Landscaping
-
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
చతుర్భుజం.. మూసీ పునరుజ్జీవం..!
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కాలుష్యమయంగా మారిన మూసీ నదికి నాలుగు దశల్లో పునరుజ్జీవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతలో నదీ జలాల శుద్ధితోపాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే రెండో దశలో ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది. ఇక మూడో విడతలో మూసీ పరీవాహక కారిడార్లలో రవాణా హబ్‌లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం కసరత్తు మొదలుపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) తొలి విడత పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ. 1,763 కోట్లు) నిధులను సమకూరిస్తే మిగిలిన 70 శాతం (రూ. 4,100 కోట్లు) నిధులను ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ (పీపీఆర్)ను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టు పూర్తి..హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయిలో మూసీ పునరుద్ధరణకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూసీ నదిని శుద్ధి చేసి పర్యాటక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈస్ట్–వెస్ట్ కారిడార్ నిర్మాణం.. మూసీ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు మూసీ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం చేపట్టనుంది. నది వెంట తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ కారిడార్‌ను నిర్మించనుంది. దీనివల్ల ఔటర్ రింగ్‌రోడ్ నుంచి ప్రధాన నగరంలోకి రవాణా సులువు కానుంది. అలాగే మూసీ చుట్టూ 16–18 ప్రాంతాల్లో హెరిటేజ్ బ్రిడ్జీలను నిర్మించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తుల కోసం స్థలాలను కేటాయించనుంది. మూసీ వెంబడి రిక్రియేషనల్ జోన్లు, పార్క్‌లను కూడా ఏర్పాటు చేయనుంది. రీసైకిల్ వాక్‌వేలు, పార్కింగ్ ప్లేస్‌లు.. మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్ వేలు, పార్కింగ్ ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని రెయిన్ గార్డెన్లు, గ్రీన్ రూఫ్లను ఏర్పాటు చేయనుంది. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్ స్ట్రక్చర్లు, ఫ్లడ్ బారియర్లను కట్టనుంది. వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు వనరుల కేటాయింపు, ప్రణాళిక, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), కృత్రిమ మేథ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనుంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్బాండ్లను జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్పానర్ప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనుంది. -
పోర్టు పరిసరాల్లో కాలుష్యానికి చెక్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా విశాఖపట్నం పోర్టు అథారిటీ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పోర్టు చైర్మన్ డా.అంగముత్తు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ రాజశేఖర్‌రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు పోర్టు పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యాన్ని తగ్గించటం, కార్బన్ ఉద్గారాలను నిలువరించడమే ఈ ఎంవోయూ ముఖ్య ఉద్దేశమని చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం పోర్టు పరిసరాలలో గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయడం, పోర్టుకు వెళ్లే ప్రధాన జంక్షన్లలో రోడ్డు డివైడర్ల వద్ద పచ్చదనాన్ని పెంపొందించడం, పోర్టు కార్యాలయాలలో అవసరమైన మేరకు ల్యాండ్ స్కేపింగ్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చేస్తుందని ఎండీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దూబే, చీఫ్ ఇంజినీర్ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫామ్‌హౌస్ పాలసీ అవసరమే!
కరోనా మొదలయ్యాక అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు.. వీకెండ్ కావచ్చు కారణమేదైనా సరే సమయం దొరికితే సిటీకి దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలని కోరుకుంటున్నారు. అందుకే సామాన్య, మధ్యతరగతి వాసులు కూడా ఫ్లామ్ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 వేల గజాలపైన ఉన్న ఫామ్ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పెద్ద సైజు ప్లాట్లను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవటంతో సామాన్యులు పర్యావరణానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఫార్మింగ్, ఫామ్‌హౌస్‌లకు ప్రత్యేక పాలసీ అవసరం ఉందని ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ఫార్మింగ్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో బడా బాబులకే పరిమితమైన ఫామ్‌హౌస్ కల్చర్.. నేడు సామాన్యులు కోరుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు వందల ఎకరాలలో ఈ తరహా లేఅవుట్లను చేస్తున్నారు. సిటీకి దూరంగా 4, 5 గుంటల స్థలంలో పండ్ల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం పేరిట ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు డెవలపర్లు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్‌ప్లాట్స్ లేఅవుట్లను చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో సామాన్యులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఎక్కువగా ఈ తరహా వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్/ప్లాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకొస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఫామ్ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం స్కీమ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. 20 ఎకరాలు ఉంటేనే... కనీసం 20 ఎకరాల స్థలం ఉంటేనే అర్బన్ ఫార్మింగ్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యక్తిగత ఫామ్‌ప్లాట్ల విస్తీర్ణం 9 మీటర్ల వెడల్పుతో కనీసం 500 చ.మీ. ఉండాల్సిందే. ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రహదారి వెడల్పు, అంతర్గత రోడ్లు కూడా 9 మీటర్లు ఉండాలి. సెంట్రల్ ప్లాజాకు 60 అడుగుల వెడల్పు రహదారులు ఉండాలి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉండాలి. గ్రూప్ హౌసింగ్ నిర్మాణాల వలే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు కూడా సెట్‌బ్యాక్స్ ఉంటాయి. మొత్తం సైట్ ఏరియాలో 20 శాతానికి మించి నిర్మాణాలు ఉండకూడదు. అర్బన్ ఫార్మింగ్ పరిధిలోకి ఏమొస్తాయంటే? వ్యవసాయం, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్బోరికల్చర్, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సంబంధిత కార్యకలాపాలు, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటివి అర్బన్ ఫార్మింగ్ కిందికొస్తాయి. పశువుల షెడ్లు, స్టోరేజ్ షెడ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 5 శాతం వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇవి ఎత్తయినవిగా ఉండకూడదు. ఆయా నిర్మాణాలు సహజ వాతావరణానికి భంగం కలిగించకూడదు. నీటి వనరులు, కొండలను తొలగించడం వంటివి చేయకూడదు. ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత వరకు నీటి పునర్వినియోగం, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి చేపట్టాలి. క్లబ్‌హౌస్ వసతుల కోసం.. మొత్తం ఫామ్ప్లాట్ విస్తీర్ణంలో గరిష్టంగా 2 శాతం స్థలంలో మాత్రమే సెంట్రల్ స్క్వేర్/క్లబ్‌హౌస్, ప్లాజా వంటి నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వీటి ఎత్తుపై ఎలాంటి పరిమితులు ఉండవు కానీ జీవో నంబర్ 168 హైరైజ్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది నిర్మించే గృహాలతో పాటు సెంట్రల్ ప్లాజాలో రైతు మార్కెట్లు, బజార్, హాట్, స్థానిక కార్యాలయాలు, హస్తకళల ఎంపోరియం, మేళా, జాయ్ రైడ్స్, ఎగ్జిబిషన్ స్పేస్ మొదలైన వాటి ప్రదర్శన వంటివి ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక కార్యకలాపాల కోసం మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో 5 శాతం స్థలం వినియోగానికి అనుమతులుంటాయి. అయితే ఆయా నిర్మాణాలకు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం 12 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన రహదారులుండాలి. నాలా అవసరం లేదు.. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌ల అనుమతులు, నిర్వహణ, నియంత్రణ అన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలో ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో మినహాయించి అన్ని భూ వినియోగ జోన్లలో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు. కాకపోతే ఆయా జోన్ నిబంధనలకు లోబడే ఉండాలి. ఫామ్‌ప్లాట్ల ఫీజులు, డెవలప్మెంట్ చార్జీలు బిల్టప్ ఏరియా ప్రాంతానికి మాత్రమే ఉంటాయి. అవి కూడా రెసిడెన్షియల్ సైట్లతో సమానంగా ఉంటాయి. 50 ఎకరాల లోపు ఫామ్ప్లాట్లకు స్క్రూట్నీ ఫీజుగా రూ.20 వేలు, ఆ పైన వాటికి రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌లకు వ్యవసాయేతర భూ మార్పిడి (నాలా) అనుమతులు అవసరం లేదు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ సమయం వరకు భూమిని ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదన్నమాట. నిర్మాణాలు ఎలా ఉండాలంటే.. వ్యక్తిగత లేదా లీజు/అద్దెకు తీసుకునే ఫ్లామ్ప్లాట్ 10 శాతం స్థలంలో మాత్రమే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులుంటాయి. గరిష్టంగా జీ+1 లేదా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం ఉండాలి. మిగిలిన స్థలాన్ని అర్బన్ ఫార్మింగ్ కోసం వినియోగించాలి. వ్యవసాయ థీమ్ పార్క్స్, అగ్రికల్చర్ టూరిజం, రిసార్ట్ టూరిజం, స్టూడియో అపార్ట్మెంట్, కొంత కాంక్రీట్ వినియోగించి నిర్మించే వెర్నాక్యులర్ హోమ్స్, గ్రామీణ జీవనశైలిని తెలిపే థీమ్ సెట్టింగ్స్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తారు. ఫామ్ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లలో నీటి అవసరాల కోసం గ్రిడ్ లేదా పబ్లిక్ వాటర్ సప్లయి వ్యవస్థను వినియోగించడానికి వీలు లేదు కాబట్టి సొంతంగా నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. – సాక్షి, హైదరాబాద్ -
సూరజ్.. యంగ్ ఫార్మర్.. ద గ్రేట్!
♦ చిన్నప్పటి నుంచే పెరటి తోటల సాగుపై మక్కువ ♦ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూనే.. పన్నెండెకరాల్లో ప్రకృతి సేద్యం ♦ పాలేకర్ శిక్షణ పొందాక పూర్తిస్థాయి సేద్యం ♦ సూరజ్‌ను ప్రకృతి సేద్య ప్రచారకర్తగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం వయసు మళ్లిన వారు, మహిళలు తప్ప యువకులు వ్యవసాయంలో కొనసాగడం అరుదై పోతున్న ఈ కాలంలో కేరళ రాష్ట్రంలో ఒక విద్యార్థి సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సేంద్రియ పెరటి తోటలు, టెర్రస్ గార్డెన్ల సాగులో గత కొన్నేళ్లుగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. సి. ఎస్. సూరజ్ అనే విద్యార్థి ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను మక్కువతో చిన్నప్పటి నుంచే సాగు చేస్తూ.. ప్రకృతి వ్యవసాయదారుడిగా మారాడు. కేరళ – తమిళనాడు సరిహద్దులోని వాయనాడ్ జిల్లా చిరకంబాత్ ఇల్లం ఇరవయ్యేళ్ల సూరజ్ స్వస్థలం. తాతల నాటి ఐదున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎదురుగానే వాళ్ల ఇల్లు ఉంటుంది. తండ్రి కాంట్రాక్టర్ కావడంతో వ్యవసాయం కుంటుపడింది. అయితే, సూరజ్ తన తల్లి తోడ్పాటుతో ఇంటిపంటల సాగును కొనసాగించాడు. చిన్నప్పటి నుంచి అతని ఆలోచనలు వ్యవసాయం చుట్టూనే తిరిగేవట. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం.. పదిహేనేళ్ల ప్రాయంలో సూరజ్ ఇంటర్మీడియెట్‌లో చేరాడు. ఆ కొత్తలోనే తమకు దగ్గరలోని సుల్తాన్ బతేరి పట్టణంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం జరిగింది. ఆ ఐదు రోజుల శిబిరంలో సూరజ్ శ్రద్ధగా పాల్గొని వ్యవసాయాన్ని ప్రకృతికి అనుగుణంగా, స్వల్పఖర్చుతో ఎలా చేయాలో కూలంకషంగా తెలుసుకున్నాడు. తన జీవన గమ్యానికి మార్గం సుగమం అయినట్లు, స్పష్టత వచ్చినట్లు తోచింది. తమ పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేపట్టాడు. తల్లిదండ్రులు వెన్ను తట్టడంతో చదువు కొనసాగిస్తూనే చక్కని దిగుబడులు తీస్తున్నాడు. వ్యవసాయ విద్య.. ప్రకృతి సేద్యం.. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన తర్వాత ఏడాది తొలిగా ఎకరాలో శ్రీ పద్ధతిలో సూరజ్ వరిని సాగుచేసి 4 టన్నుల ధాన్యం దిగుబడి పొందాడు. ఆ ప్రాంతంలో అప్పటి సగటు దిగుబడికి ఇది రెట్టింపు కావడంతో సూరజ్ స్పీడు పెంచాడు. తన ఇంటికి 200 కిలోమీటర్ల దూరంలోని త్రిస్సూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారాంతాల్లో ఇంటికి వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఎకరంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు. 10 ఎకరాల్లో 15 రకాల కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నాడు. త్రివేండ్రం, కాలికట్, కొచ్చి వంటి నగరాల్లో ఆర్గానిక్ షాపులు, సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. ఇందులో 4 ఎకరాల్లో కాఫీ, మిరియాలు, లిచి, అవకాడో, బొప్పాయి, అరటి, ప్యాషన్ ఫ్రూట్ తదితరాలను మిశ్రమ సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో టమాటా తదితర కూరగాయలను, ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ఏడాదికి రూ. 7 నుంచి 8 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు సూరజ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగం చదువుకుంటూనే ప్రకృతి వ్యవసాయం కొన సాగిస్తున్న సూరజ్ ద్వారా యువతను వ్యవసాయంలోకి ఆకర్షించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం 2015కు ముందే ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ప్రకటించింది. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు నిర్వహించే ప్రచార, రైతు శిక్షణా శిబిరాల్లో సూరజ్ పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల గురించి వివరిస్తుంటారు. 2015లో, 2016 డిసెంబర్లో రెండుసార్లు కేరళ అసెంబ్లీలో ప్రసంగించాడు. ‘స్టూడెంట్ ఫార్మర్’ అవార్డు, కేరళ ప్రభుత్వ ‘కర్షక ప్రతిభ’ అవార్డును పొందాడు. చిక్కుడు గింజలతో ‘కునపజలం’! సూరజ్ పంటలకు పంచగవ్య, జీవామృతం, కునపజలం వాడుతున్నాడు. మాంసానికి బదులు చిక్కుడు గింజలను వాడుతూ ‘వెజిటేరియన్ కునపజలం’ తయారు చేసి వివిధ పంటలపై విస్తృతంగా వాడుతున్నాడు. 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల కునప జలాన్ని కలిపి.. నెలకు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. పంచగవ్యను భూసారం పెంపొందించడానికి ఏటా రెండు సార్లు ఇస్తున్నారు. 4సార్లు పిచికారీ చేస్తున్నారు. జీవామృతాన్ని ఏటా రెండుసార్లు భూమికి ఇస్తున్నారు. ఏటా ఎకరానికి ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు చల్లుతున్నారు. పంటలపై చీడపీడల బెడద పెద్దగా లేదని, కషాయాలతోనే కంట్రోల్ చేస్తున్నామని సూరజ్ తెలిపాడు. తనను చూసి కనీసం 20 మంది యువ రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం చేపట్టారని, తరచూ తనను సంప్రదిస్తుంటారన్నారు. (సూరజ్‌ను 085475 70865,smartsooraj2@gmail.com ద్వారా సంప్రదించవచ్చు) – సాగుబడి డెస్క్ -
మన్నికగా కడితేనే.. మార్కెట్లో గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటిని కొనేందుకు ముందుకొస్తారు సామాన్యులు. అలాంటి వారికి నాణ్యమైన ఇళ్లను అందించడం బిల్డర్ల బాధ్యత. అందుకే ఎక్కడ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా నాణ్యమైన నిర్మాణ సామగ్రినే వినియోగిస్తాం అంటున్నారు ట్రాన్స్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్‌రెడ్డి. ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు. రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాడ్ స్కేపింగ్, అంపి థియేటర్, 4 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. 2015 మే కల్లా నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మీ నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాడ్ స్కేపింగ్‌లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం.