వాడుకొని కమలదళాన్ని ఇరకాటంలో నెట్టాలని చూస్తోంది. ‘పెద్దనోట్ల రద్దు గురించి వారికి ముందే తెలుసు. అందుకే ఆగస్టు, సెప్టెంబర్లలో భూ ఒప్పందాలు చేసుకున్నారు’ అని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ రేటు కన్నా తక్కువ ధరకు వీటిని రిజిస్టర్ చేయించుకున్నారని, దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ బిహార్ శాఖ కొట్టిపారేస్తున్నది. ఈ ఒప్పందాలన్నీ చెక్కుద్వారానే జరిగాయని, ఇందులో బ్లాక్ మనీ ప్రమేయమే లేదని బిహార్ బీజేపీ చీఫ్ మంగళ్ పాండే తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలమేరకు పార్టీ యూనిట్లన్నీ కార్యాలయాలు సమకూర్చుకోవడానికి చాలాకాలంగా భూ కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాయని, ఆ ప్రక్రియ ఇటీవల ముగియడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లు జరిపించినట్టు ఆయన చెప్పారు. -
వాద్రా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!
-
సీబీఐ విచారణపై రాబర్ట్ వాద్రాకు ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. వాద్రా భూముల కొనుగోళ్ళ వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైన విషయం తెలిసిందే. వ్యవసాయ భూములను ప్రతిపాదిత అవసరాల కోసం కాకుండా వేరే అవసరాలకు వాడుకోవడానికి అనుమతించడంపైన కూడా విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లా...సీబీఐ విచారణకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
రాజస్థాన్‌లో రాబర్ట్ వాద్రా కలకలం