legal notoces
-
ఘజియాబాద్ వీడియో: ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్ స్టేషన్‌కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్ చేసిందంటూ ట్విటర్‌పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్ చేశారు. కానీ, ట్విటర్ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్ ఎండీని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్‌పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్ సమద్‌పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది. Ghaziabad Police sent legal notice to Managing Director of Twitter India over viral video of an elderly man in Loni being assaulted with the intent of "provoking communal unrest" The MD has been asked to come to the Police Station Loni Border & record the statement within 7 days pic.twitter.com/u5Ct8Omq6l — ANI UP (@ANINewsUP) June 18, 2021 టైం కావాలి ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ట్విటర్ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్ కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఏం రాహుల్.. విషం నింపుతున్నావా? -
ఆంధ్రజ్యోతి పత్రికకు లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి పత్రికకు రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ సహా మరో ముగ్గురు బాధ్యులకు శనివారం ఈ నోటీసులను పంపారు. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హనీ ట్రాప్‌ను ఆపాదిస్తూ ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో నిరాధార వార్తా కథనం పచురణపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనం కలెక్టర్ల వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడి అని కలెక్టర్లు మండిపడ్డారు. కలెక్టర్లు అందరూ కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నామని పేర్కొన్నారు. (‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం) అర్హులకు వాటిని అందించడంలో, అవినీతి లేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా దేశంలోనే ఏపీలో కలెక్టర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని పేర్కొన్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో దాడి చేస్తోందని మండిపడ్డారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే నిరాధార కథనాలని దురుద్దేశపూర్వకంగా వండి వారుస్తున్నారని కలెక్టర్లు తెలిపారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ సాగుతోందని వివరించారు. తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేస్తున్న తమపై ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయం. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయని మండిపడ్డారు. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కుట్రకోణం ఇందులో కనిపిస్తోందన్నారు. వీటిని చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లు స్వేచ్ఛగా పని చేయలేరని అన్నారు. అందుకే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని కలెక్టర్లు తెలియజేశారు. -
స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'. ఈ మూవీతో గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశాడు షారుక్. అయితే 'ఫ్యాన్' మూవీ పెద్దలకు ఢిల్లీకి చెందిన ఓ మిఠాయివాలా షాకిచ్చాడు. నిర్మాతలు, హీరో షారుక్, మరికొందరికి లీగల్ నోటీసులు పంపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వీట్ బ్రాండ్ కు సంబంధించి మూవీలో ఉన్న సీన్లు, డైలాగ్స్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే... ఫ్యాన్ మూవీలో గౌరవ్ పాత్రలో కనిపించే షారుక్ స్వీట్ బాక్స్ తీసుకుని హీరో ఆర్యన్ ఖన్నా(హీరో షారుక్)ను కలిసేందుకు వెళ్లే సీన్ గుర్తుంది కదా. ఆ స్వీట్ బాక్స్ పై 'ఘంటేవాలా' అనే పేరు కనిపిస్తుంది. ఈ స్వీట్ షాపు ఓనర్ సుశాంత్ జైన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తన అనుమతి లేకుండా, తమను సంప్రదించకుండా తమ బ్రాండ్ ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తూ యశ్‌రాజ్ ఫిల్మ్స్, ఆదిత్యా చోప్రా, దర్శకుడు మనీష్ శర్మ, రైటర్స్ హబీబ్ ఫైజల్, శరత్ కథారియా, హీరో షారుక్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపించాడు.