ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : 70వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో జెండా వందనం చేయడంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. ఆయా మార్గదర్శకాలను పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని కోరారు. గ్రామంలో ఒకటే ప్రాథమిక పాఠశాల ఉన్నట్టయితే అక్కడ ఎంపీటీసీ సభ్యుడితో జెండా వందనం చేయించాలని , రెండు పాఠశాలలు ఉన్నట్లయితే ఒక పాఠశాలలో ఎంపీటీసీ, మరో పాఠశాలలో సర్పంచ్‌తో జెండా వందనం చేయించాలన్నారు. గ్రామంలో ప్రా«థమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ సభ్యులు, ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్‌చే జెండా వందనం చేయించాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీ సభ్యులతో జెండా వందనం చేయించాలని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలుంటే అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్, ప్రాథమిక పాఠశాలలో ఎంపీటీసీ సభ్యులచే జెండా వందనం చేయించాలన్నారు