madhusudhan rao
-
రైలు ప్రమాద ఘటనలో లోకో పైలట్ మధుసూదన్ రావు మృతి
-
కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
-
ఆయన మాటలకు ఆకర్షితురాలైంది.. రూ.50తో పెళ్లి జరిగిపోయింది
రక్త సంబంధం, వీరాభిమన్యు, ఆరాధన, లక్ష్మీ నివాసం, విక్రమ్.. అన్నీ విజయకేతనం ఎగురవేసిన రజతోత్సవ చిత్రాలే... వీరమాచినేని ఇంటి పేరును విక్టరీగా మార్చిన చిత్రాలు.. ప్రజా నాట్య మండలి భావాలతో కమ్యూనిస్టు వివాహం చేసుకున్నారు... జీవితం మీద ఆశతో జీవించిన తండ్రి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు గురించి రెండో కుమార్తె వాణి చెబుతున్న విషయాలు... నాన్న కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో పుట్టారు. నాన్న వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. నాన్న ఎనిమిదో ఏటే తల్లిని పోగొట్టుకోవటంతో, మూడు సంవత్సరాల వయసున్న చెల్లిని ఎంతో బాధ్యతగా పెంచారు. నాన్నకు మేం ఇద్దరం ఆడపిల్లలం. అక్క వీణ, నేను వాణి. నా ఎనిమిదో యేట అమ్మ నాన్నలతో మేం చెన్నై వచ్చాం. ప్రకాశ్ స్టూడియోలో చిన్న జీతానికి చేరారు. నాన్నకి ఆర్థికంగా సహాయపడటం కోసం అమ్మ డబ్బింగ్ చెప్పేది. అక్క నేను కేసరి హైస్కూల్లో చదువు పూర్తయ్యాక, అక్క బి.ఎస్.సి, నేను ఎం.ఎస్.సి. చదివాం. నాన్న ప్రారంభించిన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను. చాలా కష్టజీవి నాన్న సోడా బండి తోసి, పొలంలో నాట్లు వేసి, కూలి పని చేసి డబ్బులు సంపాదిస్తూ వారలబ్బాయిగా చదువుకుంటూ, ఇంటర్మీడియెట్ స్టేట్ ఫస్ట్‌లో ప్యాసయ్యారు. నటన మీద శ్రద్ధతో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఎనిమిదేళ్లు ప్రకాశ్ స్టూడియోలో కె. ఎస్. ప్రకాశరావు గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశాక దర్శకులయ్యారు. తన సినిమాలకు దగ్గరుండి మరీ ఆత్రేయతో పాటలు రాయించుకున్నారు. ముందుగానే మ్యూజిక్ సిద్ధం చేసుకునేవారు. రికార్డయిన పాటలను ఇంట్లో వినిపించేవారు. అందరం పాడుకునేవాళ్లం. నాన్నకు ‘ప్రొడ్యూసర్స్ మ్యాన్’ అనీ, కోపిష్ఠి అనీ పరిశ్రమలో పేరుంది. సినిమా పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో, యజ్ఞం చేస్తున్నట్లు మౌనంగా మునిలా ఉండేవారు. అప్పుడప్పుడు నాన్నతో షూటింగ్లకి వెళ్లేవాళ్లం. ఒక హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్తూ, నన్ను కాశ్మీర్ తీసుకువెళ్లారు. సినీ నటి జి. వరలక్ష్మిగారికి నాన్న కమిట్మెంట్ నచ్చింది. నాన్నను ఆప్యాయం గా‘మధు’ అని పిలిచేవారు. నాన్న ఆవిడను ‘అమ్మ’ అనేవారు. ‘ఎ డైరెక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ గుడ్ రిక్రియేటర్ హిమ్సెల్ఫ్’ అన్నారు నాన్న గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్. సొంత ఆస్తి వద్దనుకున్నారు.. నాన్న సినిమాలలో బాగా బిజీ అయ్యాక ఉదయాన్నే ఏడు గంటలకు షూటింగ్ ఉంటే, ఐదు గంటలకే రెడీ అయిపోయేవారు. నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయాం. అమ్మ పంపే క్యారేజీ సెట్లో అందరితో కలిసి తినేవారు. మేం పెద్దవాళ్లం అయ్యాక మమ్మల్ని చూడాలనిపిస్తే ‘వాణిని పేపర్ తెమ్మను’ అనేవారు. అలా మమ్మల్ని చూసేవారు. పర్సనల్ ప్రోపర్టీ వద్దనుకున్నారు. కాని నాన్న సన్నిహితులు నాన్న చేత పొదుపు చేయించి, స్థలం కొనిపించారు. ఎకరం స్థలంలో దగ్గరుండి స్టూడియో కట్టించారు. నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, చాట్ల శ్రీరాములుగారిని ప్రిన్సిపాల్‌గా నియమించి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఆయనంటే నాన్నకు అంత గౌరవం. ప్రజాసేవ అంటే ఇష్టం... ఒకసారి నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు రాయలసీమ కరవు ప్రాంతాల వారికి సహాయం చేయటం కోసం