Laxmi Ratan Shukla
-
బెంగాల్ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
బెంగాల్ జట్టు కొత్త కోచ్ ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాను బెంగాల్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్( క్యాబ్) మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.బెంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 41 ఏళ్ల లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా వి రామన్‌ను నియమించారు. బెంగాల్ క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా అరుణ్ లాల్ గుర్తింపు పొందాడు. అతని పదవీకాలంలో, జట్టు 2019-20 రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు ఓడిపోయింది. అయితే గత నెల వరకు అరుణ్ లాల్ జట్టు కోచ్‌గా కొనసాగాడు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. అయితే కొత్తగా ఎంపికైన లక్ష్మీరతన్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రావాల్సింది. కానీ ఆయన బంగ్లాదేశ్ అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేక్ నాయర్‌ను నియమించడంపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా లక్ష్మీ రతన్ శుక్లా నియమితులయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా భారత్ తరఫున 3 వన్డేలు ఆడి ఈసారి 18 పరుగులు చేశాడు. అలాగే 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. శుక్లా బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు. -
మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమత ప్రభుత్వం నుంచి ఇప్పటికి ముగ్గురు మంత్రులు రాజీనామా చేసినట్లయింది. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెప్టెనైన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సీఎం మమతకు, గవర్నర్ జగ్దీప్కు పంపారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన శుక్లా తన ఎంఎల్ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన లక్ష్మీరతన్ శుక్లాను తమతో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. టీఎంసీ కుప్పకూలుతోందని, పార్టీపై మమతకు నియంత్రణ లేదని కాంగ్రెస్ విమర్శించింది. తమ పార్టీలో ఎవరు చేరాలనుకున్నా తలుపులు తెరిచేఉంటాయని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చెప్పారు. టీఎంసీ పతనం ఇంతటితో ఆగదని బీజేపీ ప్రతినిధి సమిక్ దుయ్యబట్టారు -
నా భార్యకు కరోనా సోకింది : రతన్ శుక్లా
కోల్‌కతా : తన భార్యకు కరోనా సోకిందని భారత మాజీ ఆల్ రౌండర్, మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తన భార్య స్మిత సన్యాల్ శుక్లాకు జులుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని రతన్ శుక్లా పేర్కొన్నారు. దీంతో మిగతా కుటుంబసభ్యులందరూ క్వారంటైన్లో ఉన్నామని చెప్పారు. స్మిత శుక్లా ప్రస్తుతం హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంటలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. రతన్ శుక్లా 1999లో క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన 47 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి సత్తా నిరూపించుకున్నారు. డిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన శుక్తా ప్రస్తుతం బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక బెంగాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 26 వేలు దాటగా మరణించిన వారి సంఖ్య 854కు చేరింది. కేసులు పెరుగుతున్నందున కంటైన్మైంట్ జోన్లలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. (కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్ ) -
శుక్లా సెకండ్ ఇన్నింగ్స్
బెంగాల్ మంత్రిగా ప్రమాణం న్యూఢిల్లీ: లక్ష్మీ రతన్ శుక్లా.. 90వ దశకం చివర్లో భారత వన్డే క్రికెట్ జట్టులో సభ్యుడు. దాదాపు 18 సంవత్సరాలు బెంగాల్ రంజీ క్రికెటర్. కెప్టెన్‌గా రంజీట్రోఫీ సాధించిన ఆటగాడు. ఈ సీజన్లోనూ రంజీ మ్యాచ్‌లు ఆడి... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శుక్లా.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 35 ఏళ్ల శుక్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశాడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన మమతా బెనర్జీ క్యాబినెట్లో తనే అందరికంటే పిన్న వయస్కుడు. ఇంకా శాఖను కేటాయించకపోయినప్పటికీ శుక్లాకు క్రీడా శాఖ దక్కే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో చేరిన శుక్లా ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి నటి రూపా గంగూలీపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక గతంతో పనిలేకుండా భవిష్యత్‌పై దృష్టి సారిస్తానని చెబుతున్నాడు. ‘నేటి నుంచి నా పాత రోజులను మర్చిపోవాలనుకుంటున్నాను. 1999 అనంతరం వన్డే జట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదు? నా రిటైర్మెంట్కు కారణాలేమిటి? అనేవి ఇక అనవసరం. ఇది నా రెండో ఇన్నింగ్స్. నిష్కల్మషంగా ప్రజా అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నాను. దీదీ అభ్యర్థిగా నన్ను హౌరా ప్రజలు ఆశీర్వదించారు. రాజకీయాలు విభిన్న పిచ్‌పై ఆడాల్సిన గేమ్. నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. దీదీ ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తాను’ అని శుక్లా తెలిపాడు. కెరీర్లో ఒడిదుడుకులు: 1997-98 సీజన్లో 16 ఏళ్ల శుక్లా తొలిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత సీజన్లో చూపిన ప్రతిభ ఆధారంగా సెలక్టర్ల దృష్టిలో పడిన తను వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే పెద్దగా రాణించకపోవడంతో ఆ తర్వాత నిరాదరణకు గురయ్యాడు. ఆడిన 3 వన్డేల్లో 18 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. అలాగే 137 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6,217 పరుగులు చేయగా ఇందులో 9 సెంచరీలున్నాయి. మరోవైపు ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు గతేడాది సన్‌రైజర్స్ జట్టులోనూ ఉన్నాడు. -
క్రికెట్‌కు గుడ్ బై చెప్పి.. మంత్రి అయ్యాడు
కోల్‌కతా: బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా దేశవాళీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లో శుక్లా కు బెర్తు దొరికింది. 35 ఏళ్ల శుక్లా ఇక మీదట పశ్చిమబెంగాల్ మంత్రి. పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మమతతో పాటు 42 మంది మంత్రులు ప్రమాణం చేశారు. 18 ఏళ్ల దేశవాళీ క్రికెట్ కెరీర్‌కు గత డిసెంబర్లో గుడ్ బై చెప్పిన శుక్లా ఎన్నికలకు ముందు తృణమాల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన శుక్లా తొలిప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి పోటీచేసిన శుక్లా దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పాఠక్‌ను ఓడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో క్రీడా ప్రముఖులు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ (కేరళ), భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (పశ్చిమబెంగాల్) ఓటమి చవిచూడగా, శుక్లా మాత్రం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు ఏకంగా మంత్రి అయ్యారు. శుక్లా టీమిండియా తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడారు. -
క్రికెట్‌కు శుక్లా గుడ్‌బై
బెంగాల్ వెటరన్ ఆల్‌రౌండర్ లక్ష్మీ రతన్ శుక్లా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. ‘గత నెల రోజులుగా నాకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. తిరిగి ఆడటానికి మానసికంగా సిద్ధంగా లేను. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఇప్పుడు వీడ్కోలు పలికాను కాబట్టి ప్రశాంతంగా పడుకుంటా’ అని 34 ఏళ్ల శుక్లా వెల్లడించాడు. తన సేవలు అవసరం అనుకుంటే బగాన్ క్లబ్ తరఫున పని చేస్తానన్నాడు. భారత్ తరఫున మూడు వన్డేలు ఆడిన శుక్లా 18 పరుగులు చేశాడు. -
శుక్లా అవుట్... శర్మ ఇన్
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లక్ష్మీ రతన్ శుక్లా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బిపుల్ శర్మకు జట్టులోకి తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా శుక్లా ఐపీఎల్-8కు దూరమయ్యాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 31 ఏళ్ల బిపుల్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఎడంచేతివాటం బ్యాట్స్ మన్. 2010 నుంచి 2013 వరకు అతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు.