levy
-
సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం
ఖనిజాలు, గనులు కలిగిన భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా మైనింగ్ కంపెనీలపై రూ.1.8 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని అంచనా.భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) సుప్రీం తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని ఫిమి పేర్కొంది.ఈ సందర్భంగా ఫిమి అడిషనల్ సెక్రటరీ జనరల్ బీకే భాటియా మాట్లాడుతూ..‘మైనింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2005 నుంచి పొందిన రాయల్టీలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు మైనింగ్ భూమిపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పింది. దాంతో కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గనులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా మైనింగ్ కంపెనీలు భారీగా పన్నులు చెల్లిస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్లు కాదు..వీరి గురించి తెలుసా..ఇదిలాఉండగా, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కంపెనీలు గత 12 ఏళ్ల నుంచి రాయల్డీ బకాయిలు చెల్లించడం భారం అవుతుంది. ఇప్పటికే చాలా ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీనికితోడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా. ఖనిజాలను ముడిసరుకుగా ఉపయోగించుకుని తయారయ్యే ప్రతి వస్తువుపై దీని ప్రభావం ఉంటుంది. కోర్టు తీర్పు పాటించాలంటే కంపెనీలు తన జేబులో నుంచి డబ్బులు వెచ్చించవు. తిరిగి వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతాయి. దానివల్ల సామాన్యుడికే నష్టమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆ రైళ్లలో సూపర్‌ఫాస్ట్ బాదుడు
సాక్షి,న్యూఢిల్లీ: రైల్వేలను లాభాల ట్రాక్‌పైకి ఎక్కించాలనే తపన ప్రయాణీకులకు పెనుభారమవుతోంది. తాజాగా 48 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులపై అదనపు భారం పడింది. అయితే ఆయా రైళ్ల సగటు వేగాన్ని కేవలం 5 కిలోమీటర్లు పెంచి అధికారులు చేతులుదులుపుకున్నారు. రైళ్లు సకాలంలో నడిచే పరిస్థితి లేకపోవడం, వేగాన్ని పెద్దగా పెంచకపోవడంతో అప్‌గ్రేడేషన్‌తో ప్రయాణీకులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. నవంబర్ 1న వెల్లడించిన టైమ్‌టేబుల్ ప్రకారం అప్‌గ్రేడ్ చేసిన రైళ్ల సగటు వేగాన్ని గంటకు 50 కిమీ నుంచి 55 కిమీకి పెంచారు. పొగమంచు కారణంగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సీజన్ ఆరంభంలో సూపర్‌ఫాస్ట్ లెవీని విధించడం ప్రయాణీకులకు ఏరకంగానూ ఉపయోగపడదని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ధి వంటి ప్రీమియర్ సర్వీసులు సహా అన్ని రైళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసిన రైళ్లలో కొత్తగా ప్రయాణీకుల కోసం అదనంగా ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదు. అయినా ప్రయాణీకులు స్లీపర్ క్లాస్‌కు అదనంగా రూ 30, సెకండ్, థర్డ్ ఏసీలపై రూ 45, ఫస్ట్ ఏసీ క్లాస్‌పై రూ 75 సూపర్‌ఫాస్ట్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.సూపర్‌ఫాస్ట్ లెవీగా అదనంగా రూ 70 కోట్లు సమీకరించాలని రైల్వేలు అంచనా వేస్తున్నాయి.48 ట్రెయిన్లను సూపర్‌ఫాస్ట్ జాబితాలో చేర్చడంతో మొత్తం ఈ విభాగంలో చేరిన రైళ్ల సంఖ్య 1072కు పెరిగింది. -
అయితే హోటల్స్ లో తినకండి..!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆర్డర్స్ పై ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జ్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఏఐ) స్పందించింది. ప్రభుత్వం ప్రకటను విభేదించిన సంఘం సర్వీస్ చార్జ్ చెల్లించే ఉద్దేశం లేకపోతే హెటల్స్ లో తినొద్దంటూ ఒక ప్రకటన జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్ విధింపును పూర్తిగా సమర్ధించుకున్న ఎన్ఆర్ఏఐ సర్వీసు చార్జ్ ను ఐచ్ఛికం చేసే బదులు ప్రభుత్వం పన్నులు వదులుకోవాలని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు ఎన్ ఆర్ ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తమ వాదన మద్దతుగా రియాజ్ ఉదహరించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు. అలాగే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే సర్వీస్ ఛార్జ్ చెల్లింపులపై వినియోగదారులకు మర్యాదగా వివరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మను చంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు. కాగా సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది వినియోగదారులే నిర్ణయించుకుంటారని చెప్పిన కేంద్రం.. అది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తేల్చి చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్ పై ‘లెవీ’ మోత!