సినిమా వారంతా జోలె పట్టారు. అందరితో పాటు అమ్మనాన్నలు బయలుదేరారు. ‘చంటిపిల్లకు అనారోగ్యంగా ఉంది కదా’ అని బంధువులంటే, ‘నా బిడ్డల్ని దేవుడు చూస్తాడు. అక్కడ వందల మంది ఆకలి బాధతో మరణిస్తున్నారు’ అన్నారట అమ్మ నాన్నలు. సమాజం పట్ల అంత బాధ్యతగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. అవసరాన్ని బట్టి ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నాన్న ఆలోచించేవారు. నేను సర్జరీ చేయించుకున్నప్పుడు నాన్న ఇంట్లోనే ఉండి, కంటికి రెప్పలా చూసుకున్నారు. నాన్నకు ఆడపిల్లలంటే సాఫ్ట్ కార్నర్. నాన్న ఇష్టాలు... నాన్నకి తెల్ల బట్టలంటే ఇష్టం. మల్లెపూలంటే మక్కువ. మల్లెపూల దండ చేతికి కట్టుకుని, ఆ సువాసనను ఆస్వాదిస్తూ, భోజనం చేసేవారు. శాకాహారమంటేనే ఇష్టం. రోటి పచ్చళ్లు బాగా తినేవారు. రోజూ పెరుగన్నంలో ఉసిరికాయ బద్దలు, మామిడికాయ బద్దలు ఉండవలసిందే. నాన్న కోసం జలాలు రకం మామిడికాయలతో ఆవకాయ పెట్టేది అమ్మ. చిన్న వంటకాన్ని సైతం బాగా ఆస్వాదించే వారు. జుట్టుకు రంగు వేయటం ఇష్టం లేదు. నాన్న ప్రారంభించిన మధు మూవీస్ బ్యానర్లో నన్ను పెళ్లికూతురు గెటప్‌లో మధుకలశం పట్టుకుని ఉన్న పొజిషన్లో చూపించారు నాన్న. నాన్న ఆశావాది నాన్నకి తీవ్రంగా అనారోగ్యం చేసినా, బతకాలనే కోరికే ఆయనను బతికించింది. పదకొండు సంవత్సరాలు ఆయనను కంటిపాపలా చూసుకున్నాను. ‘‘ఇప్పుడు నువ్వు నన్ను నీ కొడుకులా చూసుకుంటున్నావు. నాకు ఇంకా పదమూడేళ్లు జీవితం ఉంది’’ అన్నారు. కాని 2012లో తన 89వ ఏట కన్నుమూశారు. 2023లో నాన్నగారి శతజయంతి చేయాలనుకుంటున్నాం.పద్నాలుగేళ్ల్ల వయసులోనే, తాతతో కలిసి అమ్మ మీటింగ్స్‌కి వెళ్లేది. నాన్న 1940లో కమ్యూనిస్టు పార్టీ ప్రెసిడెంట్‌గా స్పీచ్ ఇస్తుంటే, ఆయన మాటలు విని ఆకర్షితురాలై, ఎలాగైనా నాన్ననే వివాహం చేసుకోవాలనుకుంది. స్కూల్ మాస్టర్‌గా పనిచేస్తున్న మా తాతయ్యతో అమ్మ, ‘ఉరై సుబ్బన్నా, నన్ను మధుసూదన్‌కి ఇచ్చి చేయకపోతే కుదరదు’ అందట. అలా యాభై రూపాయల ఖర్చుతో అమ్మనాన్నలకు కమ్యూనిస్టు పెళ్లి జరిగిపోయింది. అమ్మ ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో బుర్రకథలు చెప్పేదట. సంభాషణ: వైజయంతి పురాణపండ -
త్వరలో 18 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సిన్
-
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలకు చెందిన రచయితలు బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, సంస్కృత భాషలో పెన్నా మధుసూదన్ రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన కూడా మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. పెన్నా మధుసూదన్ జడ్చర్లకు చెందినవారు. గతంలో ఆయన సోమనాథ్ సంస్కృత పండిట్ అవార్డు, పండిట్ లట్కర్‌శాస్త్రి మెమోరియల్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సాధువు గులాబ్‌రావు మహారాజ్ ఆధ్యాత్మిక తత్వబోధనలపై ప్రజ్ఞాచాక్షుషం రచించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు. చాలా ఆనందంగా ఉంది అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబంలో ఒక నిర్దన పరివారంలో పుట్టిన ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని 850 శ్లోకాల్లో రాశాను. ఆయన జీవితం, ఆయన దార్శనిక విచారాలు, తత్వజ్ఞానాలు ప్రస్తావించాను. ఆ మహాత్ముడి జీవితం తెలియాలి. 34 ఏళ్లు మాత్రమే జీవించారు. 134 పుస్తకాలు,4 భాషల్లో రాశారు. భారతీయ ధర్మాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. మరిన్ని రచనలు చేసేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్నిస్తుంది. –పెన్నా మధుసూదన్ అవార్డు రావడం సంతోషకరం నేను రాసిన శప్తభూమి నవలకు ఈ అవార్డు రావడం పాఠకులకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. దాని ఆధారంగా నాకూ సంతోషాన్నిచ్చింది. తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమకు కూడా తనకంటూ ఒక భాష, సంస్కృతి ఉందని వివిధ ప్రాంతాలకు తెలియపరిచేందుకు ఈ శప్తభూమి రాశాను. రాయలసీమ చారిత్రక మూలాలు 18వ శతాబ్దం నుంచి తీసుకుని ఈ నవల రాశాను. రాయలసీమ కరువు, కరువుల పరంపరలను నవలలో రాశాను. రాయలసీమ కరువు కాటకాలను, సుఖదుఃఖాలను వివిధ ప్రాంతాలతో పంచుకునే అవకాశం లభించింది. – బండి నారాయణ స్వామి -
