letter to PM Narendra Modi
-
ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
తిరువనంతపురం: ‘ప్రస్తుతం మా రాష్ట్రంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా బాధితులు చేరుతుండడంతో అవసరమైన వారికి ఆక్సిజిన్ అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. మాకే కొరతగా ఉంది.. ఇక ఇతరులకు మేం పంపలేం’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేరళలో నెలకొన్న కరోనా పరిస్థితులను లేఖలో సీఎం పినరయి వివరించారు. ‘ఆక్సిజన్ నిల్వలతో పాటు పలు విషయాలపై సోమవారం సీఎం పినరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో 219 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాలకు పంపాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇతరులకు పంపలేం. ఆక్సిజన్ నిల్వలు 450 టన్నుల నుంచి 80 టన్నులకు చేరింది. ఇకపై తమిళనాడు, కర్నాటకకు ఆక్సిజన్ పంపడం కుదరదు. మీరే ఆక్సిజన్ విషయంలో కేరళకు సహాయం చేయాలి. ద్రవ పదార్థ ఆక్సిజన్ సరఫరా కోసం క్రయోజనిక్ ట్యాంకర్లు పంపండి. ప్రస్తుతం కేరళలో నాలుగు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భవిష్యత్‌లో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా కుదరదు.’ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు -
ప్రజలకు కష్టాలు.. ప్రభుత్వానికి లాభాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి కష్టాల్లో ఉన్న ప్రజల నుంచి లాభాలు దండుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. రాజధర్మాన్ని పాటించి తాత్కాలికంగా ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని వెనక్కి తీసుకోవడం ద్వారా ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పెరుగుతున్న ఇంధన, గ్యాస్ ధరలతో ప్రతి పౌరుడు పడుతున్న ఇబ్బందులను మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. దేశంలో ఒక వైపు ఉద్యోగాలు, వేతనాలు, గృహ ఆదాయాలు క్రమక్రమంగా కోల్పోతున్న పరిస్థితి ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాల జీవనం కష్టతరంగా మారింది. వీటికి తోడు నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి ప్రభుత్వం లాభాలు గుంజుతోంది’అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరుకుందనీ, డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పైకి పాకుతుండటంతో కోట్లాది మంది రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలకు గత ప్రభుత్వాలదే బాధ్యతంటూ మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వాలు, అందుకు విరుద్ధంగా పనిచేయడం తగదన్నారు. -
కరోనా ప్రభావమే ఎక్కువ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది. కరోనా కంటే ముందు నుంచే ప్రతికూలంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మరింత ముంచేసిందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని రుణ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆదుకోవాలని ఈ మేరకు క్రెడాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అర్ధంతరంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని లేఖలో కోరింది.‘‘వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించేది రియల్టీ రంగమేనని, స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లోనూ రియల్టీకి సింహ భాగం వాటా ఉందని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రియల్టీ మీద ఆధారపడి సిమెంట్, స్టీల్, రంగుల వంటి సుమారు 250 అనుబంధ రంగాలున్నాయని’’ లేఖలో సభ్యులు పేర్కొన్నారు. నగదు లభ్యత, ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి కొరత వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు. లేఖలోని ప్రధానాంశాలివే.. ► 2008లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎలాగైతే వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అమలు చేసిందో.. అలాగే ఇప్పుడు కూడా తీసుకురావాలని, అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేయాలి. 2019 డిసెంబర్ 31 నాటికి ఉన్న అన్ని రియల్టీ రుణ ఖాతాలను పునర్వ్యవస్థీకరించాలి. ► అన్ని బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనా న్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) ఎలాంటి అదనపు సెక్యూరిటీ లేకుండా ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్లలో 20 శాతానికి సమానమైన అదనపు రుణాన్ని అందించాలి. అలాగే సంబంధిత ప్రాజెక్ట్‌ను ఎన్పీఏగా పరిగణించకూడదు. ► కరోనా ప్రభావం తగ్గేవరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జరిమానాల మీద వసూలు చేసే వడ్డీలను ఏడాది పాటు నిలిపివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉన్న నివాస ఆస్తులకు మూలధన లాభాల పన్ను ఉండకూడదు. ► గృహ నిర్మాణ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి కొత్త గృహాల మీద వడ్డీ రేటును గరిష్టంగా 5%కి తగ్గించాలి. అలాగే నెలవారీ వాయిదా (ఈఎంఐ) వడ్డీ రాయితీని మరొక ఐదేళ్ల పాటు పొడిగించాలి. సెక్షన్–24 కింద గృహ రుణం మీద వడ్డీ మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలి. ► నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో కొనుగోలుదారుల తరుఫున డెవలపర్లు చెల్లించే ఈఎంఐ సబ్వెన్షన్ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌బీ, ఆర్బీఐలను కోరింది. -
ప్రధానికి వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ
సాక్షి, కడప : యూరేనియం టైల్‌పాండ్ వ్యర్థాల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. టైల్ పాండ్ వ్యర్థాల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే పంటలు, పశు సంపద సైతం దెబ్బతింటోందని, ఈ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ప్రధాన మంత్రికి వైఎస్ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందించాలని కోరారు. యూసీఐఎల్ సీఎండీ త్వరగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. -
పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పరిగణించండి..
-
పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పరిగణించండి..
న్యూఢిల్లీః పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్ ను ఉగ్రవాద రాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ పేరున ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో పాటు, పార్లమెంట్ తీర్మానాన్ని రాజీవ్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధానికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు సభ్యులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లును ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాను ప్రకటించాలని వారు ఆ బిల్లులో కోరారని రాజీవ్ తన లేఖలో వివరించారు. ఆర్ 6069, లేదా పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లు ఆమోదంపై ఒబామా సర్కారు అధికారికంగా సమాధానం ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు కోరినట్లు రాజీవ్ చంద్రశేఖర్ లేఖలో ప్రధానికి తెలిపారు.