దొడ్డిదారిన రూ.480 కోట్లు సమకూర్చుకునేందుకు సర్కారు ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నుల ద్వారా రూ.480 కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘లెవీ’ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో విక్రయించే పెట్రోల్, డీజిల్‌లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా లీటర్‌పై ఒక రూపాయి ‘లెవీ’ విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేయడమే మిగిలింది. పెట్రోల్, డీజిల్‌లపై వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వ్యాట్‌కు ఈ ‘లెవీ’ అదనం. ఏటా రూ.6,500 కోట్లు రాష్ట్రంలో వినియోగమవుతున్న పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు రూ.5,956 కోట్లు వసూలైంది. మార్చి నెలలో మరో రూ.550కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ ద్వారానే ఈ మొత్తం సమకూరింది. వాస్తవానికి 2015-16లో పెట్రోల్, డీజిల్‌మీద రూ.7,850కోట్లు వస్తుందని అంచనా వేయగా... ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సుమారు రూ.6,500కోట్ల (82 శాతం) వరకు వసూలవుతోంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు ఒక రూపాయి చొప్పున ‘లెవీ’ వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.480కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచకుండా రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారు. అలా తెలంగాణలో కన్నా లీటరుకు ఒక రూపాయి ఎక్కువగా సమకూరుతోంది. దీంతో వ్యాట్‌ను పెంచడం కన్నా, ‘లెవీ’ వసూలు చేయడమే మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎంవోలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని అంశాల్లోనూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ.42,073కోట్లుగా తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి ఫిబ్రవరి వరకు రూ.27,873 కోట్లు వసూలుకాగా... ఈనెలాఖరుకల్లా మరో రూ.3వేల కోట్లు సమకూరుతుందని అంచనా. అయితే పెరిగిన వసూళ్ల అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునే పనిలో వాణిజ్య పన్నుల శాఖ పడింది. లీజు లావాదేవీలపై పన్నుల ద్వారా రూ.60కోట్లు సమకూర్చుకునే బిల్లును ఇటీవలే అసెంబ్లీ ఆమోదించింది. ఇన్వాయిస్ ట్రాకింగ్ విధానం ద్వారా రూ.120కోట్లు వసూలు చేసే ప్రతిపాదనను మే నుంచి అమలు చేయనున్నారు. డీటీహెచ్ మీద వినోదపన్ను రూపంలో మరో రూ.24 కోట్లు, హెచ్ఆర్బీటీ చట్టం అమలు ద్వారా రూ.10 కోట్లు, కేబుల్ కనెక్షన్లపై వినోద పన్నును రూ.5 నుంచి రూ.10కి పెంచడం ద్వారా మరో రూ.20 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రూ.864 కోట్లు అదనంగా వసూలు చేసే ఈ ప్రతిపాదనల్లో కొన్ని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వాటికి ఆమోదం లభించనుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ధాన్యం సేకరణ పన్నుపైనా లెవీ రైతుల నుంచి ధాన్యం సేకరణపై కొనుగోలు పన్ను (పర్చేస్ ట్యాక్స్)ను ఇప్పటికే వసూలు చేస్తుండగా, అదనంగా ‘లెవీ’ వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. తద్వారా ఏడాదికి రూ.150కోట్లు వసూలవుతుందని భావిస్తున్నారు. రైతు పండించిన పంటకు ఎలాంటి పన్ను వసూలు చేయని ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారిపైన, రైస్‌మిల్లర్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారిపై పన్ను విధిస్తోంది. తద్వారా వసూలవుతున్న పన్నుకు అదనంగా ‘లెవీ’ని విధించనుంది. -
రాష్ట్రానికి ‘లెవీ’ గండం..!
