బ్రిక్స్ దేశాల వృద్ధికి కృషి: కామత్
న్యూఢిల్లీ: బ్రిక్స్ (బీఆర్ఐసీఎస్) బ్యాంక్‌కు తనను మొట్టమొదటి ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసినందుకు మోడీ ప్రభుత్వానికి ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు, బ్రిక్స్ దేశాలకు సేవలు అందించే దిశలో కార్యకలాపాల ప్రారంభంపై తాను దృష్టిసారిస్తానని కామత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు షాంఘై ప్రధాన కేంద్రంగా గత ఏడాది కొత్త డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి.
ఒప్పందం ప్రకారం బ్యాంక్ మొట్టమొదటి ప్రెసిడెంట్‌ను ఎంపిక చేసే హక్కు భారత్‌కు లభించింది. దేశంలోని పలు కంపెనీల్లో బోర్డ్ స్థాయి బాధ్యతలకు రాజీనామా చేసిన తర్వాత, కామత్ బ్రిక్స్ బ్యాంక్ చీఫ్‌గా 10 రోజుల్లో బాధ్యతలు చేపడతారని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.