Legislature meeting
-
రేవంత్‌రెడ్డి వర్సెస్ హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు ఆరోపణలు.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించడంతో.. ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. గతంలో తమ ప్రభుత్వం చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదేమని నిలదీశారు.ఇంతలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. ‘‘హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7 వేలకోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో రూ.700 కోట్లు దండుకున్నారు. బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ఖర్చు విషయంలో గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లే అంటున్నారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు.. కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి.. ఎన్ని వేలకోట్ల విలువైన భూములు అమ్ముకున్నారో లెక్కలు తీద్దాం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేశారు. మీరు నిజాయతీ పాలన అందించి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.అబద్ధపు గ్యారంటీలతో పరువు తీశారు: మాజీమంత్రి హరీశ్రావుసీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కరువు, వలసలకు రేవంత్‌రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ‘‘బతుకమ్మ చీరల విషయంలో సీఎం మహిళలను అవమానపరిచారు. దీనిపై క్షమాపణ చెప్పాలి. ఆరు గ్యారంటీలపై రాహుల్ గాం«దీతో హామీ ఇప్పించారు. సోనియాగాం«దీతో కూడా లేఖ రాయించారు. కానీ అమలు చేయలేక.. సోనియా గౌరవం పోగొట్టారు. రాహుల్ పరువు తీశారు.పేగులు మెడలో వేసుకుంటా, లాగులో తొండలు విడుస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వాడిన రాక్షస భాషను చూసి జనం భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ గౌరవం పోగొట్టవద్దని కోరుకుంటున్నాం’’ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 500 హత్యలు, 1,800 అత్యాచారాలు జరిగాయని.. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని చెప్పారని.. కానీ ప్రజాపాలనలో మొదటి రోజు తప్ప మళ్లీ అక్కడ కనిపించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పారీ్టయే పెద్ద ధోకా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులంతా ‘ధోకా.. ధోకా..’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. -
ఛత్తీస్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాయ్‌పూర్: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్‌పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్పూర్ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీనే విజయబావుటా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలకు విష్ణుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నిలక హామీ ప్రకారం వెంటనే హౌజింగ్ పథకం కింద 18 లక్షల ఇళ్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. రాయ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీకి 54 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అధిష్టానం పంపిన పర్యవేక్షకులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లు హాజరయ్యారు. సమావేశం తర్వాత రాష్ట్ర గవర్నర్‌ను విష్ణుదేవ్ తదితరులు కలిశారు. దీంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆహా్వనించారని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బీజేపీ 54 చోట్ల గెలిచింది. సర్పంచ్‌గా మొదలై ఆదివాసీ సీఎం దాకా... ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో తప్కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్‌గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్‌ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్ తాత బుద్ధనాథ్ సాయ్ 1947–52 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. -
అందరినీ కూడగట్టి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి టీఆర్ఎస్ చొరవ చూపుతుందని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ రెండోవారంలో సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదు. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మతవిద్వేషాలను రెచ్చగొట్టి... ప్రజలను విభజిస్తూ, భావోద్వేగాలతో రాజకీయ లబ్దిపొందుతోంది. దేశానికి నష్టం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ చతికిలపడింది. బడేభాయ్ వెంటే చోటేభాయ్ అన్నట్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి సరైన మార్గం చూపడంలో విఫలమయ్యాయి. దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. బీజేపీ విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది’అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు. ‘ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీం విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడాను. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండోవారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంలో దిట్ట మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో తప్పుడు విధానాలు, ప్రచారాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందన్నారు. కాంగ్రెస్ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతరపక్షాలపై పడిందన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతూ సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చింది. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతున్నది. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంగారుబాతులను అమ్మేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట మోదీ సర్కారు వాటిని ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోంది. వాజ్‌పేయి, మన్మోహన్ హయాంలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తూ మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది’అని కేసీఆర్ విమర్శించారు. ‘లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవ, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేస్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’అని కేసీఆర్ ప్రశ్నించారు. బంగారుబాతు లాంటి ఎల్ఐసీతో పాటు రైల్వేలు, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ లాంటి నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేట్ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందిని తెలిపారు. ‘1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల భారతదేశం వెనక్కిపోతున్నది’అని విమర్శించారు. -
ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు: కేసీఆర్
-
మనమే మాట్లాడాలి!
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ • ప్రతిపక్షాలకు ఎజెండాయే లేదు • సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం • మంత్రులు సహా అంతా సభలో హుందాగా ఉండాలి • ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు • అధికారపక్ష సభ్యుల హాజరు నూరుశాతం ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్య క్రమాలను అసెంబ్లీ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిద్దామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదని, అందువల్ల మనమే మాట్లా డాలని, సమయాన్ని సద్వినియోగం చేసు కోవాలని స్పష్టం చేశారు. గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ‘‘సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదు. ఏం మాట్లాడినా మనమే మాట్లాడాలి. బీఏసీ సమావేశానికే విపక్షాలు నాలుగైదు అంశాల పాయింట్లు రాసుకుని వచ్చాయి. అత్యధిక సభ్యులం మనమే ఉన్నాం. మన సమయం మనం వినియోగించుకుందాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ విషయంలో నిక్కచ్చిగా ఉందామని, నిర్ణీత గడువులోగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సభ్యులు అడిగిన ప్రశ్నల పరిధిలోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం ఇస్తూ, విషయం నుంచి ఎందుకు పక్కకు పోతున్నారని కూడా ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఇతర సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి దురుసుకు పోవద్దని, సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. అందరూ రావాల్సిందే.. ఈ సమావేశాలు కీలకమైనవని, పార్టీ సభ్యుల హాజరు నూటికి నూరుశాతం ఉండాల్సిందే నని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సమావేశం ముగిసే వరకూ ఉండాలని, తప్పని పరిస్థితి అయితే, ఆయా జిల్లాల మంత్రులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ‘‘మంత్రులు కంట్రోల్లో ఉండాలి. ప్రశ్నలకు గణాంకాలు సహా సంతృప్తికర సమాధానాలివ్వాలి. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇద్దాం. ఎక్కువ రోజులు సభ జరపాలని విపక్షాలు కోరుతున్నాయి. అవసరమైతే సమావేశాలను పొడిగిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా.. నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలో తీసుకున్న నిర్ణయం కాదని, అది మన అంశమే కాదని.. విపక్షాలు కోరినందున చర్చకు పెడుతున్నామని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని, తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక తొలిరోజు మండలిలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడతారని, రెండో రోజు మండలిలో నోట్లరద్దు అంశంపై తాను మాట్లాడతానని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే అదే సమయంలో ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువెళుతున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో మనకూ నష్టం జరిగిందని, ఆదాయం పడిపోయిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందన్నారు. ‘నాగం’ బండారం బయటపెట్టండి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల్లే వంటూ చెన్నైలోని ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ’ నుంచి బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్టే తీసుకువచ్చిన అంశంపై భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఎవరూ భయపడొద్దని, ప్రాజెక్టు ఎక్కడికి పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మహబూబ్‌నగర్ ప్రజలకు వాస్తవాలు వివరించాలని, నాగం బండారం బయట పెట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ ప్రెస్మీట్లు పెట్టి నాగం ఆ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తున్న విషయాన్ని బయటపెట్టాలని చెప్పారు. -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం శనివారం సమావేశం కానుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై కార్యాచరణపై చర్చిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, విభజన సమయంలో రాష్ట్రానికి దక్కిన హామీలను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమలు విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం.. రాష్ట్రంలో కరువు, రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర, రాజధాని భూసమీకరణ, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని ఆ పార్టీ భావిస్తోంది.