పాఠశాలల్లో జెండా వందనంపై మార్గదర్శకాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : 70వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో జెండా వందనం చేయడంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. ఆయా మార్గదర్శకాలను పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని కోరారు. గ్రామంలో ఒకటే ప్రాథమిక పాఠశాల ఉన్నట్టయితే అక్కడ ఎంపీటీసీ సభ్యుడితో జెండా వందనం చేయించాలని , రెండు పాఠశాలలు ఉన్నట్లయితే ఒక పాఠశాలలో ఎంపీటీసీ, మరో పాఠశాలలో సర్పంచ్‌తో జెండా వందనం చేయించాలన్నారు. గ్రామంలో ప్రా«థమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ సభ్యులు, ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్‌చే జెండా వందనం చేయించాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీ సభ్యులతో జెండా వందనం చేయించాలని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలుంటే అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్, ప్రాథమిక పాఠశాలలో ఎంపీటీసీ సభ్యులచే జెండా వందనం చేయించాలన్నారు -
బీమా ప్రీమియం గడువు పొడిగింపు
ఈ నెల 15 వరకు సమయం అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఎట్టకేలకు వేరుశనగ పంటకు వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకూ పొడిగించారు. మొదట్లో ప్రీమియం గడువు పొడిగింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసినా అందుకు బీమా కంపెనీ అంగీకరించలేదు. దీంతో జీవో అమలుకు నోచుకోలేదు. ఈ విషయమై ‘బీ(ధీ)మా పోయే’ శీర్షికన ఈ నెల ఒకటో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. రైతులకు జరగనున్న అన్యాయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదనరావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను బీమా కంపెనీ అధికారులకు వివరించి, ప్రీమియం పొడిగింపునకు వారిని ఒప్పించారు. ఆ మేరకు వ్యవసాయ బీమా కంపెనీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీమా ప్రీమియం పొడింగింపు ఉత్తర్వులు అందినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులు (లోనీ ఫార్మర్స్) ఈ నెల 15 వరకు బీమా ప్రీమియం చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వేరుశనగ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా బీమా ప్రీమియం చెల్లింపు గడువు కేవలం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి, వెంటనే రుణాలు రీషెడ్యూల్ చేసుకుని పంటల బీమా సౌకర్యాన్ని పొందాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. -
బేతపూడి సర్పంచ్ దారుణ హత్య
కురగల్లు(మంగళగిరి రూరల్),న్యూస్‌లైన్: రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో బేతపూడి సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు గొడ్డళ్లు,కత్తులతో నరికి హతమార్చారు. కురగల్లు - నిడమర్రు రోడ్డులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల సమాచారం మేరకు బేతపూడి గ్రామ సర్పంచ్ బత్తుల నాగసాయి (38)ని దుండగులు గొడ్డళ్లతో హతమార్చి పరారయ్యరు. ఓ కేసు విషయమై గ్రామస్తులు ధనలక్ష్మి, సరిశెట్టి వెంకటేశ్వరమ్మ, గైరుబోయిన కోటమ్మ, బుల్లయ్యతో కలసి సాయి మంగళవారం ఉదయం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 8.15 గంటలకు అంతా కలసి కారులో తిరిగి వస్తున్నారు. కురగల్లు -నిడమర్రు రోడ్డుకు రాగానే నాగసాయి కారుకు అడ్డుగా మరో కారు వేగంగా వచ్చి ఆగింది. దానిలో నుంచి ఏడెనిమిది మంది దుండగులు దిగి నాగసాయి కారును గొడ్డళ్లు, కత్తులతో ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే నాగసాయి పై విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. చివరకు గొంతుకోసి పరారయ్యారు. ఈ సమయంలో కారు డ్రైవర్ గుండాల చంద్రశేఖర్ పరారు కాగా మిగిలిన వారు కారు వద్దనే వున్నారు. దుండగులు కారుపై మారణాయుధాలతో దాడి చేసినప్పుడు మహిళలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు అక్కడకు చేరుకుని నాగసాయి మృతదేహన్ని పరిశీలించారు. సమాచారం ఎవరికైనా చెబితే చంపేస్తామని దుండగులు బెదిరించి పారిపోయినట్టు అక్కడి వారు తెలిపారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. పట్టణానికి చెందిన ఓ ఆటో కన్సల్టెంట్ నిర్వాహకునితో వున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా సర్పంచ్ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి రూరల్ సీఐ మధుసూదనరావు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు. -
ఒంగోలు వల్ల జిల్లా మొత్తానికి చెడ్డపేరు వస్తోంది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలు నగరంలో ఓటు హక్కుకు సంబంధించి పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో జిల్లా మొత్తానికి చెడ్డపేరు వ స్తోందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఒంగోలు ఆర్డీఓను ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా అబ్జర్వర్ మధుసూదనరావుతో కలిసి నియోజకవర్గస్థాయి అధికారులు, తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రతిరోజూ తనకు ఎస్ఎంఎస్ రూపంలో నివేదికలు అందించాలని ఆదేశించారు. ఏబీసీడీలు కూడా నొక్కలేరా.. ‘ప్రతి తహసీల్దార్‌కు డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చాం. కీలకమైన ఆ సిగ్నేచర్‌ను ఆపరేట్ చేయలేకపోతున్నారు. ఏబీసీడీ అనే లెటర్స్ కూడా కొట్టలేకపోతున్నారు. పైగా కంఫ్యూటర్ ఆపరేటర్‌కు వాటిని ఇస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే మిమ్మల్ని బయటకు పంపించి కంప్యూటర్ ఆపరేటర్లను తహసీల్దార్లుగా చేయాల్సి వస్తుందేమోనని’ కలెక్టర్ వ్యాఖ్యానించారు. మార్కాపురం ఆర్డీఓను అడిగితే తహసీల్దార్ పేరు చెప్పడం, తహసీల్దార్ అడిగితే కంప్యూటర్ ఆపరేటర్ పేరు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. జిల్లాలో చేతగానివారు, పనికిమాలినవాళ్లు ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు పనిచేస్తూ కూడా ఎందుకు అనిపించుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఓటర్ల దరఖాస్తులు ప్రతిరోజూ అప్లోడ్ చేయాలి: రోల్ అబ్జర్వర్ ఓటర్లను విచారించిన అనంతరం ఆ దరఖాస్తులను ఏరోజుకారోజు అప్లోడ్ చేయాలని రోల్ అబ్జర్వర్ మధుసూదనరావు ఆదేశించారు. ఒంగోలులో ఓటర్ల నమోదుకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని సకాలంలో విచారణ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు లేకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నేటి రాష్ర్ట స్థాయి సైన్స్‌ఫేర్ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : నార్పలలో శనివారం నుంచి సోమవారం వరకు జరగాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. రాష్ర్ట విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పైర్‌ను వాయిదా వేసినట్లు డీఈఓ వివరించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు.