LGP
-
పైపులైన్ ద్వారా వంట గ్యాస్.. తుది దశకు గ్యాస్ స్టేషన్ పనులు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రాష్ట్రంలో తొలిసారిగా ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చేపడుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పెద్దపెల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్లోని గౌతమినగర్, శాంతినగర్‌లలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్, సింగరేణి ఇతర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, శాంతినగర్, గౌతమినగర్‌లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వినియోగదారులకు రూ.618లతో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ ఫీజు చెల్లించిన వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ మీటర్లు బిగించారు. ఆగస్టు 1 నాటికి ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో పనులు పూర్తి.. రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత భారీ, చిన్న తరహా పరిశ్రమలకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో మేలు జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు సీఎన్జీ బంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్లవరం పోర్టు నుంచి పైపులైన్ ద్వారా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలోని గ్యాస్ స్టేషన్‌కు ఇప్పటికే గ్యాస్ సరఫరా అవుతోంది. నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టేషన్‌కు గ్యాస్ తరలింపుపై ట్రయల్ రన్ నిర్వహించారు. లీకేజీ అవకాశాలు తక్కువ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధర 30 శాతం వరకు తక్కువగా ఉండనుంది. పైపులైన్ ద్వారా వచ్చే గ్యాస్ బరువు తక్కువగా ఉండటంతో లీకేజీ, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువ. వినియోగదారుల ఇళ్లకు మీటర్లు బిగించి, యూనిట్ల ఆధారంగా బిల్లు వసూలు చేస్తారు. -
బిహార్‌లో సీట్ల పంపకం
న్యూఢిల్లీ: 2019 పార్లమెంట్ ఎన్నికలకు బీహార్‌లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీల మధ్య సీట్ల పొత్తు కుదిరింది. మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 సీట్లు, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మిగిలిన ఆరు సీట్లలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయం వెల్లడించారు. పాశ్వాన్‌ను ముందుగానే రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు. మోదీ ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రిగా ఉన్న పాశ్వాన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో చర్చల అనంతరం షా ఈ వివరాలు వెల్లడించారు. 2014లో గెలిచిన 31 సీట్లకు మించి ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ అధికార కూటమి నుంచి నిష్క్రమించిన తరువాత ఆ అవకాశాన్ని ఎల్జేపీ సమర్థంగా ఉపయోగించుకుంది. బీజేపీనుంచి సంతృప్తికర స్థాయిలో సీట్లను దక్కించుకుంది. నితీశ్‌కుమార్ సైతం ఎన్డీయేలో తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. 2014లో బీజేపీ పోటీ చేసి గెలిచిన అయిదు సీట్లను సైతం నితీశ్‌కుమార్ తన వాటాగా దక్కించుకున్నారు. 2014లో జేడీ(యూ) స్వతంత్రంగా పోటీ చేయగా, బీజేపీతో కలిసి పోటీచేసిన ఎల్జేపీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో పోటీచేసే అభ్యర్థుల జాబితాతో త్వరలోనే అన్ని పార్టీలూ ఒక నిర్ణయానికి వస్తాయని అమిత్‌షా వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సమర్థంగా పనిచేసిందని పాశ్వాన్ అన్నారు. మోదీ నేతృత్వంలోనే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్‌లోని హాజిపూర్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయంపై నితీశ్‌కుమార్ వ్యాఖ్యానిస్తూ, పాశ్వాన్ దీర్ఘకాలంగా దేశానికి చేసిన సేవకు ఇది గుర్తింపు అని అన్నారు. -
మళ్లీ ఎన్డీయే గూటికి ఎల్జేపీ
-
మళ్లీ ఎన్డీయే గూటికి ఎల్జేపీ
బీహార్‌లో బీజేపీతో పొత్తు ఖరారు... పాశ్వాన్ పార్టీకి 7 ఎంపీ సీట్లు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జన శక్తి పార్టీ (ఎల్జేపీ) తిరిగి చేరింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కారణంగా కూటమి నుంచి వైదొలగిన ఎల్జేపీ మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఎన్డీయే గూటికి వచ్చింది. బీహార్‌లో బీజేపీతో లోక్‌సభ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దీని ప్రకారం బీహార్‌లోని 40 లోక్‌సభ సీట్లకుగానూ ఎల్జేపీ 7 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన 33 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. గురువారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పొత్తు విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎన్డీయే విస్తరణ మొదలైంది. పాశ్వాన్ ఎన్డీయేలో భాగమయ్యారు. సీట్ల పంపకం పూర్తైది. ఈ పొత్తుతో బీహార్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్డీయేకు లాభం చేకూరుతుంది’’ అని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో అద్వానీ, మోడీలను పాశ్వాన్ కలుస్తారన్నారు. కాగా, మళ్లీ ఎన్డీయేలోకి రావడం సంతోషంగా ఉందని పాశ్వాన్ పేర్కొన్నారు. 54 మంది అభ్యర్థులతో తొలి జాబితా... లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న 54 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి 17 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 17 మంది, ఒడిశా నుంచి ఐదుగురి పేర్లను విడుదల చేసింది. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి పోటీలో దిగనున్నారు. రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ జాబితాకు ఆమోదముద్ర పడింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, వెంకయ్య, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.