Loop lines
-
ఐఎస్‌డబ్ల్యూ, సీఐడీలకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ), నేర పరిశోధన విభాగం(సీఐడీ)లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో గురువారం జరిగిన 15వ బ్యాచ్ పోలీసు జాగి లాల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘సీఐడీ, ఐఎస్‌డబ్ల్యూ సిబ్బందికి వారి జీతంలో 25 శాతం అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తాం. ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల’లో పోలీసు సిబ్బందికి 10 శాతం కోటా ఇవ్వనున్నాం. ఐఐటీఏలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విభాగాల జాగిలాలకూ శిక్షణ ఇస్తున్నారు. దీన్ని దేశంలోనే ఉత్తమ అకాడమీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ఐఐటీఏలో తమ జాగిలాలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర విభాగాలూ కోరటం గర్వించదగిన పరిణామమని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నిఘా విభాగం చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐఎస్‌డబ్ల్యూ ఐజీ మహేష్ మురళీధర్ భగవత్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన ఐఐటీఏ పరిపాలనా భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. కాగా వింగ్స్ వారీగా శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాల హ్యాండ్లర్లకు హోం మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించారు. -
ట్రాన్స్‌కో.. మేలుకో!
కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు పెచ్చులూడి న స్తంభాలు చేతికి అందేలా ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు పెనుమూరు : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం గ్రామీణ ప్రజలకు సంకటంగా మారింది. పెనుమూరు మండలంలో పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు, స్తంభాలకు, లైన్లకు పచ్చని తీగలు అల్లుకుంటున్నాయి. దీనికితోడు లూప్‌లైన్స్ కారణంగా చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందినా, ఆఖరుకు మనిషి చనిపోయినా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. నంజరపల్లె, కలికిరి గొల్లపల్లె, యల్లంపల్లె, లక్కలపూడి వాండ్లవూరు, రామక్రిష్ణాపురం ప్రాంతాల్లో చేతికి తగిలేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు స్టే వైర్లు లేక ఓ వైపునకు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ స్తంభాలు ఎప్పు డు కూలుతాయో అని ప్రజలు భయపడుతున్నారు.గుడ్యాణంపల్లె, కొటార్లపల్లె, ఎర్రమట్టిపల్లె, విడిదిపల్లె, గుంటిపల్లె, పులికల్లు ప్రాంతాల్లో హెచ్డీఎఫ్సీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు, వైర్లకు పచ్చని తీగలు అల్లుకున్నాయి. పెద్దకలికిరిలో తీగలు విద్యుత్ వైర్లకు అల్లుకుని ఉన్న కారణంగా ఇటీవల ఓ పశువు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. కలికిరి గొల్లపల్లెలో చేతులకు అందేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. గాలికి విద్యుత్ తీగలు ఒక్కటై మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయం ట్రాన్స్‌కో అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకకుండా గ్రామస్తులు కర్రలు ఏర్పాటు చేశారు.కొన్ని చోట్ల లూప్లైన్లు ఉండటంతో కర్రలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ గతంలో ఓ మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. గొడుగుమానుపల్లె, సాతంబాకం, కలవగుంట ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పెచ్చులు ఊడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మామిడి, తమలపాకు, చెరకు తోటలకు విద్యుత్ తీగలు తగులు తున్నాయి. చిన్నకలికిరిలో విద్యుత్ లైన్లు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. రెండు నెలల క్రితం జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. వెంటనే విద్యుత్ లైన్లు సరిచేయాలని ఆదేశించారు. ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వీడాల్సి ఉంది. -
సమన్యాయముంటే సమస్యేలేదు
