Love locks
-
ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!
ప్రేమ... కలకాలం కలిపి ఉంచే బంధం. అందంగా అల్లుకున్న ప్రేమబంధం...రోజు రోజుకీ మరింతగా బలపడాలి. ఎప్పటికీ దూరంకానంత దగ్గరగా ఉంచాలి. బంధించినంత దృఢంగానూ ఉండాలి. అవసరమైతే గుండె గదికి తాళం వేయాలి. ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! ఒక దేశంలో చెట్టుకు తాళం వేస్తే..మరికొన్ని దేశాల్లో వంతెనలకు తాళం వేస్తున్నారు. ఎంతసేపూ మాట్లాడే పిల్లలను నోటికి తాళం వేయమని టీచర్లు గదిమేవాళ్లు. పిల్లలు చూపుడు వేలిని పెదవుల మీద ఆన్చి దొంగ చూపులు చూస్తూ ఉంటారు. టీచర్ దృష్టి తమ మీద నుంచి పక్కకు మళ్లగానే నోటి మీదున్న చూపుడు వేలిని అలాగే ఉంచి పక్కనున్న పిల్లలతో మెల్లగా గుసగుసలాడుతుంటారు గడుగ్గాయిలు. స్కూలు దశలో మొదలయ్యే ఈ అలవాటు పెద్దయినా పోయేటట్లు లేదు. నిబంధనల కళ్లుగప్పి ప్రేమతాళాలు వేస్తూనే ఉన్నారు ప్రపంచంలోని ప్రేమికులు. ప్రేమను పండించుకోవడానికి తాళాలు వేసే అలవాటు సరదాగా మొదలైంది. ఆ అలవాటును మాన్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల తాళాల అడ్డాలు చాలానే ఉన్నాయి. మనదేశానికీ పాకింది. కానీ వెర్రి తలలు వేయడం లేదు. ప్రేమబంధం కలకాలం ఫ్రాన్స్ దేశం, పారిస్ నగరంలో సీయెన్ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుందని ఓ నమ్మకం. వంతెన రెయిలింగ్‌కు ఉన్న తాళాలన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. ప్రేమికులు తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని మరీ తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. ఇది సరదాగానే మొదలైంది. కానీ విపరీతంగా ప్రచారంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు పారిస్ నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. నగర పాలక సిబ్బంది వాటిని తొలగిస్తూనే ఉన్నారు. ‘ఐ వాంట్ యూ’ ప్రభావం ఫ్రాన్స్‌లో జరుగుతోంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ల నమ్మకం అనిపిస్తుంది. ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యూ’తో మొదలైంది. ఇందులో నాయికానాయకులైన రోమన్ ప్రేమికులు తమ ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించాడు రచయిత. అంతే దశాబ్దంలోపే పారిస్ వంతెనకు ఏడు లక్షల తాళాలు పడ్డాయి. వెర్రితలలు వేస్తున్న ఈ అలవాటును మాన్పించడానికి ‘లవ్ విదవుట్ లాక్స్’ ప్రచారం మొదలైంది. ‘వంతెన మీద నిలబడి ఒక సెల్ఫీ తీసుకోండి. ప్రేమ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాళం పడటం ఆగలేదు, తాళాలు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్కాట్లాండ్లో... ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఈ వంతెన మీద ఏటా ప్రేమికుల కోసం వేడుకలు జరుగుతాయి. వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. అయితే ఈ నిషేధం తాళాలకే, ప్రేమకు కాదు. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసెయాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. మాస్కో ప్రేమ మాస్కోలో వోడూట్డోట్నీ కెనాల్ మీద కట్టిన వంతెన ప్రేమికుల అడ్డా. ఈ వంతెన మీద ఇనుప చెట్లకు నిండా పూలు విరగబూసినట్లు తాళాలుంటాయి. అవన్నీ లవ్లాక్లే. -
మీ ప్రేమను ‘లాక్’ చేయండి
మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని బంధంగా మార్చుకోవాలనుందా? అయితే మీ ప్రేమకు గుర్తుగా తాళం వేసి రండి. అక్కడి బ్రిడ్జి రైలీలకు తాళం వేస్తే ఆ బంధం ఎప్పటికీ విడదీయలేని బంధంగా మారుతుందని ప్రేమికుల నమ్మకం. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎక్కడుంది? దాని వెనకున్న కథేంటీ? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!
