laxmikanth parsekar
-
రాహుల్ వచ్చారు.. ఎమ్మెల్యే వెళ్లిపోయారు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా పర్యటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయన అలా అడుగుపెట్టారో లేదో, పలువురు నేతలు ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పారు. ''గోవాలో రాహుల్ గాంధీ పర్యటన ప్రభావం ఏంటో చూడండి.. మొదటిరోజు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు'' అని మార్గోవా నియోజకవర్గంలో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా పర్సేకర్ అన్నారు. ఈనెల 17వ తేదీ శనివారం నాడు రాహుల్ గాంధీ గోవాలో పర్యటించగా.. అదే రోజు ఆ పార్టీ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. రెండో రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ అస్గావ్కర్ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని.. ఇప్పుడు ఇంకెంత మంది ఆ పార్టీని వీడి బయటకు వస్తారో చూడాల్సి ఉందని అన్నారు. అస్గావ్కర్ ఎంజీపీలో చేరారు. తన ర్యాలీకి కనీసం 50 వేల మంది తక్కువ కాకుండా తీసుకురావాలని స్థానిక నాయకులకు రాహుల్ గాంధీ చెప్పగా.. కేవలం కొన్ని వేల మంది మాత్రమే వచ్చారని సీఎం అన్నారు. బస్సులన్నీ ఖాళీగా వచ్చాయని ఎద్దేవా చేశారు. -
'ఛేంజింగ్ రూం స్కాం'పై ఉన్నతస్థాయి విచారణ: సీఎం
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన 'ఛేంజింగ్ రూం స్కాం'పై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోందని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. పనజికి సమీపంలోని కండోలిమ్ నగరంలోగల ఫ్యాబ్‌సిటీ అనే ఓ బొటిక్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దుస్తులు కొనుక్కుని వాటిని ట్రై చేస్తుండగా.. ఆ ట్రయల్ రూం బయట కెమెరా ఉండటాన్ని గుర్తించారు. దానిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్లింది. తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి రెండు రోజులు గోవాలో సరదాగా సెలవులు గడిపేందుకు వచ్చిన స్మృతి ఇరానీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. అందులోనూ బీజేపీయే అధికారంలో ఉన్న గోవా రాష్ట్రంలో ఇలా జరగడంతో అంతా గందరగోళం చెలరేగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. కెమెరాను కావాలని ఏర్పాటుచేశారా లేదా నిఘా కోసం పెట్టినదేనా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. గోవా రాష్ట్రం మహిళలకు, పర్యాటకులకు అత్యంత సురక్షితమైన ప్రదేశమేనని ఆయన చెప్పారు. -
గోవా కొత్త సీఎంగా పర్సేకర్
-
గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణస్వీకారం
గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపికైన విషయాన్ని తొలుత బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గోవా ముఖ్యమంత్రి రేసులో ఒకవైపు పర్సేకర్, మరోవైపు ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం పర్సేకర్వైపే మొగ్గుచూపింది. మనోహర్ పారిక్కర్ కేంద్ర మంత్రిగా వెళ్తుండటంతో ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా పర్సేకర్‌ను ఎంపిక చేశారు. పర్సేకర్ పేరును పాత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ ప్రతిపాదించగా, ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు. కాగా కొత్త మంత్రివర్గంలో కూడా డిసౌజా ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఎంఎస్సీ, బీఈడీ చదివి, గోవా రాష్ట్ర ఆరోగ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ముందునుంచి బీజేపీలోనే ఉన్నారు. 1956 జూలై 4వ తేదీన యశ్వంత్ పర్సేకర్, చంద్రభాగ పర్సేకర్ దంపతులకు ఈయన జన్మించారు. గోవాలోని మాండ్రెం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో గోవాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిన తర్వాత ఈయన మంత్రిపదవి చేపట్టారు. రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు ఈయన అత్యంత విశ్వాసపాత్రుడన్న పేరుంది.