=‘ఐదేళ్ల నిబంధన’ ఇది లేని కారణంగానే =ఏళ్లుగా అనేక మంది విధులు లూప్లైన్లలోనే =అండ ఉన్న వారికే ఫోకల్ పోస్టింగ్ అవకాశం =పరిస్థితి సమీక్షించాలని కోరుతున్న సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో: ‘పలుకుబడి ఉన్న వాడికే పోస్టింగ్... ‘ఖద్దరు’ అనుగ్రహిస్తేనే బాధ్యతలు తీసుకోగలిగేది’... ఇదీ ప్రస్తుతం పోలీసు విభాగంలో జనమెరిగిన సత్యం. ఫలితంగా పోస్టింగ్స్‌లో సమన్యాయం లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత డీజీపీ హయాంలో తెరపైకి వచ్చిన ‘ఐదేళ్ల నిబంధన’ కూడా ఇలాంటి పరిస్థితుల వల్లే ఏర్పడిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకుంటే సిబ్బందిలో నైతికస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రేటు కట్టి మరీ వసూలు... జంట కమిషనరేట్ల పరిధిలో బదిలీలు చేపట్టిన ప్రతిసారీ ఉన్నతాధికారులకు తలనొప్పులే. ప్రతి సందర్భం లోనూ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోస్టింగ్ ఇవ్వడమనేది అసాధ్యంగా మారిపోయింది. ‘ఖద్దరు’ జోక్యంతో జంట కమిషరేట్ల పరిధిలో పోలీసుస్టేషన్లలో ఇన్స్పెక్టర్ పోస్టుకు ‘రేటు’ కట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ ధోరణి కారణంగా అనునిత్యం పైరవీలు చేసుకునే సామర్థ్యం ఉన్న వారు ఫోకల్ పోస్టిం గ్స్‌గా పిలిచే కీలక ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఏళ్ల పాటు పని చేయగలుగుతున్నారు. ఈ ఖద్దరును కాదని ఎవరైనా ఉన్నతాధికారి పోస్టింగ్ ఇచ్చినా... సదరు అధికారి అక్కడ చేరడం అసాధ్యమనే చెప్పాలి. గతంలో కొన్ని పోస్టింగ్స్ మారిపోవడమే దీనికి తార్కాణం. సమర్థత, సీనియారిటీ జాన్తానై... బదిలీ విషయంలో ఈ విధానం ఏ స్థాయికి పెరిగిం దంటే... ఖద్దరుకు ఖరీదు చెల్లించలేకపోయినా... పై స్థాయి వరకు పైరవీ చేసే పలుకుబడి లేకపోయినా ఆ అధికారులు ఏళ్ల తరబడి లూప్ లైన్స్‌గా పిలిచే ప్రాధాన్యం లేని పోస్టులో కొనసాగాల్సి వస్తోంది. సదరు అధికారి ఎంతటి సమర్థుడైనా, గతంలో ఎలాంటి కీలక విభాగాలు, సున్నితమైన కేసుల్ని పర్యవేక్షించినా ఈ పైరవీల జోరులో పక్కకు వెళ్లిపోతాయి. కేవలం సిఫా ర్సు లేఖల ఆధారంగా జరుగుతున్న ఈ వ్యవహారంలోనూ పోటీ పెరిగిపోవడంతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. దీనికి విరుగుడుగానే గతంలో ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేస్తే బయటకు వెళ్లాలనే నిబంధన విధించారు. ప్రతిభకు పూర్తిగా పాతర పడటం, రాజ కీయ నాయకులు, ఉన్నతాధికారుల పైరవీల జాతర జరుగుతుండటంతోనే ఈ విధానం అమలులోకి తేవాల్సి వచ్చిందన్నది సిబ్బంది మాట. సిటీలోనూ లూప్లైన్లు... ఐదేళ్ల పాటు కమిషనరేట్‌లో పని చేసిన అధికారుల్ని ఎంపిక చేసే విధానంలోనూ లోపాలున్నాయన్నది అధికారుల మాట. కమిషనరేట్‌లో ఉన్న లూప్‌లైన్లలో పని చేసిన వారిని, ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారినీ ఒకే గాటిన కట్టి బయటకు పంపడం తీవ్ర అన్యాయమని వాపోతున్నారు. ఇక్కడి లూప్‌లైన్లలో పని చేస్తున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క సుప్రీం కోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాలు సైతం ఎస్హెచ్ఓ ఆ పైస్థాయి అధికారులు వివాదాస్పదమైతే మినహా రెండేళ్ల పాటు పోస్టులో కొనసాగాలని చెప్తుండగా... కొన్ని పరిస్థితుల్లో తీసుకున్న ‘ఏడాది పాటే’ అనే నిబంధన అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక విభాగాల్లో చేరిన వ్యక్తి దానిపై పట్టు సాధించడానికే ఆరు నెలలకు పైగా పడుతుందని, అలాంటిది ఏడాదికే బదిలీ అంటే అన్యాయమంటున్నారు. ఇలా చేస్తే ఉత్తమం... ఈ పోటీ ఎక్కువగా ఇన్స్పెక్టర్ స్థాయిలోనే ఉం టోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించి, కొన్ని కీలక చర్యల్ని తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వ్యక్తి కనిష్టంగా ఎనిమిదేళ్లు ఆ హోదాలో పని చేస్తారు. ఈ కాలంలో ఒక్కో పోస్టింగ్ రెండేళ్లంటూ లెక్కకట్టినా... రెండు ఫోకల్, రెండు లూప్లైన్లు చేసేలా నిబంధన విధిం చాలి. దీనివల్ల అందరికీ అవకాశం రావడంతో పాటు పైరవీల జోరు తగ్గుతుంది.