Law and order issue
-
దక్షిణాఫ్రికా గనిలో హాహాకారాలు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులను మూసివేశారు. ఆయా గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ, అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఈ గనుల్లో పని చేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని స్టిల్‌ఫాంటీన్ గనిలో ఏకంగా 4 వేల మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీరంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నట్లు తెలిసింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిని అరెస్టు చేసి, శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టిల్‌ఫాంటీన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేసినట్లు సమాచారం. ఆహారం అందకపోతే వారు చచ్చినట్లు బయటకు వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారికి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణాఫ్రికా మంత్రి ఖుమ్బుడ్జో షావెనీ స్పష్టంచేశారు. వారంతా నేరానికి పాల్పడ్డారని, శిక్షించక తప్పదని అన్నారు. నేరగాళ్లకు సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో వేయి మందికిపైగా కారి్మకులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందక వారంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు.శాంతి భద్రతల సమస్యలు దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాల వద్ద మారణాయుధాలు ఉంటాయి. ఎంతకైనా తెగిస్తారు. అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన అధికారులపై దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలున్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. -
Manipur violence: రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంలో మహిళలు సమిధలుగా మారిన వైనాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. మే నాలుగో తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరులో తిప్పిన ఘటనకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా మణిపూర్‌లో శాంతిభద్రతలు, పోలీసుల పనితీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. సోమవారం జరిగిన కేసుల వాదోపవాదాలు మంగళవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందించింది. ‘ కేసులను సమర్థవంతంగా దర్యాప్తుచేయలేని స్థితిలో పోలీసులున్నారు. దర్యాప్తులో దమ్ము, చురుకుతనం లేదు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఆరువేలకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైతే ఎంత మందిని అరెస్టుచేశారు? నగ్న పరేడ్‌కు సంబంధించిన జీరో ఎఫ్ఐఆర్, సాధారణ ఎఫ్ఐఆర్, పూర్తి వివరాలు ఉన్నాయా ? హేయమైన ఘటన జరిగిన చాలా రోజులకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లోకి పోలీసులు కూడా వెళ్లలేని అసమర్థత. పరిస్థితి చేయి దాటడంతో అరెస్టులు చేయలేని దుస్థితి. అక్కడ అసలు శాంతిభద్రతలు అనేవే లేవు. రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 6,523 ఎఫ్ఐఆర్ల నమోదు కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. ‘ మేలో హింస మొదలైననాటి నుంచి ఇప్పటిదాకా 6,523 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నగ్న పరేడ్ ఉదంతంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో జువెనైల్సహా ఏడుగురిని అరెస్ట్‌చేశారు. ఘటన తర్వాత బాధిత మహిళల వాంగ్మూలం తీసుకున్నారు’ అని తెలిపారు. ఈ కేసులో 11 కేసులను సీబీఐకి బదిలీచేస్తున్నట్ల అట్నారీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. కాగా, వాంగ్మూలాల కోసం ఆ మహిళలను మళ్లీ విచారించవద్దని సీబీఐకు కోర్టు సూచించింది. తమ ముందు హాజరుకావాలని బాధిత మహిళలను సీబీఐ ఆదేశించిందన్న అంశాన్ని వారి లాయర్ నిజాం పాషా మంగళవారం కోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం పై విధంగా మౌఖిక ఆదేశాలిచ్చింది. ఏడో తేదీ(సోమవారం రోజు)న స్వయంగా హాజరై వివరాలు తెలపాలని మణిపూర్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 6,523 కేసుల్లో హత్య, రేప్, బెదిరింపులు, లూటీలు, విధ్వంసం ఇలా వేర్వేరుగా కేసులను విభజించి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
హైదరాబాద్ బ్రదర్స్ చెరోమాట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశంపై హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే చాలా సమస్యలు వస్తాయని నాగేందర్ ఆందోళన వ్యక్తం చేయగా, హైదరాబాద్ జిల్లా రెవిన్యూ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగిస్తే అభ్యంతరం లేదని ముఖేష్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ ఇరువురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్యాహ్న విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ కూడా హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై దాదాపు గంటకుపైగా చర్చించారు. ప్రధానంగా హైదరాబాద్‌కు సంబంధించి శాంతిభద్రతలు, రెవెన్యూ వంటి అంశాలపై స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో జరగబోయే చర్చ సందర్భంగా తాము ఈ అంశాలను లేవనెత్తి సవరణలు కోరతామని, అందుకు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైనా నేతలు చర్చించారు. హైదరాబాద్‌పైనే ఆంక్షలెందుకు?: దానం ‘హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని మేము గతంలోనే కేంద్ర మంత్రివర్గ బృందం సభ్యులకు వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ దృష్టికి కూడా తీసుకొచ్చాం. అయినప్పటికీ హైదరాబాద్‌లోని శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు హైదరాబాద్‌పైనే ఎందుకు? దీంతో చాలా సమస్యలు వస్తాయి.’ రెవెన్యూ పరిధిలో ఆంక్షలు ఓకే: ముఖేష్‌గౌడ్ ‘హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో మాత్రమే శాంతిభద్రతల అంశాన్ని పరిమితం చేయాలి. ఆ మేరకు పోలీస్ యంత్రాంగాన్ని గవర్నర్ చేతిలో పెడితే అభ్యంతరం లేదు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా ఈ అంశంపై సవరణ కోరతాం. మద్దతివ్వాలని డిప్యూటీ సీఎంను కోరాం.’