⇒ 25 శాతం కొనసాగింపునకు కేంద్రం విముఖం ⇒ ఇప్పటికే పచ్చి బియ్యం సేకరణ నుంచి తప్పుకున్న ఎఫ్‌సీఐ ⇒ క్రమంగా ఉప్పుడు బియ్యం సేకరణ నుంచీ తప్పుకునే యోచన ⇒ ఇక ధాన్యం సేకరణ భారమంతా రాష్ట్రాలపైనే ⇒ పౌర సరఫరాలశాఖపై ఏటా అదనంగా రూ.100 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కితగ్గేలా లేదు. దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంపై లెవీ భారం ఎక్కువగా ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం లేవీ విధానాన్ని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా ఇంతవరకు ఏ స్పందన లేదు. దీంతో రైతులకు మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోనున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌కు ముందు వరకు 75 శాతంగా ఉన్న లెవీని 25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బియ్యం లెవీని 25 శాతానికి తగ్గించడం వల్ల మిల్లర్లు తమకు ఉన్న నిల్వ సామర్థ్యం మేరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మిగతా మొత్తాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా రావడంతో కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం 1,500 వరకు పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 25 శాతం లెవీ ఎత్తేస్తే మరింత భారం: ప్రస్తుతమున్న 25 శాతం లెవీనీ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్రంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తులో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంలో ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే చిన్నకారు రైతులు, నిల్వ సామర్థ్యం లేని వారికి మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధర దక్కే అవకాశాలుండవు. లెవీ ఎత్తివేతపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని భావిస్తున్న పౌరసరఫరాలశాఖ పూర్తి బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. మొత్తంగా రబీలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనాపై ఖరీఫ్‌లో ఏర్పాటు చేసిన 1,581 కొనుగోలు కేంద్రాలకు మరో 500 కేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన కేంద్రాలకు అనుగుణంగా గోనె సంచులు, టార్పాలిన్లు, జల్లెడపట్టే యంత్రాలు, మార్కెట్ యార్డుల్లో మరిన్ని వసతులకు కలిపి ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. పూర్తిగా తప్పుకోనున్న ఎఫ్‌సీఐ రాష్ట్రంలో గత ఏడాది మార్చి వరకు కేవలం కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణ వికేంద్రీకరణను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. దీంతో పచ్చి బియ్యం సేకరణ నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పూర్తిగా తప్పుకున్నట్లైంది. 2012-13లో 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర పచ్చి బియ్యం సేకరణ జరిపిన ఎఫ్‌సీఐ, 2013-14లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. 2014-15లో పచ్చి బియ్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం ఉప్పుడు బియ్యం సేకరణకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పచ్చి బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరిస్తోంది. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై ధాన్యం సేకరణ భారం భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో లెవీ పూర్తిగా ఎత్తేస్తే ఉప్పుడు బియ్యం సేకరణ నుంచి కూడా ఎఫ్‌సీఐ వైదొలిగే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఉప్పుడు బియ్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. -
లెవీ తరలింపులో లేజీ!
