lingayath
-
కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి షాకిస్తూ ఘన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే హస్తం పార్టీ గెలుపుకు పలు అంశాలు కలిసొచ్చినప్పటికీ ప్రధానంగా మాత్రం మూడు సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమనే చెప్పాలి. అవేంటో చూస్తే.. లింగాయత్‌లు దెబ్బ బీజేపీకి భారీగానే నష్టాన్ని మిగిల్చింది. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పక్కన పెట్టడం, రాజకీయ విశ్లేషకుల ప్రకారం కాషాయ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. బీజేపీ తప్పు కాంగ్రెస్ కలిసొచ్చిందా! లింగాయత్‌ల ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయింది(2018లో 41.8 శాతం నుంచి 2023లో 39.5 శాతానికి). అయితే ఓట్ల శాతం తక్కువే అయినప్పటికీ ఈ తేడా కారణంగా బీజేపీ ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం దాదాపు సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. (2018లో 41 నుంచి 2023లో 21 చేరుకుంది). మరోవైపు, జేడీ(ఎస్)కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాస్త కోల్పోయింది. ఈసారి లింగాయత్ ఓట్లలో ఐదు శాతంతో పాటు కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న మూడు స్థానాలను కోల్పోయింది. సాధారణంగా జనతాదళ్ (సెక్యులర్) వైపు మొగ్గు చూపే బీజేపీయేతర లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఇది సూచిస్తుంది. జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం ఆ పార్టీకి దోహదపడి ఉండవచ్చు. అథని సీటులో సవాది గెలుపొందగా, హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) సీటులో షెట్టర్ ఓడిపోవడం గమనార్హం. లింగాయత్‌ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఇతర ప్రధాన సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. లింగాయత్ తర్వాత వారీ ఓట్లు కీలకంగా మారాయి లింగాయత్‌ల సామాజిక వర్గం తర్వాత వొక్కలిగలు, దళితులు ఆధిపత్య వర్గాలుగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ బాగానే సాధించింది. మరోవైపు, వొక్కలిగ స్థానాల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు శాతం ఓట్ల లాభంతో 2018లో 14 నుంచి 2023లో 27 సీట్లకు రెట్టింపు అయింది. దీనికి మరో ప్రముఖ వొక్కలిగ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. కనకపుర నియోజక వర్గంలో 1.2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన శివకుమార్ గౌడ గడ్డపై వొక్కలిగ ఓట్లను దూరం చేసి ఉండవచ్చు." జేడీ(ఎస్)కు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్ పార్టీ 36 గ్రామీణ స్థానాల్లో విజయం సాధించడం ఓటర్లు మార్పునగా సూచనగా కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాల ఓట్లతో కాంగ్రెస్‌కు మరో భారీ విజయం దక్కినట్లయింది. కాంగ్రెస్ పది సీట్లు, ఎస్సీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 5.5 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా ఐదు, మూడు స్థానాలు కోల్పోయాయి. ఇవి నేరుగా కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలస్తోంది. రాష్ట్రంలో దళితుల ఓట్లు సాధారణంగా చీలిపోతాయి. అయితే, ఈసారి, ఎస్సీ-ఆధిపత్య ప్రాంతాలు కాంగ్రెస్‌కు అత్యధికంగా ఓటేశారు. రాష్ట్రంలోని 37 ఎస్సీ-ఆధిపత్య స్థానాల్లో కాంగ్రెస్ 22 గెలుచుకుంది, గత ఎన్నికల్లో సాధించిన దానికంటే దాదాపు రెట్టింపుగా ఉంది. చదవండి: 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి -
కర్ణాటక ఎన్నికల్లో వారే కీలకం.. 70కు పైగా నియోజకవర్గాలపై ప్రభావం
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు గెలుపు కోసం హామీలు గుప్పించడంతో పాటు ప్రత్యర్థులపై మాటల దాడిని పెంచుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో కులాలు కీలక పాత్రను పోషించనున్నాయి. సామాజిక వర్గాల వారిగా చూస్తే.. 55% ఓబీసీలు, 17% ఎస్సీలు, 7% ఎస్టీలు, 11% ముస్లింలు, 3.5% అగ్రవర్ణాలు, 2% క్రిస్టియన్లు ఉన్నారు. కీలక పాత్ర వారిదే ఈ ఎన్నికల్లో లింగాయత్‌ల పాత్ర కీలకమైంది. జనాభాలో 15.3 శాతంతో వీరు 50 ఉపకులాలుగా ఉన్నారు. లింగాయత్‌లలోనూ వారివారి ఉపకులాల వర్గాలను బట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో రిజర్వేషన్లున్నాయి. అయితే వీరిలో పంచమశాలి లింగాయత్‌లు అధికంగా ఉంటారు. తర్వాత స్థానం వీరశైవ లింగాయత్, గానిగ్ లింగాయత్, సాదర్ లింగాయత్‌లది. ఈ వర్గాల ప్రభావం 70కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉంటుంది. బీజేపీకి మొదటి నుండి మద్దతుగా ఉంటున్న లింగాయత్‌లు మాజీ ముఖ్యమంత్రి యడియురప్ప కారణంగా ఇప్పటికీ ఆ పార్టీకే మద్దతుగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ అంచనాలను పరిశీలిస్తే లింగాయత్ అభ్యర్థుల ఎంపిక ఆధారంగా పార్టీలు గెలుపు ఓటములు ఆధారపడనున్నాయి. దీంతో పార్టీలు లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. రెండో పెద్ద వర్గం విషయానికొస్తే.. వొక్కలింగాలు అని చెప్పాలి. వీరు జనాభాలో 11శాతం ఉండి, 44కు పైగా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన దేవగౌడ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కారణంగా ఆయన కుటుంబం ప్రభావం ఈ సామాజిక ఓటర్లపై అధికంగా ఉండనుంది. హస్తం పార్టీకి ఇక్కడ కలిసొచ్చే అంశం ఏమనగా.. ఈ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వారి ఓటు బ్యాంకు దోహదపడే అవకాశం ఉంది. ప్రస్తుతం వొక్కలింగాలు ప్రధానంగా జెడీ (ఎస్)కు మద్దతుగా ఉంటున్నారు, తర్వాత కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కర్ణాటకలో 17.15% మంది ఎస్సీలున్నారు. ఎస్సీ వర్గాలలో ప్రధానంగా ఆది కర్ణాటక (25.7%), మాదిగ (15.2%), బంజారా (11.6%), బోవి (11.2%), హోలయా (7.5%), ఆది ద్రావిడ (7.2%), భాంబి (6.6%) ఉపకులాల వారున్నారు. ఎస్సీలలో వారి వారి సంప్రదాయాల ఆధారంగా ఎస్సీ లెఫ్ట్, ఎస్సీ రైట్ వర్గాలున్నాయి. ఓటింగ్ సమయంలో ఈ విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్సీ లెఫ్ట్ (మాదిగలు) కాంగ్రెస్‌పై కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రభావంతో ఎస్సీ రైట్ వర్గం ఆ పార్టీ పక్షాన నిలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ లెఫ్ట్ బీజేపీకి, ఎస్సీ రైట్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు కోస్తా కర్ణాటక రూటే సెపరేటు కోస్తా కర్ణాటక ప్రాంతంలో సామాజిక ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఓబీసీలలో ఈదిగా, మొఘవీర, బంట్స్ (షెట్టి), తులుస్, బెల్లావాస్ వర్గాల ఆధిపత్యం ఉంది. వీరితో పాటు ముస్లింలు కూడా అధికంగానే ఉన్నారు. మంగళూరు సమీపంలో క్రిస్టియన్ల ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తే.. ముస్లింలు, క్రిస్టియన్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపగా, బ్రాహ్మణులు బీజేపీ పక్షాన ఉన్నారు. విశ్వకర్మ, ఉపార, జైన్, క్షత్రియ, బలిజ, హడ్పాడా సామాజిక వర్గాల ఓట్లు రెండు ప్రధానపక్షాలకూ పడనున్నాయి. బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని కొన్ని భాగాలలో ఉండే మరాఠాల మద్దతు చాలావరకు బీజేపీకి ఉండగా, కాంగ్రెస్‌లో బలమైన నేతలున్న చోట ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. -
లింగాయత్ మఠాధిపతికి గుండెపోటు
-
మైనారిటీ హోదా విషయంలో ఘర్షణ
సాక్షి, బెంగళూర్: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన వీరశైవ లింగాయత్ నేతలు అన్నంత పని చేశారు. లింగాయత్ నేతల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో కర్ణాటకలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ వీరశైవ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపింది. లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మొదటి నుంచి వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వర్గ వారి అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. -
దేవుడు అవకాశమిస్తే...
సాక్షి, హైదరాబాద్: ‘‘భగవంతుడు నాకు అవకాశమిస్తే త్వరలోనే బసవేశ్వర భవన్‌కు శంకుస్థాపన చేస్తా’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర వీరశైవ లింగాయత్-లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బసవేశ్వర భవన్ కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోనే ప్రముఖ ప్రదేశంలో రూ. కోటితో బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బసవేశ్వర జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తానున్నా, పోయినా రాష్ట్రం అభివృద్ధి తీరం చేరేదాక ఆడిపాడాలంటూ ఆదివారం తెలంగాణ కళాకారుల శిక్షణా కార్యక్రమంలో కళాకారులను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కాగా, బసవేశ్వర జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలన్న విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్... అన్ని సెలవులను ప్రకటిస్తే పెద్ద ప్రయోజనం ఉండదని, బసవేశ్వరుడు కూడా దీనిని క్షమించడని పేర్కొనగా సభలో నవ్వులు విరిశాయి. లింగాయత్‌లను బీసీలలో చేర్చాలి... రాష్ట్రంలోని లింగాయత్‌లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే బాధ్యతను తీసుకోవాలని ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు కేసీఆర్ సూచించారు. ఈ విషయమై రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలని దత్తాత్రేయ సూచించగా, అటువంటిదేమీ అవసరం లేదని, దీనికోసం వినతి పత్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో మే 1కల్లా దత్తన్నను తమ పార్టీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు కలుస్తారని కేసీఆర్ అన్నారు. తెలుగులో ఆదికవి సోమనాథుడే... తెలుగు భాషలో ఆదికవి నన్నయ కాదని ముమ్మాటికి పాల్కురికి సోమనాథుడేనని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాను చెబితే ఆంధ్రోళ్లకు కోపం వస్తుందని, కాని ఇది కఠోర వాస్తవమని నవ్వుతూ అన్నారు. అశోక్ ముస్తాపూర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆదిలాబాద్‌కు చెందిన కేంద్ర జలవనరుల శాఖలో సంయుక్తకార్యదర్శిగా పనిచేస్తున్న బి.రాజేందర్‌కు బసవేశ్వర జీవనసాఫల్య పురస్కారాన్ని కేసీఆర్ చేతుల మీదుగా అందించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, టి.హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ పాల్గొన్నారు.