Lorry robbery
-
లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు
సాక్షి, తమిళనాడు : చెన్నై నుంచి రావడంతో బంధువులు ఇంట్లోకి అనుమతి నిరాకరించిన స్థితిలో యువకుడు ఒకరు లారీని చోరీ చేసి కరోనా పరీక్షకు వెళ్లాడు. తిరువారూరు జిల్లా తిరుత్తురై పూండి ఉప్పుకుళ వీధికి చెందిన రామకృష్ణన్ గత మూడో తేదీన తిరుత్తరై పూండి– వేదై రోడ్డులోని లారీ యజమానుల సంఘం భవనం సమీపాన నిలిపి ఉంచిన ఇతని లారీ చోరీకి గురైంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న డీఎస్పీ పళణిస్వామి, ఇన్స్పెక్టర్ అన్భళగన్, ఎస్ఐలు ప్రాన్సిస్, రాజేంద్రన్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. చోరీకి గురైన లారీ మరుసటి రోజు తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సమీపాన స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు లారీని చోరీచేసి అక్కడ నిలిపి వెళ్లిన వ్యక్తి కోసం గాలించారు. ఇలావుండగా బుధవారం తిరుత్తురైపూండి కొత్త బస్టాండు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఒక యువకుడిని పోలీసులు పట్టుకుని విచారణ జరిపారు. అతను కూత్తానల్లూరు సమీపంలోని పులియంకుడి నడి వీధికి చెందిన తంగరాజ్ కుమారుడు అశోక్ (25)గా తెలిసింది. ఇతను లారీని చోరీచేసి ఆసుపత్రి దగ్గర నిలిపినట్లు కనుగొన్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో కరోనా పరీక్ష చేయించుకునేందుకు అతను లారీని చోరీ చేసినట్లు తెలిసింది. చెన్నైలోని ప్రైవేటు సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్న అశోక్ కర్ఫ్యూ కారణంగా సొంత ఊరుకు వచ్చేందుకు నిర్ణయించాడు. సరుకు లారీల ద్వారా తిరుత్తురై పూండికి వచ్చిన అతను అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కరోనా భీతి కారణంగా అతన్ని బంధువులు ఇంట్లోకి అనుమతించలేదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బంధువులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. అతను అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయాలని కోరాడు. అక్కడున్న వైద్యులు ఉదయాన్నే పరీక్షలు జరుపుతామని చెప్పారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటే తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో అక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అశోక్ లారీని చోరీచేసి ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో యువకుడిని నాగపట్టణం పోలీసులు అరెస్ట్ చేసి సబ్ జైలుకు తరలించారు. దారుణం: టీవీ పెట్టమని అడిగినందుకు.. -
డ్రైవర్ను చితక్కొట్టి..లారీ చోరీ
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో పైపుల లోడుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది. స్థానికంగా నివాసముంటున్న రమేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కోల్కతా నుంచి బెంగళూరుకు పైపుల లోడు లారీ తీసుకెళ్లుతూ.. ఆదివారం అర్ధరాత్రి దాటాక పలమనేరు చేరుకున్నాడు. లారీలో క్లీనర్ లేకపోవడంతో.. స్థానికులు ఎవరైనా వస్తారేమోనని కనుక్కునేందుకు పలమనేరు శివారులో లారీ ఆపాడు. ఇది గుర్తించిన నలుగురు దొంగలు డ్రైవర్ పై కత్తులతో దాడిచేసి లారీతో సహా ఉడాయించారు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ మృతి చెందిఉంటాడని భావించి అడవిలో పడేశారు. అడవిలో పడిఉన్న లారీ డ్రైవర్ను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. దుండగులు తమిళంలో మాట్లాడారని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
దొంగల్లుడు
మామ గారి లారీ చోరీ గుట్టు రట్టుచేసిన పోలీసులు సిద్దిపేట రూరల్ : లారీని నడపలేక.. దానిపై తీసుకున్న ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక లారీని అల్లుడి ఇంటి దగ్గర పెడితే ఆ అల్లుడు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా అపహరించాడు. లారీ కనిపించడం లేదంటూ మామ ఫిర్యాదు చేయడంతో అల్లుడు గారి బాగోతం బయటపడింది. శుక్రవారం రూరల్ పోలీసుస్టేషన్లో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామానికి చెందిన నల్లారి కనకయ్య శ్రీరామ్ ఫైనాన్స్ సహాయంతో లారీ (ఏపీ16టీబీ5226) కొన్నాడు. అయితే దాన్ని తిప్పలేక, కిస్తీలు కట్టలేక ఎన్సాన్పల్లిలో ఉండే అల్లుడు ఆకుల రవి దగ్గర లారీని ఉంచాడు. కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వాళ్లు ఒత్తిడి చేయడంతో కనకయ్య.. తన అల్లుడి వద్ద ఉంచిన లారీని తీసుకెళ్లాలని చెప్పాడు. అంతలో తానే లారీ కోసం వాకబు చేయగా అది కనిపించడం లేదని తేలింది. దీంతో ఆయన రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సీఐ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఎన్సాన్పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. లారీ టైర్లు తీసుకుని వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, కనకయ్య అల్లుడు రవితో పాటు బూర్గుపల్లి మల్లేశం, ఖైజర్ఖాన్, మూనవర్ హుస్సేన్, షేక్ ఖధీర్లు లారీని విడిభాగాలుగా చేసి అమ్ముకున్నట్లు తెలిపారు. ఆయా భాగాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.