మీ ప్రేమను విడదీయలేని బంధంగా మార్చుకోవాలనుందా? అయితే తప్పకుండా పారిస్‌లోని లవ్ లాక్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లండి! మీ ప్రేమ బంధానికి శాశ్వతంగా ఓ తాళం వేసి రండి. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉన్న ఈ లవ్ లాక్ బ్రిడ్జి‘‘ పాంట్ డెస్ ఆర్ట్స్’’ రేయిలింగ్‌లకు తాళాలను లాక్ చేస్తే.. ఆ బంధం విడదీయలేనిదిగా మారుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రేమికుల నమ్మకం. అందుకే ప్రపంచం నలుదిక్కులనుంచి ప్రేమికులు ఆ బ్రిడ్జిని సందర్శిస్తుంటారు. విడదీయలేని బంధంగా నిలవాలని.. సెర్బియాకు చెందిన నాద అనే ఉపాధ్యాయిని రెయిజా అనే సైనికాధికారిని ప్రాణంగా ప్రేమించింది. రెయిజాకు కూడా నాద అంటే ఎంతో ప్రేమ. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో రెయిజా యుద్ధంలో పాల్గొనటానికి గ్రీసు వెళ్లిపోతాడు. అక్కడే కోర్ఫు అనే యువతితో ప్రేమలో పడతాడు. అప్పటినుంచి రెయిజా, నాదను పూర్తిగా మరిచిపోతాడు. ఈ విషయం నాదకు తెలస్తుంది! ప్రేమ చేసిన గాయంతో ఆమె కోలుకోలేకపోతుంది. ఆ కొద్దిరోజులకే గుండెపగిలి చచ్చిపోతుంది. ఇక అప్పటినుంచి ఆ ప్రాంతానికి చెందిన యువతులు తమ ప్రేమను కాపాడుకోవటం కోసం తాళాల మీద తమ పేర్లను రాసి బ్రిడ్జికి ఇరువేపులా ఉన్న రేయిలింగ్‌లకు లాక్ చేయటం ప్రారంభించారు. అది కూడా ఎక్కడైతే రెయిజా, నాదలు తరుచూ కలుసుకుంటూ ఉండేవారో అదే బ్రిడ్జి మీద. అక్కడ లాక్ వేయటం వల్ల తమ ప్రేమబంధం విడదీయలేనిదిగా అవుతుందని ప్రేమికుల నమ్మకం. హంగేరినుంచి పారిస్‌కు.. లవ్ లాక్ సంప్రదాయం పారిస్‌లో పుట్టింది కాదు. మొదట హంగేరీలో మొదలైన ఈ సంప్రదాయం తర్వాత పారిస్‌కు పాకింది. ప్రేమ నగరమైన పారిస్‌లో ఓ ఇటాలియన్ జంట కారణంగా ఈ లవ్ లాక్ సంప్రదాయం మొదలైంది. పారిస్ నగరంలో 2008నుంచి ప్రారంభమై.. సియోన్ నదిమీద ఉన్న ‘‘ పాంట్ డెస్ ఆర్ట్స్’’ బ్రిడ్జి మొత్తం ప్రేమ జంటలు వేసిన తాళాలతో నిండిపోయింది. రంగురంగుల తాళాల కారణంగా సియోన్ బ్రిడ్జిమొత్తం కొత్తశోభను సంతరించుకుంది. ప్రమాదంలో లవ్‌లాక్ బ్రిడ్జి పారిస్ లవ్ లాక్ బ్రిడ్జికి పెరుగుతున్న ఆదరణ కారణంగా లక్షల సంఖ్యలో తాళాలు రేయింగ్లకు వేళాడుతుండేవి. టన్నుల కొద్ది బరువు కలిగిన తాళాలు రేయిలింగ్‌లకు వేళాడుతుండటంతో 2014 సంవత్సరంలో బ్రిడ్జికి సంబంధించిన ఓ భాగం కూలిపోయింది. దీంతో కొందరు స్థానికులు లవ్ లాక్ సంప్రదాయాన్ని పూర్తిగా వ్యతిరేకించటం ప్రారంభించారు. తాళాల కారణంగా సెయిన్ నది అందాలను చూడలేకపోతున్నామని, మంచి ఫొటోలు దిగటానికి కూడా వీలు లేకుండా పోతోందని వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే బ్రిడ్జి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం రేయిలింగ్‌లకు వేలాడుతున్న తాళాలను తొలగించటం ప్రారంభించింది. పర్యాటకుల మనసును నొప్పించకుండా తమ వారసత్వ సంపదను కాపాడుకోవటానికి ఎప్పటికపుడు తాళాలను తొలగిస్తూ వస్తోంది. -
ప్రేమ తాళాలు ఇక కనిపించవు!
-
ప్రేమ తాళాలు ఇక కనిపించవు!
ప్రపంచంలో అందమైన ప్రదేశాలు అనగానే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం కూడా మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రేమికులు ఎక్కువగా వెళ్లాలనుకునే ప్రదేశాలలో పారిస్ ఒకటి. పారిస్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఈఫిల్ టవర్, మరొకటి సీన్ నది వంతెన. ఆ వంతెన విశేషాన్ని ప్రేమికులు అయితే బాగా చెబుతారు. అక్కడికి వచ్చే ప్రేమికులు తమ ప్రేమ కలకాలం అలాగే ఉండాలని, తమకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ సీన్ నదిపై ఉన్న పాంట్ డే ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమ తాళాలు(లవ్ లాక్స్) వేస్తుంటారు. ప్రేమికుల పేర్లను తాళాలపై రాసి వంతెన ఫెన్సింక్ కు కట్టిన తర్వాత ఆ తాళం చెవిలో నదిలో పారవేయటం అనవాయితీగా వస్తోంది. అయితే ఆ ప్రేమ తాళాలకు ఇక్కడ కాలం చెల్లనుంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ప్రేమికుల తాళాల బరువు తట్టుకోలేక సీన్ నది వంతెన కూలిపోతుందని నిపుణులు హెచ్చరించడం. పనిలో పనిగా ఆ లవ్ లాక్స్ ను వేలం వేయగా వచ్చిన డబ్బుతో పారిస్ కు తరలివస్తున్న శరణార్థులకు సదుపాయాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు వంతెన కూలిపోతుందని నగర ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రెండు విధాలా మంచి జరగాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందేనని పారిస్ నగర అధికారులు చెబుతున్నారు. పారిస్ నగర అధికారులు ఈ పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టు ప్రారంభించారు. 65 మెట్రిక్ టన్నుల బరువైన తాళాలు వంతెన ఫెన్సింగ్ లకు ఉన్నాయని, వీటి అమ్మకంతో దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు, లేక లో యూరోలు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. శరణార్థుల కోసం, ఇతర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలనుకునే ప్రజలు ఈ తాళాలను ఒక్కొక్కరు 10 వరకూ కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రేమ తాళంకప్పలను పీకేస్తాం!
మెల్ బోర్న్: ప్రేమ తాళంకప్ప(లవ్ లాక్స్) తొలగించాలని ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. భద్రతా కారణాలతో సౌత్ గేట్ ఫుట్ బ్రిడ్జికి ఉన్న 20 వేలకు పైగా ఉన్న లవ్ లాక్స్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. తాళంకప్పపై తమ పేర్లు రాసి దాన్ని బ్రిడ్జికి ఉన్న తీగకు తాళం వేసి తాళంచెవిని దూరంగా విసిరేయడం ప్రేమికులకు అలవాటుగా మారింది. తమ ప్రేమ గొప్పదని నిరూపించుకునేందుకు గత మూడేళ్లుగా ప్రేమికులు ఈవిధంగా చేస్తున్నారు. కుప్పలు తెప్పులు వచ్చిపడిన ప్రేమ తాళంకప్పులతో బరువు పెరగడంతో బ్రిడ్జి తీగ కిందకు వంగింది. దీంతో వీటిని తోలగించాలని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. లవ్ లాక్స్ ను తొలగించిన తర్వాత వాటిని ఎక్కడ భద్రపరచాలనే దానిపై సలహాలు ఇవ్వాలని మెల్ బోర్న్ పౌరులను మేయర్ రాబర్ట్ డొయలే కోరారు. ప్రేమ తాళంకప్పల బరువు మోయలేక 2014లో పారీస్ లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిలోని కొంతభాగం కూలిపోయింది. వంతెన కూలిపోయిన సమయంలో దానికి 7 లక్షలకు పైగా లవ్ లాక్స్ ఉన్నాయి.