హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం శనివారం సమావేశం కానుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై కార్యాచరణపై చర్చిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, విభజన సమయంలో రాష్ట్రానికి దక్కిన హామీలను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమలు విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం.. రాష్ట్రంలో కరువు, రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర, రాజధాని భూసమీకరణ, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని ఆ పార్టీ భావిస్తోంది.