Lockout notices
-
ఎంపీ సుజనా చౌదరికి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అధికారులు షాకిచ్చారు. బ్యాంక్ కుంభకోణం కేసులో అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్ఔట్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. సుజనా చౌదరిపై 2018లోనే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 2018లో సుజనా ఆస్తులను బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలానికి పెట్టింది. ఈ క్రమంలోనే ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరిలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు సైతం నిర్వహించింది. హైకోర్టులో సుజనాపై మారిషస్ బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. (వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. -
హీరాలాల్ కంపెనీ లాకౌట్
బొబ్బిలి : గ్రోత్ సెంటర్లో ఇటీవల హీరాలాల్ కంపెనీ కార్మికులు, సంస్థ యాజమాన్యం మధ్య జరిగిన గొడవ చివరికి లాకౌట్కు దారి తీసింది. వచ్చే నెల 7 నుంచి కంపెనీకి లాకౌట్ విధిస్తున్నట్టు యాజమాన్యం సంస్థ గేటుకు నోటీసును అంటించింది. సుమారు 150 మంది కార్మికులు, ఇతర ఉద్యోగులు మరో 50 మంది ఉన్న ఈ సంస్థలో సంఘం ఏర్పాటు చేస్తున్నారనే కారణంగా యాజమాన్యం ఏడుగుర్ని తొలగించింది. దీంతో కార్మికులంతా ఏకమై విధులను ఇటీవల బహిష్కరించారు. లాకౌట్ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్వీఎస్కేకే రంగారావుకు వినతిపత్రం అందజేసి చర్చల్లో పాల్గొన్నారు. కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో మూత పడనివ్వమని బేబీనాయన హామీ ఇచ్చినట్టు ఉద్యోగ వర్గాల ప్రతినిధి జగదీష్ తెలిపారు. సంఘం నమోదైనందునే.. కార్మిక సంఘాన్ని కంపెనీలో ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యాజమాన్యం సకల ప్రయత్నాలూ చేసింది. ఇటీవలే మాకు కార్మిక శాఖలో మా సంఘం నమోదై నంబర్ కూడా వచ్చేసింది. సంఘం వద్దన్నా రిజిస్ట్రేషన్ చేయించేశామన్న దుగ్ధతోనే యాజమాన్యం ఇప్పుడు ఉద్యోగులనూ తొలగించేందుకు వీలుకాక ఏకంగా లాకౌట్కు సిద్ధపడింది. – పొట్నూరు శంకరరావు, సీఐటీయూ నేత -
‘అలయన్స’లో ముదురుతున్న వివాదం
► లాకౌట్కు చేస్తారంటున్న కార్మికులు ► కార్మికులను సంఖ్యను ► తగ్గిస్తున్నామంటున్న యాజమాన్యం ► కేసుల భయంతో పోలీసులకు ► కార్మికుల ముందస్తు ఫిర్యాదు కారూరు(తడ): కారూరు పంచాయతీ పరిధిలో ఉన్న అలయన్స్ మినరల్స్ గ్రానైట్ పరిశ్రమలో కార్మికులు, మేనేజ్మెంట్ మధ్యన నెలకొన్న వివాదం ముదురుతోంది. వివరాల్లోకి వెళితే.. చెక్పోస్టు సమీపంలో ఉన్న అలయన్స్ పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పదేళ్లకుపైగా పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2 నెలల క్రితం కార్మికులు ఇంక్రిమెంట్లపై పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. గత ఏడాది ఇంక్రిమెంట్ వేయనందున ఈ ఏడాది రూ.2వేలు వేయాలని కోరారు. చివరకు రూ.1400 ఇచ్చేందుకు మేనేజ్మెంట్ అంగీకరించింది. కాగా ఈ నెల 16న కంపెనీని లాకౌట్ చేస్తున్నట్లుగా మేనేజ్మెంట్ తమకు నోటిమాటగా చెప్పిందని ఎంతో కాలంగా కంపెనీని నమ్ముకుని ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అలయన్స్కి అనుబంధంగా ఉన్న మెర్క్యురీ గ్రానైట్ పరిశ్రమను మూసివేసే సమయంలోనూ కార్మికులకు అన్యాయం చేశారని కార్మికులు గుర్తుచేస్తున్నారు. పరిశ్రమ మూతవేసే సమయంలో అందులోని కార్మికుల్లో సగం మందికి తిరిగి ఉపాధి కల్పిస్తామని చెప్పి కేవలం ఐదుగురికే ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారు. తొలగించే కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం అందించాలని కోరుతున్నారు. పోలీసులకు కార్మికుల ఫిర్యాదు మేనేజ్మెంట్ చర్చల సమయంలో గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించవచ్చునని భయంతో కార్మికులు శనివారం పోలీసులకు ముందస్తు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి కార్మికులపై తప్పుడు కేసులు బనాయిస్తే ఆమోదించవద్దని కోరారు. యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ మేనేజ్మెంట్ పెద్దల స్వార్థంతో కంపెనీ సంక్షోభంలో చిక్కుకుందని, ఇందుకు కార్మికులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కార్మికులకు నాయకత్వం వహిస్తున్న సీనియర్ కార్మికుడు శివాజీ వాపోయారు. రెండు రోజులుగా కార్మికుల పరిహారం విషయమై మేనేజ్మెంట్తో చర్చిస్తున్నా ఎటువంటి ఫలితం కనబడడంలేదని తెలిపారు. తొలుత సెటిల్మెంట్కి ఒప్పుకోని మేనేజ్మెంట్ ఇప్పుడు ఆమోదిస్తామని చెబుతోందన్నారు. చర్చలకు వెళ్లి ఏదైనా గట్టిగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారనే భయంతోనే ముందస్తు ఫిర్యాదు చేస్తునట్టు తెలిపారు. అధికారులు జో క్యం చేసుకని సమస్యను సామరస్యంగా పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లాకౌట్ నోటీసులు జారీ చేయలేదు లాకౌట్కు సంబంధించి ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. అవసరానికి మించి ఉన్న కార్మికులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవర్ని తొలగించాలనేది ఇంకా నిర్ధారించలేదు. కార్మికులకు చట్టపరంగా న్యాయం చేస్తాం. పెద్దల సమక్షంలో పరిహారం అందజేస్తాం. - కృష్ణమూర్తి, హెచ్ఆర్, అలయన్స కంపెనీ