M-Aadhar Permission
-
ఆధార్‌కు లాక్ వేద్దాం!
సాక్షి,గుంటూరు : ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి.. ప్రభుత్వ పథకాలైనా.. ప్రైవేటు పనులైనా ఆ కార్డు లేకుంటే పని జరగదు. ఈ క్రమంలో అదే స్థాయిలో సమాచార చోరీ, వ్యక్తిగత వివరాల భద్రతకు అవరోధంగా మారింది. సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్న తరుణంలో డిజిటల్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోప్యతకు రక్షణ కల్పిస్తూ చోరీకి చెక్ పెట్టేందుకు కేంద్రం ‘ఎం–ఆధార్ యాప్’ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఎం ఆధార్’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో ఆధార్ కార్డులోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. ఎవరైనా సరే తమ ఆధార్ బయోమెట్రిక్ లాక్(వేలిముద్రను) వినియోగించి అవసరమైనప్పుడు కార్డులోని డేటా సేవలను పొందే వీలు కల్పించింది. వినియోగదారుడు ప్రమేయం లేకుండా ఆధార్ వినియోగాన్ని నిలిపివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. సెల్‌ఫోన్ ఎప్పుడు వినియోగదారుడి వెంటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. అన్నింటా ఆధారే.. రేషన్ దుకాణం మొదలు బ్యాంకు ఖాతా, ఫోన్ సిమ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, నగదు బదిలీ, దుకాణం లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ వివరాలు తప్పనిసరి. ఆయా సందర్భాల్లో సమర్పించే నకళ్ల ద్వారా ఆధార్ సమాచారం గోప్యత ప్రశ్నార్థకం అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. అయితే సమాచార చోరీకి అడ్డుకట్ట వేసేందుకు ‘ఎం ఆధార్ యాప్’ ఉపయోగపడనుంది. స్మార్ట్ ఫోనణ్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని బయోమెట్రిక్ రూటర్ ద్వారా మనమే వివరాలను ఆన్లైన్లో అందించి ఎలాంటి సేవలైనా పొందవచ్చు. ఏదైనా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకునే సమయంలో ఫోన్ యాప్‌లో ఎం ఆధార్‌ను ఎటాచ్ చేసుకుంటే జిరాక్స్ కాపీలతో పని ఉండదు. ఈ యాప్ ద్వారా ఏదైనా దరఖాస్తును నేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన విధానం అందుబాటులోకి రావడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వారికి మరింత సులువైంది. డౌన్లోడ్ విధానం ఇలా... ఆధార్ అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో ఎం ఆధార్ యూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్య నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను నమోదు చేస్తే జనరల్ క్యూ ఆర్ కోడ్ వస్తుంది. దీని ద్వారా బమోమెట్రిక్ నమోదువుతుంది. యాప్‌లో బయోమెట్రిక్ లాక్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత అవసరమైనప్పుడు లాక్ ఓపెన్ చేసి ఆధార్ వివరాలతో ఆన్లైన్లో ఎలాంటి జిరాక్స్ పత్రాలు ఇవ్వకుండానే లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. మిగిలిన సమయాల్లో బయోమెట్రిక్‌ను లాక్ చేయవచ్చు. దీని ద్వారా సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఆధార్ వివరాలను కాపాడుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల ఆధార్ యాక్సెస్ ఉన్న పలు బహుళజాతి కంపెనీలు, సైబర్ నేరగాళ్లకు ఆధార్ డేటా కనిపించదు. -
ఇక మొబైల్ ఆధార్‌ను వాడుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : విమానశ్రయాల్లోకి ప్రవేశించడానికి గుర్తింపుగా మొబైల్ ఆధార్‌ను అనుమతించనున్నట్టు ఏవియేషన్ సెక్యురిటీ ఏజెన్సీ బీసీఏఎస్ సర్క్యూలర్ జారీచేసింది. విమానశ్రయ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ప్రయాణికులు తాము నిర్దేశించిన 10 ఐడెంటీ ప్రూఫ్స్‌లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని బీసీఏఎస్ పేర్కొంది. వీటిలో పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ లేదా మొబైల్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులున్నాయి. సెక్యురిటీ స్టాఫ్‌తో ఎదురయ్యే వివాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రయాణం కోసం తమ పేరుపై తీసుకున్న వాలిడ్ టిక్కెట్, ఫోటో గుర్తింపుతో ఉన్న ఏదైనా ఒక ఒరిజినల్ డాక్యుమెంట్‌ను తెచ్చుకోవాలని బీసీఎఎస్ సర్క్యూలర్ సూచించింది. జాతీయ బ్యాంకు జారీచేసిన పాస్‌బుక్, పెన్షన్ కార్డు, డిసేబిలిటీ ఫోటో ఐడెంటిఫికేషన్, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సర్వీసు ఫోటో ఐడీ కార్డు, పీఎస్‌యూ, లోకల్ బాడీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసే కార్డులను కూడా గుర్తింపు ఆధారాలుగా ఆమోదించనున్నట్టు పేర్కొంది. విద్యార్థులైతే ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ జారీచేసే ఐడీ కార్డు సమర్పించవచ్చని తెలిపింది. ఐడెంటీ ప్రూఫ్ నుంచి మైనర్లను పరిమితిస్తున్నట్టు ఈ సర్క్యూలర్ వెల్లడించింది. ఒకవేళ పైన పేర్కొన్న 10 డాక్యుమెంట్లలో ఏదీ లేకపోతే, గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ జారీచేసిన సర్టిఫికేట్ ఏది ఉన్నా అనుమతించనున్నట్టు బీసీఏఎస్ తెలిపింది. -
రైళ్లలో ఎం–ఆధార్‌కు అనుమతి
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇకపై ఆధార్ కార్డును కచ్చితంగా వెంట తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ తరగతిలో ప్రయాణించే వారికి గుర్తింపు కార్డు కింద ‘ఎం–ఆధార్’ (మొబైల్ యాప్)ను అనుమతిస్తున్నట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. ఎం–ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసు కుని మొబైల్ నంబర్‌ను అనుసంధానిస్తే డిజిటల్ కార్డుగా ఉపయోగపడుతుంది. సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు యాప్‌ను ఓపెన్‌చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డిజిటల్ ఆధార్ కార్డు కనిపిస్తుంది. ఎన్నారై పెళ్లిళ్లకు ఆధార్ తప్పనిసరి! భారత యువతులను పెళ్లి చేసుకునే ఎన్నారైలకు ఇకపై ఆధార్ తప్పనిసరి కానుంది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కింద ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ సూచించింది. ఎన్నారైల పెళ్లిళ్ల వివాదాలు, మహిళల హక్కులను కాపాడటం, విదేశాల్లో వరకట్న వేధింపులు, గృహహింస బాధితులను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడు తుందని కమిటీ పేర్కొంది. ఎన్నారైల పెళ్లిళ్లకు ఆధార్ తప్పనిసరి చేయాలన్న కమిటీ తన నివేదికను విదేశీ వ్యవహారాల శాఖకు ఆగస్టు 30న సమర్పించింది. నిందితుల అప్పగింతకు పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో వరకట్న వేధింపులను కూడా చేర్చాలని సూచించింది.