పాలకొండ:వేల టన్నుల బియ్యాన్ని లెవీగా సేకరిస్తున్న అధికారులు.. వాటిని సకాలంలో తరలించి, సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది బస్తాల బియ్యం నిల్వలను ఆరు బయలు ప్రాంతాల్లోనే వదిలేయడంతో మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. తమపై ఒత్తిడి చేసి కొనుగోలు చేయించిన అధికారులు.. బియ్యం తరలించేందుకు మాత్రం చొరవ చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 114 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటా ధాన్యానికి 67 కేజీలు చొప్పున బియ్యం లెవీగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మిల్లుల్లో స్థలాభావం ఉండటంతో బియ్యం ఆడించిన వెంటనే ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నారు. అయితే గత పది రోజులుగా మిల్లుల నుంచి బియ్యం తరలింపు పూర్తి నిలిచిపోయింది. ఎఫ్‌సీఐ గోదాములు పూర్తిగా నిండిపోవడమే దీనికి కారణం. రణస్థలం మండలం పైడి భీమవరం, రాజాం ప్రాంతాల్లోని గోదాములు ఇప్పటికే బియ్యంతో నిండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాములు ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి. లెవీ బియ్యాన్ని వీటిలో నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. వర్షం వస్తే... జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మిల్లులకు పూర్తిస్థాయిలో ధాన్యం చేరాయి. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని మిల్లుల వద్ద ఆరుబయట స్థలాల్లోనే నిల్వ చేస్తున్నారు. వందల టన్నుల బస్తాల బియ్యం ఇలా ఆరుబయటే ఉండిపోయాయి. కాగా గత రెండు రోజులుగా గాలులు వీస్తుండడం, సాయంత్రమైతే ఆకాశం మేఘావృతం అవుతుండడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం పడినా కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యం పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం బియ్యం నిల్వలను గోదాములకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కె.సాల్మన్‌రాజ్ తెలిపారు. గోదాములు నిండిపోయిన విషయం ఆయన వద్ద ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. మార్కెట్ కమిటీల్లో ఉన్న గోదాములను వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించి మిల్లర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. -
లెవీ జోరు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :లెవీ సేకరణ ఊపందుకుంది. బియ్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐకి పరిస్థితులు అనుకూలించడంతో మిల్లుల నుంచి పెద్దఎత్తున లోడులు వెళుతున్నాయి. డిఫాల్టర్ల పేరుతో మిల్లర్లను ఎఫ్‌సీఐ ఇబ్బందిపెట్టినా.. సమస్య సానుకూలంగా పరి ష్కారం కావడంతో లెవీ సేకరణ ప్రక్రియవేగంగా సాగుతోంది. ఇప్పటికే లక్షా 30 వేల టన్నులకు పైగా బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి తరలించారు. జిల్లాలో ఐదు లక్షల టన్నుల బియ్యూన్ని నిల్వ చేసేందుకు వీలుగా గోదాముల్లో జాగా ఉంది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యంతో రెండు లక్షల టన్నుల జాగా నిండి ఉంది. ఇంకా మూడు లక్షల టన్నుల జాగా మిగిలివుంది. ఇదిలావుంటే రైల్వే వ్యాగన్లు కేటాయించడంలోనూ రైల్వే అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత సీజన్లో నెలకు 13 నుంచి 15 వ్యాగన్లు మాత్రమే కేటాయించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డిసెంబరు నెలకు 21 వ్యాగన్లు కేటాయించారు. పౌరసరఫరాల కోసం, ఇతర అవసరాల నిమిత్తం బియ్యం రవాణా అవుతున్నాయి. జిల్లాలో ఉన్న డిపోలతో పాటు స్టాండ్ బై డిపోలను ఎఫ్‌సీఐ సిద్ధం చేసుకుంది. సీజన్లో కనుక లెవీ బియ్యం పెరిగితే, వాటితో ఉన్న గోదాములు నిండిపోతే , స్టాండ్‌బైగా సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు, అద్దె గోదాములు, ఇతర గోదాములను ఎఫ్‌సీఐ సిద్ధం చేసుకుంది. మొత్తం మీద రోజుకు ఆరువేల టన్నులకు పైగా బియ్యం లెవీగా ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి.