land sale
-
హెచ్ఎండీఏ ఆదాయం రూ.6945 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, బుద్వేల్లోని భూముల విక్రయాల ద్వారా హెచ్ఎండీఏకు రూ.6,945.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు చోట్ల హెచ్ఎండీఏకు ఉన్న భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించారు. ► కోకాపేటలో మొత్తం 7 ప్లాట్లలో ఉన్న 45.33 ఎకరాల భూమిని విక్రయించారు. ఇందులో ఒక్కో ప్లాట్‌లో 3.60 ఎక రాల నుంచి 9.71 ఎకరాల వరకు ఉంది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోగా, సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తం 7 ప్లాట్లపై రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. ► బుద్వేల్లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా రూ.41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్లోని మొత్తం భూములపై రూ.3625.73 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ► మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. -
కొడంగల్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: అధికార బీఆర్ఎస్కు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరులపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఓ భూవిక్రయం విషయంలో ఎమ్మెల్యే, మరికొందరు తనపై భౌతిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా స్థలం కొని... బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి నాయుడు కాలనీకి చెందిన సామ ఇంద్రపాల్‌రెడ్డి అదే ప్రాంతంలో స్థలం కొనేందుకు 2018లో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు రాకేశ్‌రెడ్డి మధ్యవర్తులుగా ఆయనకు పరిచయమయ్యారు. వారు ఆయనకు ఉప్పర్‌పల్లిలోని భూయజమానులను పరిచయం చేశారు. స్థలం కొనుగోలుకు అంగీకరించిన ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు కమిషన్‌తో కలుపుకొని రూ. 3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భూయజమానులకు రూ. 90 లక్షలను అడ్వాన్స్ కింద చెల్లించడంతోపాటు రూ. 2.75 కోట్లకు ఖాళీ చెక్కులను ఎమ్మెల్యే వద్ద ష్యూరిటీగా ఉంచాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని యజమానులకు చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు రాకేశ్‌రెడ్డికి చెరో రూ. 20 లక్షల చొప్పున కమీషన్ చెల్లించాడు. అయినప్పటికీ వారు ఖాళీ చెక్కులను ఇవ్వకపోగా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆయన రుణానికి ప్రయత్నించగా లభించలేదు. దీంతో నాటి నుంచి తరచూ వేధింపులకు గురిచేస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 2022 జూన్‌లో ఇంద్రపాల్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగొలా తప్పించుకున్న ఇంద్రపాల్‌రెడ్డి దీనిపై 2022 జూన్ 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీని కోరినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే, ఇతరులపై కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిలింనగర్లో జరగడంతో కేసును ఫిలింనగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. -
ఇండియా సిమెంట్స్ నష్టాలు పెరిగాయ్, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్‌లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో ఆస్తుల మానిటైజేషన్ తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) డోంట్ మిస్ టూ క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ -
ఖజానా నింపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టొద్దని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. భూముల అమ్మకాలతో పాటు నోటరీల క్రమబద్ధీకరణ, పన్నుల ఆదాయం పెంపు తదితర మార్గాల ద్వారా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ శాఖల రాబడులు, బకాయిలకు సంబంధించిన వివరాలను మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. పన్ను ఆదాయం మరింత పెంచండి రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మూడు ప్రధాన పారిశ్రామిక వాడల అమ్మ కాలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలు వైన ప్రభుత్వ భూములను అటు ప్రజా ప్రయోజనార్థం వినియోగించుకోవడంతో పాటు ఖజానా కు ఊతమిచ్చే విధంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా దష్టి పెట్టి పనిచేయాలని మంత్రివర్గం సూచించింది. అదేవిధంగా నోటరీల ద్వారా క్రయ విక్రయ లావాదేవీలు జరిగిన స్థలాలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేసినందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పన్ను వసూళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగవేత జరగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని స్పష్టం చేసింది. పన్ను ఆదాయం పెంచడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రభుత్వ మనుగడ సజావుగా సాగేట్టు చూడాలని ఉపసంఘం ఆదేశించింది. పన్నుల ఆదాయం ఇప్పటికే ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మరింత పెరిగేలా కషి చేయాలని కోరింది. వారం రోజుల్లో 58, 59 జీవోల సంబంధిత పట్టాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ప్రకారం.. జీవో 58, 59లకు (ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల క్రమబద్ధీకరణ సంబంధిత జీవోలు) సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై సీసీఎల్‌కు ఆదేశాలు పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియపై కూడా ఉపసంఘం చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏయే జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, జిల్లాల కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ దిశగా అధికారులు కషి చేసి అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని కలిగించాలని సూచించింది. -
Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో భూములను విక్రయించి, రూ.కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి శివారు జిల్లాలను ఎంచుకుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 25.01 ఎకరాల భూములను విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం 1,21,060 చదరపు గజాల వేలంతో సుమారు రూ.15 వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధికంగా రంగారెడ్డిలో 11.3 ఎకరాలలో 54,692 గజాలను వేలం వేయనుంది. వీటిలో కోకాపేట, గండిపేట, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి హాట్ లొకేషన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి కొత్తగా వరంగల్ జాతీయ రహదారిలోనూ ప్రభుత్వ స్థలాలను వేలంలో పెట్టింది.. ఘట్కేసర్లోని కొర్రెములలో 2662 చదరపు గజాలను వేలం వేయనుంది. కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం, బౌరంపేట ప్రాంతాల్లోనూ స్థలాలను అమ్మనుంది. ఈసారి భూముల వేలం జాబితాలో వాలంతరీ, వీడీఓ, టూరిజం భూములు కూడా ఉండడం విశేషం, గతంలో ఈ భూములను ఐటీ హబ్‌కు కేటాయించాలని నిర్ణయించిన సర్కారు..తాజాగా వేలంలో పెట్టడం గమనార్హం. వేలంలో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో బౌరంపేటలో 302 గజాలు, అత్యధికంగా పుప్పాలగూడలో 9,680 గజాల స్థలాన్ని వేలం వేయనున్నారు. తాజా వేలంలో 2 వేల గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 16న రిజి్రస్టేషన్‌కు ఆఖరు గడు వు, 18న వేలం ఉంటుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. చదవండి: తగ్గిన స్థిరాస్తి లావాదేవీలు..!.. పెరిగిన ధరలు...రిజిస్ట్రేషన్ చార్జీలు మార్కెట్ రేటు రెండింతలు.. వేలంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మార్కెట్ రేటు రెట్టింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంచనా వేసిన రూ.15 వేల కోట్ల ఆదాయ సమీకరణ సులువు అవుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల వంటి ఐటీ, సంపన్నులుండే ప్రాంతంలో స్థలాల వేలం ఉండటంతో స్థానిక డెవలపర్లతో పాటు ఇతర రాష్ట్ర కంపెనీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతంలో గజానికి రూ.60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా.. ప్రస్తుతం మార్కెట్ విలువ అక్కడ సుమారు రూ.లక్షపైనే పలుకుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట, ఖానామెట్‌లో భూములను వేలం వేసినప్పుడు గజం రూ.1.50 లక్షలు పలకడంతో.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రారంభ ధరే రూ.1.50 లక్షలుగా నిర్ధారించారని ఓ డెవలపర్ తెలిపారు. కోకాపేట కంటే నల్లగండ్లలో నిర్ధారించిన ధర ఎక్కువగా ఉందంటే ఆయా ప్రాంతం వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఘట్కేసర్ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దేశించగా.. ఆయా ప్రాంతంలో అభివృద్ధి నేపథ్యంలో ఈ ధర ఎంతవరకు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది. -
అగ్రిగోల్డ్ నయా ‘భూ’గోతం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు సంస్థలకు చెందిన 76 ఎకరాల అమ్మకం వెలుగులోకి రావడం పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఇన్నాళ్లూ దర్యాప్తు చేసిన అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించిన తీరే కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బినామీ కంపెనీలుగా ఉన్న కంపెనీలకు చెందిన ఎకరాల కొద్దీ భూమిని ఓ మామూలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మకం చేయగా మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ చైర్మన్‌ను విచారించిన సీఐడీ.. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావును శుక్రవారం సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా, ఫరూక్నగర్ మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలుగా సీఐడీ భావిస్తున్న మోహనా గ్రోవిస్ ఇన్ఫ్రా, లియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాతంగి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఖిలేంద్ర ఇన్ఫ్రా ఆగ్రో వెంచర్స్ లిమిటెడ్‌కు చెందిన 76 ఎకరాల భూమి విక్రయ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట ఉన్న భూములను రాందాస్ అనే వ్యక్తి ఏ అధికారంతో విక్రయించారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత కంపెనీల డైరెక్టర్లు రాందాస్‌కు అధికారం ఇచ్చి ఉంటారా అనే విషయం తెలియదని అగ్రిగోల్డ్ చైర్మన్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ ప్రధాన కంపెనీల నుంచి బినామీ కంపెనీల్లోకి జరిగిన లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని కోరగా ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు డాక్యుమెంట్లు సీజ్ చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు తెలియవచ్చింది. అటాచ్ ప్రాపర్టీ విక్రయం ఎలా? అగ్రిగోల్డ్‌కు చెందిన 80 కంపెనీలతోపాటు బినామీ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 70 కంపెనీలకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాలు అటాచ్ చేస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చాయి. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన ఆస్తులు తెలంగాణ పోలీస్ శాఖ ఆటాచ్ చేసిన జాబితాలో లేవు. ఈ వ్యవహారంపై రామారావును సీఐడీ అధికారులు ప్రశ్నించగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ ఆస్తులను అటాచ్ చేసి ఉంటుందని, వాటిని ఎలా విక్రయించారో తనకు తెలియదని, 2016లో ఈ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు తాను జైల్లో ఉన్నట్లు రామారావు బదులిచ్చినట్లు సమాచారం. హైకోర్టులో అఫిడవిట్.. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడంపై గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. మాజీ కానిస్టేబుల్ అగ్రిగోల్డ్‌కు బినామీగా వ్యవహ రించినట్లు ఆ అధికారి కోర్టు తెలిపారని తెలిసింది. అయితే దర్యాప్తు సమయంలో ఈ బినామీ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించడంతోపాటు విక్రయాలు జరిగాయా లేదా అనే అంశాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారన్న విషయంపై ఇప్పుడు సీఐడీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ దర్యాప్తు అధికారిని సీఐడీ వెంటనే పక్కనపెట్టి మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో ఈ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా కొనగసాగుతున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ రియల్టీ రయ్..రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా కాలంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్-హెచ్1) నగరంలో 11,974 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4,782 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 150 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా ఈ ఏడాది హెచ్1లో కొత్తగా 16,712 యూ నిట్లు లాంచింగ్ కాగా.. గతేడాది ఇదే సమయంలో 4,422 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 278 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ జనవరి–జూన్ 2021’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది హెచ్1లో చదరపు అడుగు ధర సగటున రూ.4,673లుగా ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి ఒక శాతం పెరిగి రూ.4,720లకు చేరింది. ఇక అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది 4,037 యూనిట్లుండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 195 శాతం వృద్ధి చెంది 11,918 గృహాలకు చేరాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఈ ఏడాది హెచ్1లోను హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల హవానే కొనసాగిందని చెప్పారు. గృహాల విక్రయాలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరల సూచి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించడం ఈ వృద్ధికి కారణమని తెలిపారు. ప్రీమియం గృహాలదే హవా.. ఈ ఏడాది హెచ్1లో అన్ని తరగతుల వారి గృహాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూన్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే గృహాలు రికార్డ్ స్థాయిలో 240 శాతం, రూ.1–2 కోట్ల గృహాలు 158 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ప్రీమియం గృహాలకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది హెచ్1లో డెవలపర్లు ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గుచూపారు. గతేడాది హెచ్1లోని గృహాల లాంచింగ్స్‌లో రూ.1–2 కోట్ల ధర ఉండే యూనిట్లు 1,544 (18 శాతం) ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 4,444లకు (27 శాతం) పెరిగాయి. పశ్చిమ జోన్లోనే ఎక్కువ.. గృహాల విక్రయాలు, లాంచింగ్స్ రెండింట్లోనూ కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. అమ్మకాలలో 63 శాతం, ప్రారంభాలలో 64 శాతం వాటా వెస్ట్ జోన్ నుంచే ఉన్నాయి. గతేడాది హెచ్1 విక్రయాలలో నార్త్ జోన్ వాటా 16 శాతం ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. అలాగే లాంచింగ్స్‌లో 17 శాతం వాటా నుంచి 20 శాతానికి పెరిగింది. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు విక్రయం కాగా.. ఇందులో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజగుట్ట వంటి సెంట్రల్ జోన్లో 1,007 గృహాలు, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్ వంటి వెస్ట్ జోన్లో 7,505, ఉప్పల్, మల్కజ్గిరి, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్లో 862, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్ వంటి నార్త్ జోన్లో 2,145, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి సౌత్ జోన్లో 455 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 16,712 యూనిట్లు లాంచింగ్ కాగా.. సెంట్రల్ జోన్లో 933, వెస్ట్‌లో 10,767, ఈస్ట్‌లో 1,115, నార్త్‌లో 3,395, సౌత్జోన్లో 503 యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా.. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో గృహాల విక్రయాలలో 67 శాతం, లాంచింగ్స్‌లో 71 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది హెచ్1లో 99,416 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో 59,538 గృహాలు సేల్ అయ్యాయి. 2021 హెచ్1లో కొత్తగా 1,03,238 గృహాలు ప్రారంభం కాగా.. గతేడాది ఇదే సమయంలో 60,489 యూనిట్లుగా ఉన్నాయి. -
భూముల మార్కెట్ ధరలు పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు. భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం. -
డాక్టర్ నమ్రత మరో అక్రమ ‘కోణం’
సాక్షి, తిరుపతి: శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ పి.నమ్రత అక్రమాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. శిశువులతో వ్యాపారమే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో చేతులు కలిపి భూలావాదేవీల్లోనూ అక్రమాలకు పాల్పడి ప్రజల నుంచి భారీ ఎత్తున నగదు దోచుకున్నట్లు వెలుగుచూసింది. తిరుపతి పద్మావతీపురానికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్, వెంకటనరసమ్మ దంపతుల దగ్గర రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానంటూ సుమారు రూ.27 లక్షలు కాజేసి మోసం చేసిందని బాధితులు సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెళ్లబుచ్చారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చలపతి ద్వారా తమకు డాక్టర్ నమ్రత పరిచయమైందన్నారు. 2008లో చిక్‌బళ్లాపూర్ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.58లక్షలు విలువజేసే రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానని చెప్పి అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవాలని నమ్మబలికిందని, 2008 జనవరిలో వడ్డీకి అప్పు తెచ్చి రూ.27లక్షలు డాక్టర్ నమ్రతకు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు సమయం ఉండటంతో తమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా 2010లో మళ్లీ తమను సంప్రదించి నిర్ణయించిన ధరకంటే అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండు చేసిందని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సదరు భూమి వివరాలపై ఆరా తీయగా తమకు అగ్రిమెంట్ చేయించిన భూమిని 2008 మే నెలలో వేరేవారికి విక్రయించినట్లు తెలిసిందన్నారు. (పేగుబంధంతో పైసలాట!) ఈ విషయమై నిలదీయగా బెదిరింపులకు దిగిందని చెప్పారు. అప్పటి నుంచి 2014 వరకు పెద్ద మనుషుల పంచాయితీలతో కాలం గడిపిందని, 2015లో తాము హైదరాబాద్, విజయవాడ, చిక్‌బళ్లాపూర్‌లోని పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులతో కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసిందన్నా రు. ప్రభుత్వం, అధికారులు కలుగజేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
భూముల అమ్మకంతో బీఎస్ఎన్ఎల్కు ఊపిరి!
న్యూఢిల్లీ: తీవ్ర రుణ భారంతో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, దేశవ్యాప్తంగా తన అధీనంలో ఉన్న భూముల విక్రయంపై దృష్టి సారించింది. ఈ భూముల విలువ రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. విక్రయించాల్సిన భూముల జాబితాను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) పంపింది. ఏటేటా ఆదాయాలు పడిపోతూ, నష్టాలు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితుల్లో... భూములు, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ విక్రయం ద్వారా వచ్చే నిధులతో సంక్షోభం నుంచి బయటపడాలని సంస్థ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 32.77 లక్షల చదరపు మీటర్ల విస్తీరణంలో భవనాలు, ఫ్యాక్టరీలు ఉండగా, 31.97 లక్షల చదరపు మీటర్ల విడి భూమి ఉందని గతంలో బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా తెలుస్తోంది. ఇలా వినియోగంలో లేని భూమి పారదర్శక విలువ 2015 ఏప్రిల్ 1కి రూ.17,397 కోట్లు కాగా, ప్రస్తుత విలువ రూ.20,296 కోట్లుగా ఉంటుందని అంచనా. 2014–15 ద్రవ్యోల్బణ సూచీ వ్యయం ఆధారంగా ఈ విలువకు రావడం జరిగినట్టు బీఎస్ఎన్ఎల్ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి. అమ్మి, సొమ్ము చేసుకోవాలనుకుంటున్న వాటిల్లో ముంబై, కోల్‌కతా, పశ్చిమబెంగాల్, ఘజియాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ టెలికం ఫ్యాక్టరీలు, వైర్లెస్ స్టేషన్లు, ఇతర కార్యాలయ భవనాలు, ఉద్యోగుల కాలనీలు కూడా ఉన్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బీఎస్ఎన్ఎల్ రూ.14,000 కోట్ల నస్టాలను ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఆదాయం రూ.19,308 కోట్లుగా ఉండొచ్చని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభకు ఇచ్చిన సమాధానం ఆధారంగా తెలుస్తోంది. -
వసుంధర రాజెకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ భూమిని ఎన్హెచ్ఏఐకి విక్రయించి రూ 1.97 కోట్లు స్వీకరించారనే ఆరోపణలపై రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంలో వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 2010లో జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని వారు ఎన్హెచ్ఏఐకి విక్రయించే సమయంలో రూ 1.97 కోట్ల పరిహారం పొందారని ఆరోపణలున్నాయి. భూమిని విక్రయించే సమయంలో వసుంధరా రాజె అధికారంలో లేరు. ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్న వసుంధర రాజె, ఆమె కుమారుడు కలిసి ధోల్పూర్లోని ధోల్పూర్ ప్యాలెస్ వద్ద 567 చదరపు మీటర్ల భూమిని అక్రమంగా సొంతం చేసకుని దాన్ని ఎన్హెచ్ఏఐకి విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషన్ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ రాజె, ఆమె కుమారుడి నుంచి వివరణ కోరింది. తన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ రాజస్ధాన్‌కు చెందిన న్యాయవాది సృజన శ్రేష్ట సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. -
మార్కెట్ ధరకే ఏపీఐఐసీకి భూమి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలకు భూములను అమ్ముకునే ఏపీఐఐసీకి ప్రభుత్వం భూములను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సోమవారం సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ శాఖకు చెందిన భూమిని ఉచితంగా ఏపీఐఐసీకి ఎందుకు కేటాయించాలి? ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది? అని దినేష్‌కుమార్ వాకబు చేశారు. గతంలో మార్కెట్ ధరకు కేటాయించే విధానం ఉండేదని, ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కేటాయించే పద్ధతి తర్వాత వచ్చిందని అధికారులు వివరించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కాకుండా ఉచితంగానే కేటాయించాలని ఏపీఐఐసీ కోరింది. దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని’ రెవెన్యూ అధికారులు వివరించారు. నివేదిక సిద్ధం చేయండి ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు గతంలో ఉన్న జీవోలు, తర్వాత వచ్చిన జీవోలు, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఏవిధానం మంచిది? ఇందుకు ప్రామాణికాలేమిటి? అనే వివరాలతో పాటు జీవో కాపీలను కూడా జత చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దీనిపై సమీక్షించి ఏపీఐఐసీకి మార్కెట్ ధరకే భూములు కేటాయించడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అయితే ఆయన తీసుకునే నిర్ణయం అంతిమం కాదు. సీఎస్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేబినెట్‌దే అవుతుందని ఒక అధికారి తెలిపారు. -
భూమి విక్రయంపై విచారణ
కోరుట్ల : లే–అవుట్ నిబంధనలు పాటించకుండా భూముల అమ్మకాలు జరిపారని మున్సిపల్ చైర్మన్ శీలం వేణుపై హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో గురువారం మున్సిపల్ ఆర్డీ జాన్ శాంసన్, టౌన్ ప్లానింగ్ ఆర్డీ చంద్రిక గురువారం విచారణ జరిపారు. పట్టణంలోని 735, 756(ఈ) సర్వే నంబర్లలోని స్థలంలో లేఅవుట్ లేకుండా భూమి విక్రయించారని ఏడాదిక్రితం కోరుట్లకు చెందిన కటుకం దివాకర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 9వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ డీఎంఏను హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ కార్యాలయానికి మున్సిపల్ ఆర్డీ జాన్ శాంసన్, టౌన్‌ప్లానింగ్ ఆర్డీ చంద్రిక వచ్చారు. ఫిర్యాదుదారు దివాకర్‌ను విచారించిన అనంతరం భూమిని పరిశీలించారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు చైర్మన్ లేఖ ఇచ్చారని అధికారులు తెలిపారు. శుక్రవారం మరోమారు చైర్మన్‌ను విచారిస్తామని అనంతరం నివేదికను హైకోర్టుకు పంపుతామని చెప్పారు. అనంతరం ఆర్డీ చంద్రిక విలేకరులతో మాట్లాడుతూ లేఅవుట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగి ఉంటే మేలు జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించకుంటే ప్రజలపై భారం పడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి పాల్గొన్నారు. -
పాన్‌కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్
తణుకు :ఇకపై ఆస్తులు విక్రయించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. విధిగా పాన్ కార్డు ఉండాలంటూ సర్కారు నిబంధన విధించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పాన్‌కార్డు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్లు చేసేలా నిబంధనలు రూపొం దించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు దీని ని ప్రవేశపెట్టినప్పటికీ సామాన్యులకు మాత్రం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకుని ఆదాయ పన్ను ఎగవేసే వారికి ఇక చెల్లు చీటీ పాడవచ్చని భావిస్తున్నారు. నల్లధనాన్ని బయటకు రప్పించడంతో పాటు ఆదాయ పన్ను పెంచుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఇకపై ఆస్తులు అమ్మినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా పాన్‌కార్డు సమర్పించాల్సి ఉం టుంది. పాన్‌కార్డు నంబర్ ద్వారా క్రయ, విక్రయదారుల ఆర్థిక లావాదేవీలు బయటపడే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు భూములు, ఇళ్ల క్రయ, విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు పాన్‌కార్డు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో పాన్‌కార్డుతో పాటు ఫారం-61 కింద వివరాలు అందించేలా నమూనా రూపొం దించారు. క్రయ, విక్రయదారులు ఇద్దరూ పాన్‌కార్డు నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన పొందుపరిచారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి పాన్‌కార్డు లేకున్నా రిజిస్ట్రేషన్ చేయరు. నూతన విధానంలో ఎక్కడ రిజి స్ట్రేషన్ జరిగినా పాన్‌కార్డు ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసిపోతుంది. వారు సంబంధిత వ్యక్తి నుంచి ఆదాయ పన్ను రాబడతారు. తద్వారా సర్కారు ఆదాయం పెంచుతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల ఆస్తులు విక్రయించే వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారనుంది. -
నిలిచిన భూ సేకరణ
సాక్షి, కాకినాడ :జిల్లాలో భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా తయారైంది. నిధుల కొరతతో కొన్నిచోట్ల... కోర్టు కేసులతో మరికొన్ని చోట్ల భూసేకరణ ముందుకు సాగడం లేదు. కోర్టుల్లో పదేళ్లలో 353 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో 10వేల ఎకరాలకు పైగా భూసేకరణ ఆగిపోయింది. వీటి కోసం కేటాయించిన నిధుల్లో మూడోవంతువెనక్కి ్లపోగా, మిగిలినవి కొద్దోగొప్పో ఆయా శాఖల ఖాతాల్లో మూలుగుతున్నాయి. పెండింగ్‌లో కేసులు.. జనరల్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద సేకరించిన 4,180.51 ఎకరాలపై 188 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 5,219 ఎస్సీ లబ్ధిదారుల కోసం సేకరించిన 135.32 ఎకరాల భూసేకరణపై 23కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందిరమ్మ పథకంలో ఎంపిక చేసిన 30,418 మంది లబ్ధిదారుల కోసం ప్రతిపాదించిన 771.80 ఎకరాలపై 145 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 17,186 ఎకరాల్లో ఇప్పటి వరకు 12,716 ఎకరాలను మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 4,470 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీటిపై కేసులు కూడా కోర్టుల్లో నడుస్తున్నాయి. ఆవిరవుతున్న పేదల ఆశలు పెండింగ్ కేసులతో భూసేకరణ నిలిచిపోవడంతో నిరుపేదలకు సొంతింటికల కల్లగానే మిగిలింది. డివిజన్ల వారీగా చూస్తే కాకినాడ డివిజన్ పరిధిలో 12,390 మంది, రాజమండ్రి-6619మంది, రామచంద్రపురం- 1155 మంది, అమలాపురం-789 మంది, పెద్దాపురం-9455 మంది ఇందిరమ్మ లబ్ధిదారులున్నారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తలపెట్టిన భూసేకరణపై కేసులు పెండింగ్‌లో పడడం వలన కాకినాడ డివిజన్ పరిధిలో 2099మంది, రాజమండ్రి- 733 మంది, రామచంద్రపురం-920మంది, అమలాపురం-997, పెద్దాపురం-470 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఇంటిజాగా అందని ద్రాక్షగా మారింది. ఏమూలకూ చాలని మిగులు నిధులు కొత్త భూసేకరణ చట్టం-2013 జనవరి-1, 2014 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం జనవరి 1 తర్వాత సేకరించే భూములే కాదు..అవార్డు స్టేజ్ దాటని భూమి సేకరణ కూడా ఈ కొత్త చట్టం కిందే చేపట్టాలి. ప్రాంతాలను బట్టి మార్కెట్ రేటు కంటే రెండు లేదా మూడు రెట్ల అధికంగా పరిహారం ఇవ్వాల్సిందే. రాష్ర్ట విభజన నేపథ్యంలో భూసేకరణ కోసం కేటాయించిన నిధుల్లో మూడో వంతు నిధులు వెనక్కి మళ్లిపోయాయి. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైనా మిగిలిన నిధులు భూసేకరణకు ఏమూలకూ చాలవని అధికారులు చెబుతున్నారు. పదేళ్లుగా ఉన్న పెండింగ్ కేసుల్లో కనీసం 10శాతం కూడా అవార్డు స్టేజ్ దాటని విషయం గమనార్హం. మార్గదర్శకాలు జారీ అయితేనే.. కొత్త భూసేకరణ చట్టం అమలులోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా మార్గదర్శకాలు జారీ కాలేదు. పెండింగ్ కేసులు పరిష్కారమవడంతోపాటు మార్గదర్శకాలు జారీ అయితే కానీ భూసేకరణ పనులు ముందుకు సాగవని అధికారులు చెబుతున్నారు.