శుక్లా అవుట్... శర్మ ఇన్
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లక్ష్మీ రతన్ శుక్లా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బిపుల్ శర్మకు జట్టులోకి తీసుకున్నారు.
అనారోగ్యం కారణంగా శుక్లా ఐపీఎల్-8కు దూరమయ్యాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 31 ఏళ్ల బిపుల్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఎడంచేతివాటం బ్యాట్స్ మన్. 2010 నుంచి 2013 వరకు అతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు.