logolaunch
-
ఇండియన్ ఆయిల్ కొత్త మస్కట్ ఇదే?
ఇండియన్ ఆయిల్ సంస్థ తమ కంపెనీని ప్రతిబింబించేలా కొత్త మస్కట్‌ని రూపొందించింది. శక్తికి, ధృడత్వానికి పేరైన ఖడ్గమృగాన్ని తమ కంపెనీ మస్కట్‌గా ఎంచుకుంది. ఏదైనా ఈవెంట్, లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం మస్కట్లను ఎంచుకోవడం సర్వ సాధారణం. ఇటీవల వెలుగులోకి వచ్చిన అస్సాం ఆయిల్స్ లిమిటెడ్ సంస్థ మస్కట్‌ను ఏర్పాటు చేసుకుంది. అదే బాటలో ఇండియన్ ఆయిల్ సైతం మస్కట్‌ని ట్విట్టర్ వేదికగా లాంఛ్ చేసింది. As we welcome #IndianOilRhino into the IndianOil family as its brand mascot, the similarities between the two are striking. Like a match made in heaven. Massive yet Agile, Tough yet Caring, Gentle yet Majestic. Reason enough to open up our hearts to the IndianOil Rhino. pic.twitter.com/LPgC0sCdTI — Indian Oil Corp Ltd (@IndianOilcl) September 1, 2021 ఇండియల్ ఆయిల్ కొత్తగా మాస్కట్ని లాంఛ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మస్కట్లను విడుదల చేయడంపకై ఉన్న శ్రద్ధ పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపుపై పెడితే బాగుంటుందంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. చదవండి : Petrol,diesel: రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు -
షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త లోగోను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ లోగో తయారీ కోసం 3 లక్షల డాలర్లు(సుమారు రూ.2.2 కోట్లు) ఖర్చు, నాలుగు సంవత్సరాల కాలం పట్టినట్లు షియోమీ పేర్కొంది. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, అసలు లోగోకు కొత్త లోగోకు మధ్య తేడా ఏమి లేదు అనే కదా. షియోమీ దీనిని 'అలైవ్' డిజైన్ కాన్సెప్ట్‌తో ప్రపంచ ప్రముఖ డిజైనర్, జపాన్‌లోని ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్యా హరా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న ఆరెంజ్ రంగు షియోమీ యూత్‌ఫుల్‌నెస్‌కు ప్రతీక అని కంపెనీ తెలిపింది. ఇందులో ఉన్న వైట్ రంగు విలువైన హైఎండ్ ఉత్పత్తులను అందిస్తూనే ఉంటామనే సందేశాన్ని తెలుపుతున్నట్లు షియోమీ ప్రకటనలో పేర్కొంది. లోగోను చతురస్రాకారం నుంచి వృత్త చతురస్రాకారంలోకి మార్చడంతో పాటు తమ కంపెనీ అంతర్గత స్పిరిట్‌ను, బ్రాండ్ స్వభావాన్ని కూడా మార్చామని తెలిపారు. దీంతోపాటు కొన్ని గణిత శాస్త్రానికి సంబందించిన సిద్ధాంతాల ఆధారంగా ఈ కొత్త లోగోను తయారు చేయడానికి ఇంత సమయం పట్టిందని కంపెనీ సీఈవో పేర్కొన్నారు. అయితే, షియోమీ కొత్త లోగోపై ఆన్ లైన్లో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఇందులో కొత్తదనం ఏముంది అని, దానికింత ఖర్చయిందని ట్రోల్ చేస్తున్నారు. రూ.10 ఖర్చుపెడితే 10 నిమిషాల్లోనే మార్చవచ్చని దీనికి 2.2 కోట్లు అవసరమా? అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
మత్తు వదిలించే కింగ్‌ఫిషర్
‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు ‘కింగ్‌ఫిషర్’ టైటిల్ క్యాచీగా ఉంది. నేటివిటీ, ఎమోషన్, సెంటిమెంట్ మిస్ కాకుండా కథ రాయడంలో చిన్నికృష్ణ దిట్ట’’ అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ రఘురామకృష్ణ రాజు. రచయిత చిన్నికృష్ణ ‘కింగ్‌ఫిషర్’ చిత్రంతో నిర్మాతగా మారారు. హైదరాబాద్‌లో చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో ఆవిష్కరణలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు పడే కష్టం మాకు తెలుసు.. అందుకే ఎప్పుడూ నిర్మాతలు కాకూడదనుకున్నాం. చిన్నికృష్ణ నిర్మాతగా మారుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయా. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్నికృష్ణ వెన్నతాగే కృష్ణుడిలా కాకుండా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టాలి’’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్. ‘‘నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి చిన్నికృష్ణ గారే కారణం’’ అన్నారు దర్శకుడు కేయస్ రవీంద్ర (బాబి). ‘‘సమరసింహా రెడ్డి’తో నా లైఫ్ టర్న్ తీసుకుంది. కథ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌గారికి థ్యాంక్స్. ‘నరసింహనాయుడు’తో నా కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆ చిత్రానికి కథ ఇచ్చింది చిన్నికృష్ణ’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్. చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఆసక్తితో తెనాలి నుంచి చెన్నై వెళ్లాను. భాగ్యరాజాగారి దగ్గర పనిచేశాను. సుజాత రంగరాజన్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆ తర్వాత పరుచూరి సోదరులు, బి.గోపాల్గారు నన్ను ప్రోత్సహించారు. ఓ యువ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. జనరల్‌గా కింగ్ ఫిషర్ అనగానే బీర్ గుర్తుకువస్తుంది. ‘కింగ్‌ఫిషర్’ అనేది ఒక పక్షి పేరు. ఆ కింగ్‌ఫిషర్ కిక్ ఇస్తుంది.. మా కింగ్‌ఫిషర్ మత్తుని వదిలిస్తుంది’’ అన్నారు. జడ్జి మాధవ్ పట్నాయక్, నిర్మాత దాసరి కిరణ్, హీరో హవీష్, కత్తి మహేష్, జగన్ పాల్గొన్నారు. -
చార్మినార్ ... కోహినూర్
హైదరాబాద్: ఈ సీజన్ నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కాలిడనున్న ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)’... శనివారం తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. నగరానికి తలమానికమైన చార్మినార్ నేపథ్యంగా, విఖ్యాత కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఈ లోగో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ ఖ్యాతిని పునరుద్ధరించడం’ అని శీర్షిక ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ... ‘ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌కు 1910 నుంచి మంచి గుర్తింపు ఉంది. 1920–1950 మధ్య అయితే భారత్ ఫుట్‌బాల్‌ను శాసించింది’ అని అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ విశేష ఆదరణ చూరగొంటుందని మాకు నమ్మకం ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం’ అని మరో సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. హైదరాబాద్ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్ చేశామని, హెచ్‌ఎఫ్‌సీతో ఈ ప్రాంతంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎల్ ఆరో సీజన్ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో కోల్‌కతాలో తలపడతుంది -
శివ పెద్ద దర్శకుడు కావాలి
మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22.’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్ లోగో ఆవిష్కరణ, టైటిల్ ఎనౌన్స్మెంట్ కార్యక్రమం శనివారం జరిగింది. లోగోను సి. కల్యాణ్ ఆవిష్కరించగా, టైటిల్‌ను వీవీ వినాయక్ ఎనౌన్స్ చేశారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. క్రమశిక్షణ, డెడికేషన్ ఉన్నవాడు. బీఏ రాజుగారి ద్వారా శివకు ఈ సినిమా చాన్స్ వచ్చింది అనుకుంటారు అందరూ. కానీ తానే సొంతంగా దర్శకునిగా అవకాశం దక్కించు కున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘22’. ఈ రోజు జూన్ 22. వచ్చే నెల 22న రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. శివ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వెబ్ సిరీస్‌తో తన టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకొని సినిమా చాన్స్ దక్కించుకోవటం సామాన్యమైన విషయం కాదు. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ట్రెండ్ మార్క్ అయ్యిందో అలా శివకు ‘22’ ట్రెండ్ మార్క్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు మారుతి. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జయగారు ఎక్కడున్నా సంతోషిస్తారు. శివ దర్శకుడు అవ్వాలని బలంగా ఆమె కోరుకునేది. తక్కువ టైమ్‌లో శివ దర్శకునిగా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. శివ మాట్లాడుతూ– ‘‘మారుతి, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్ గార్ల దగ్గర దర్వకత్వ శాఖలో చేశాను. నేను వెబ్ సిరీస్ చేసిన ప్రొడక్షన్లోనే సినిమా చేసే అవకాశం రావటం హ్యాపీగా ఉంది. దర్శకురాలు బి.జయగారు మా అమ్మ అని అందరికీ తెలుసు. ఆమె దగ్గర ప్రొడక్షన్ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. నా స్ట్రగుల్స్‌లో తోడుగా ఉంటూ ప్రతిక్షణం ముందుకు నడిపించారు మా నాన్న బీఏ రాజు’’ అన్నారు. ‘‘డైరెక్టర్ శివగారు నాకు వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చారు. మళ్లీ తన సినిమాలో హీరోగా చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రూపేష్. ‘‘ఫలక్నామా దాస్’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సలోని. నిర్మాత కొండా కృష్ణంరాజు, సంగీత దర్శకులు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
కొంత లాభం ఊరి కోసం!
పంపిణీరంగంలో ఉన్నవారు నిర్మాతలుగానూ మారుతుంటారు. ఉదాహరణకు ‘దిల్’ రాజు ఒకరు. ఇప్పుడు పంపిణీ రంగం నుంచి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మాతలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఈ ఇద్దరూ ఓ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బ్యానర్ లోగోను నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, అశోక్ రెడ్డిలతో పాటు ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. ఈ బ్యానర్లో చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుందన్న విషయాన్ని ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ‘ఈ మాయ పేరేమిటో’ హీరో రాహుల్ విజయ్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘సురేశ్, అహితేజలు బ్యానర్ పెడుతున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యా. వీళ్లు పెద్ద ప్రొడ్యూసర్స్ కావాలి. ఈ బ్యానర్లో మంచి మంచి సినిమాలు రావాలి’’అన్నారు. ‘‘టీజర్, ట్రైలర్ చూడగానే సురేశ్, అహితేజలు ఆ సినిమా స్కేల్‌ను అంచనా వేయగలరు. వీళ్లకు ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ లైఫ్ ఉండాలి’’అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వీరిద్దరిలో ఒకరు బాధ్యతను గుర్తు చేస్తే, మరొకరు ధైర్యాన్ని ఇస్తారు. ఇటువంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం అన్నారు’’ చిన్నికృష్ణ. ‘‘వీళ్లు తప్పకుండా సక్సెస్ కావాలి’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడి వరకు రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సురేశ్ వర్మ. ‘‘నాకు సినిమా అంటే చిరంజీవిగారే. ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రవీణ్‌ను మిస్ అవుతున్నాను. మా మొదటి సినిమా నుంచే మాకు వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగు కోసం ఖర్చుపెడతాం’’ అన్నారు అహితేజ. -
'నయనం' లోగో లాంచ్