Mahabharata war
-
విపక్ష కూటమిలో 2జీ, 3జీ, 4జీ పార్టీలు
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహాభారత యుద్ధంతో పోల్చారు. పాండవులు, కౌరవుల్లా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి తలపడబోతున్నాయని చెప్పారు. ‘‘విపక్ష కూటమిలోని పారీ్టలన్నీ వారసత్వ, బుజ్జగింపు, అవినీతి రాజకీయాల్లో ఆరితేరాయి. అవన్నీ 2జీ, 3జీ, 4జీ పార్టీలు. వాటిని రెండో తరం, మూడో తరం, నాలుగో తరం నేతలు నడిపిస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ఆదివారం బీజేపీ జాతీయ సదస్సులో ‘బీజేపీ: దేశానికి ఆశ, ప్రతిపక్షానికి నిరాశ’ తీర్మానంపై అమిత్ షా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రధాని మోదీ విపక్షాల అనైతిక రాజకీయాలకు ఇప్పటికే చరమగీతం పాడారని, దేశంలో అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చారని కొనియాడారు. ‘‘ప్రజల మనస్సులో ఏ సందేహాలూ లేవు. మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. మోదీ తాను కరిగిపోతూ వెలుగులు పంచే కొవ్వొత్తి లాంటివారు. దేశాభివృద్ధి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలే ఉంటే ఒకప్పుడు టీ అమ్ముకొని జీవించిన పేద తండ్రి కుమారుడైన మోదీ ప్రధాని అయ్యేవారు కాదు’’ అన్నారు. జేపీ నడ్డా కొనసాగింపు సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆదివారం బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నడ్డా పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్సభ ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే ఎదుర్కొంటామని బీజేపీ ప్రకటించింది. ముఖ్యమైన పారీ్ట నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే అధికారాన్ని నడ్డాకు కట్టబెట్టారు. -
Karnataka assembly elections 2023: అవినీతి బీజేపీని ఓడించాలి: ప్రియాంక
సాక్షి, బళ్లారి: ‘కర్ణాటక ఎన్నికలు మహాభారత యుద్దం వంటివి. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరుగుతోంది. అవినీతి పరులు, రాష్ట్రాన్ని లూటీ చేసిన బీజేపీకి ఓటు వేస్తారా? అవినీతి రహిత పాలన అందించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? మీరు తేల్చుకోవాల్సిన విషయం’అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఆమె గురువారం కర్ణాటకలోని కనకగిరిలో ప్రచారసభలో మాట్లాడారు. యుద్ధంలోనైనా, ఎన్నికల్లోనైనా లక్ష్యం తప్పితే ఓడిపోతామన్నారు. లక్ష్యం తప్పితే మళ్లీ అవినీతి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అప్పటి ఇందిరాగాంధీ పాలనను ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటున్నారంటే కారణం.. ఆమె దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు, పేదల కన్నీరు తుడిచినందుకేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక లక్షన్నర కోట్ల రూపాయలను లూటీ జరిగిందని, ఆ డబ్బుతో 30 లక్షల పేదల కుటుంబాలకు ఇళ్లు కట్టించవచ్చునని, 100 ఆస్పత్రులను నిర్మించవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఇంత భారీగా దోపిడీ చేసిన ప్రభుత్వానికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. -
కృష్ణుడు మోశాడు
అది మహాభారత యుద్ధ సమయం. భీష్మాచార్యుడు మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా పాండవుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దిక్కుతోచని ద్రౌపది విశ్వానికి ఏకైక దిక్కయిన శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించింది. తన భర్తలని ఏ విధంగానైనా రక్షించి తన మాంగల్యాన్ని కాపాడమని వేడుకుంది. రక్షిస్తానని మాటిచ్చాడు కృష్ణుడు. ఆరోజు రాత్రి భీష్మాచార్యుడు తాను తొందరపాటుతో చేసిన ప్రతిజ్ఞ వల్ల మనస్సు వ్యాకులం చెందగా, తనలో తానే మథన పడుతూ, ఈ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు ఎదురవుతున్నాయో అని నిద్దుర లేమితో గుడారంలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కృష్ణుడు ద్రౌపదిని తోడ్కోని భీష్మాచార్యుని గుడారం వద్దకు వెళ్లాడు. కృష్ణుని ఆజ్ఞ ప్రకారం ద్రౌపది ఒక్కసారిగా వెళ్లి భీష్ముని పాదాలపై వాలింది. ‘దీర్ఘ సుమంగళీ భవ’ అని ఆశీర్వదించి ‘నీవు ఎవరవమ్మా?’’ అని అడిగాడు భీష్ముడు. ఎదురుగా నిలుచున్న ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయాడు. దీర్ఘసుమంగళీ భవ’అని ఆశీర్వదించాక ఆమె భర్తలని తాను ఎలా చంపగలడు?! ఉద్వేగానికి లోనయ్యాడు భీష్మాచార్యుడు. ఇంతలో కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించాడు. తెర వెనుక ఉన్న సూత్రధారి ఎవరో అప్పుడు భీష్మునికి అర్థమైంది. కృష్ణ దర్శనంతో కొంత ఉపశమనం పొందాడు. ఆకలనిపించింది. కృష్ణుని అంగవస్త్రంలో ఉన్న మూటను చూసి, అదేదో తినుబండారమై ఉంటుందని భావించి, తనకు పెట్టమని అడిగాడు. కృష్ణుడు తాను మోసుకొచ్చిన మూటను విప్పి చూపించగా అందులో పాదరక్షలు అగుపించాడు. భీష్ముడు నిర్ఘాంతపోయి, ‘‘ఇదేమిటి కృష్ణా!’’అన్నాడు. ‘‘చెప్పుల శబ్దం విని ద్రౌపది రాకను నీవు గమనించకూడదనే ఉద్దేశ్యంతో నేను ఆమె పాదరక్షలను మోసుకొచ్చాను’’ అని చెప్పాడు కృష్ణుడు. ఎలాగైతేనేం, భీష్మునితో దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు వరాన్నైతే ఇప్పించాడు ద్రౌపదికి. -
మహాభారత కాలంలోనే జర్నలిజం..
సాక్షి, మధుర : జర్నలిజంపై యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతం సమయంలోనే పాత్రికేయ వృత్తి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. హిందీ జర్నలిజం డే సందర్భంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ పురాణాల్లో దేవతలకు వార్తలను చేరవేసే నారదుడిని ఆయన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్తో పోల్చారు. మీ గూగుల్ ఇప్పుడు ప్రారంభమైతే తమ గూగుల్ శతాబ్ధాల కిందటే వెలుగుచూసిందని, సమాచార సారధైన నారదముని సందేశాలను ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వాయువేగంతో చేరవేసేవారని అన్నారు. ఇక హస్తినాపురంలో కూర్చుని సంజయుడు మహాభారత యుద్ధాన్ని దృతరాష్ర్టుడికి వివరిస్తాడని ఇది ప్రత్యక్ష ప్రసారం కాక మరేమిటని దినేష్ శర్మ ప్రశ్నించారు. సంజయుడి కళ్ల ద్వారా మహాభారత ఘట్టాలను ఇతరులు ఎలా వీక్షించారని ప్రశ్నించగా అలాంటి సాంకేతికత అప్పట్లోనే అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారు. అంధుడైన ధృతరాష్ట్రుడు ఇంట్లో కూర్చుని యుద్ధ విశేషాలను తెలుసుకుంటాడని, ఇది సనాతన భారత్ సాధించిన విజయంగా త్రిపుర గరవ్నర్ తథాగథ రాయ్ గతంలో పేర్కొన్నారు. కాగా, మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ వ్యవస్థ ఉందని అస్సాం సీఎం విప్లవ్ దేవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
కురుపితామహుడి దేవాలయం
భీష్ముడు... మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణాన్ని పొందిన కురు పితామహుడు.విష్ణుసహస్ర నామాలను చెప్పిన మహానుభావుడు.పాండవులకు నీతిబోధ చేసిన రాజనీతిజ్ఞుడు.తండ్రి వివాహం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా తనువు చాలించిన పుణ్యపురుషుడు.అలాంటి భీష్ముడికి ఒకే ఒక ఆలయం దేశంలో ఉంది. భారత కథలో... శంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అప్పుడు గంగాదేవి ‘నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేను నిన్ను విడిచివెళ్లిపోతాను’ అంది. అంగీకరించాడు శంతనుడు. పెళ్లయ్యింది. గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు. ఆమె ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో విడిచింది. ఈ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలో విడిచింది. ఎనిమిదవ పుత్రుడిని విడిచి పెడుతుండగా శంతనుడు అడ్డు తగిలాడు. తను విధించిన షరతు ప్రకారం గంగాదేవి శంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును తనతో తీసుకువెళ్లి పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పింది. ఆ బిడ్డకు ‘దేవవ్రతుడు’ అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి శంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది. ఒకనాడు శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగబోయే కుమారుడే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు ఆమె తండ్రి దాసరాజు. ఈ విషయం తెలుసుకున్న గంగానందనుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై శయనించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు. యుద్ధం ముగిసిన తరవాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేశాడు. భీష్ముడు శర శయ్య మీద ఉన్నప్పుడే విష్ణుసహస్ర నామాలను రచించాడని ప్రతీతి. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ 1008 నామాలు పఠించాడు భీష్ముడు. ఆయన జీవితం భారతీయులకు ఒక గ్రంథం లాంటిది. అరుదైన దేవాలయం... అలహాబాద్ నగర నడిబొడ్డున అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది. యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుని, భ్రాతృత్వాన్ని అలవరచుకుంటున్నారు. పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి దారగంజ్లోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని జె.ఆర్.భట్ అనే న్యాయవాది నిర్మింపచేశాడు. 1961 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. కురుక్షేత్రలో భీష్మకుండ్ హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట ఒక పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. దానిని బన్గంగ లేదా భీష్మకుండ్ అంటారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేసి మంచినీరు కావాలని కోరడంతో, అర్జునుడు బాణంతో పాతాళగంగను బయటకు తీసుకువచ్చాడని, ఈ భీష్మకుండ్ అదేనని స్థానికులు చెబుతారు. – డా.పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ -
కృతవర్మ
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 26 మహాభారత యుద్ధం తరువాత కౌరవులవైపు యుద్ధం చేసినవాళ్లల్లో మిగిలినవాళ్లు ముగ్గురు; అశ్వత్థామా కృపాచార్యుడూ కృతవర్మాను. వీళ్లల్లో అశ్వత్థామా కృపాచార్యుడూ కౌరవులు కారు; కృతవర్మేమో యాదవుడు. యాదవు డంటే, శ్రీకృష్ణుడి వైపువాడు. ఇతను భోజ వంశంవాడు గనక భోజుడనీ అంటారు. ఇతని తండ్రి హృదీకుడు. హృదీకుడికి దేవబాహువూ శతధన్వుడూ పుట్టిన తరు వాత కృతవర్మ పుట్టాడు. కుంతి యాదవ స్త్రీ గనక యాదవులు పాండవులకు చుట్టాలు. యాదవుడయ్యుండీ కృతవర్మ మాత్సర్యం కొద్దీ, దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. శల్యుడూ పాండవుల వైపు పోరాడవలసినవాడే గానీ పొగడ్తలకూ మెరమెచ్చులకూ లొంగి, మదం కొద్దీ దుర్యోధనుడి కొమ్ముకాశాడు. ఈ మాత్సర్యానికి మూలం సత్యభామ. సత్యభామ సత్రాజిత్తు కూతురు. ఆమెను కృతవర్మకిచ్చి పెళ్లి చేస్తానని మొదట్లో సత్రాజిత్తు వాగ్దానం చేశాడు. కానీ పరి స్థితులు కలిసిరాక, ఆమెను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. కృతవర్మకు తలకొట్టినట్ట యింది. శిశుపాలుడు కూడా ఇలాగే తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడని గగ్గోలు పెట్టాడు. కృష్ణుడిని నానా తిట్లూ తిట్టాడు. దానికి అతను యుద్ధానికి చాలా ముందుగానే తన బతుకునే పోగొట్టుకున్నాడు. కృతవర్మ మాత్రం బయటపడకుండా పగతోనూ ద్వేషంతోనూ రగిలి పోతూ యుద్ధమప్పుడు కృష్ణుడికి వ్యతిరేకి అయిన దుర్యోధనుణ్ని బలపరచడానికి నడుము కట్టాడు. ధర్మా ధర్మాలను తూచకుండా కృష్ణుడితో విరోధం ఒక్కటే మిషగా పెట్టుకొని పాండ వులతో పోరాడడానికే సిద్ధమయ్యాడు. కృతవర్మ మాత్సర్యానికి మూలమైన సత్యభామ తండ్రి సత్రాజిత్తు. వృష్ణి వంశీ యుడైన నిమ్నుడి కొడుకు. ఇతను సూర్యు డికి భక్తుడూ సఖుడూను. సూర్యుడు సత్రాజిత్తుకు శ్యమంతకమణిని ఇచ్చాడు. అది మెడలో వేసుకొని సూర్యుడిలాగ వెలిగిపోయేవాడు సత్రాజిత్తు. ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజుకు ఇస్తే బాగుంటుందని సూచించాడు. అంతటి బంగారాన్నిచ్చే మణి, ప్రజల్లో ఒకడి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే, దాని లాభాన్ని రాజ్యం లోని ప్రజలందరూ పొందవచ్చునని కృష్ణుడి ఉద్దేశం. కానీ, డబ్బుమీద వ్యామోహం కొద్దీ సత్రాజిత్తు, కృష్ణుడి ప్రతిపాదనను కాదన్నాడు. ఓసారి, ఆ మణిని మెడలో వేసుకొని ఠీవిగా సత్రా జిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకెళ్లాడు. ఆ మణి ఎర్రగా మాంసమ్ముక్కలాగ ఉండ డంతో ఒక సింహం ప్రసేనజిత్తునీ అత నెక్కిన గుర్రాన్నీ చంపి, మణిని ఎత్తుకొని పోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడనే భల్లూకం చంపి... మణిని గుహలో తన పిల్లల పిల్లలకు ఆటవస్తువుగా వేలాడ దీశాడు. అడిగినప్పుడు ఇవ్వలేదని శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ని చంపి, మణిని తీసు కొనిపోయాడని సత్రాజిత్తు అపనిందను మోపాడు. ఆ నీలాపనిందను పోగొట్టుకో డానికి శ్రీకృష్ణుడు కొంతమందిని వెంట బెట్టుకొని అడవిలోకి వెళ్లాడు. చనిపోయి పడి ఉన్న గుర్రాన్నీ ప్రసేనజిత్తునీ సింహాన్నీ వరుసగా చూసుకుంటూ భల్లూక గుహ దగ్గరికి చేరాడు శ్రీకృష్ణుడు. గుహ లోపలికి పోయి మణిని తీసుకోబోతూంటే, జాంబ వంతుడు వచ్చి, శ్రీకృష్ణుడితో ఇరవై ఎని మిది రోజుల పాటు కుస్తీ పట్టాడు. చివరికి శ్రీకృష్ణుడిలో శ్రీరాముణ్ని చూసి, మణితో బాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. బంగారం ఇచ్చే మణే ఇంత అనర్థాన్ని తెస్తుందని సత్రాజిత్తు అనుకోలేదు. ఈ కథ అంతా మనం వినా యకచవితి వ్రతం చేసేనాడు చదువు కొనేదే. దీని తరవాత జరిగిందే కృతవర్మకీ అతని అన్న శతధన్వుడికీ పైకి చూపించ లేని కోపాన్నీ మాత్సర్యాన్నీ తెచ్చిపెట్టింది. మాత్సర్యంలో అసూయా ఈర్ష్యా మాత్రమే గాక, పగా ద్వేషమూ వెర్రికోపమూ ఆవేశమూ మత్తుతో కూడిన ఉద్రేకమూ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతీకే కృతవర్మ. కృష్ణుడు మణిని తీసుకొని రాగానే సత్రాజిత్తు, కృష్ణుడి లాంటి అతిశక్తిమంతు డితో వైరం తెచ్చుకున్నానని నొచ్చుకుంటూ దానికి ఏవిధంగా పరిహారం చెల్లించాలా అని ఆలోచించాడు. అంతకుముందు తన కూతురు సత్యభామను నిమ్నుడి కొడుకు కృతవర్మకు ఇచ్చి పెళ్లిచేద్దామనుకొన్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కకు పెట్టి, ఆమెను కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. దీనితో కృతవర్మ గుండెల్లో కోపం ప్రజ్వరిల్లింది. అయితే, ఈ కోపాన్ని కృష్ణుడి ముందు అతను చూపించలేడు. దానికి కారణం శ్రీకృష్ణుడి శక్తి అమానుషమైనది కావడమే. అతనంటే వల్లమాలిన భయమే కృత వర్మకి. కానీ కోపమూ దిగమింగరానిదే. అంచేత, అది ద్వేషంగానూ పగగానూ అసూయగానూ మాత్సర్యంగానూ ఈర్ష్య గానూ మారింది. కావాలనుకొన్నదీ, రావాలనుకొన్నదీ పోయినా రాకపోయినా అహంకారం దెబ్బతింటుంది; అసంతృప్తి కలుగుతుంది. సత్యభామ తనకు గానీ తన కుటుంబంలో ఎవరికైనాగానీ భార్య కావల సినది, శ్రీకృష్ణుడి పరమైపోయిందని కృత వర్మకు ఒకటే కుతకుతా దిగులూను. అవి తీరేవి కావు గనక పగా కక్షా రూపాల్ని దాల్చాయి. పగా ఉద్రేకమూ ఎవరినైనా ధర్మాన్ని మరిచిపోయేలాగ చేస్తాయి. ఆత్మ వికాసానికి పనికివచ్చే పనుల్ని మరిచి పోయి, తాను పోగొట్టుకున్నది తనకు ఎలా రాగలదా అనే తీరిక లేని ఆలోచన లతో తన బతుకునే నరకం చేసుకుం టాడు, ఈ మాత్సర్యానికి గురి అయిన వాడు కృతవర్మ. ఆ మాత్సర్యాన్నే కవచంగా ధరించి, కృష్ణుడికి ఎదురుగా యుద్ధం చేద్దామని నిశ్చయించుకున్నాడు. లక్కింటిలో పాండవులు కాలిపోయా రన్న మాటను విని, శ్రీకృష్ణుడు, తనకు వాళ్లు పోలేదని తెలిసినప్పటికీ తెలియ నట్టుగా, భీష్ముడూ ధృతరాష్ట్రుడూ గాంధారీ మొదలైనవాళ్లతో కలిసి ‘అయ్యో, పాపం! అందరూ ఒక్కసారిగా పోవడం దురదృష్టకరం’ అని చెప్పి ధర్మోదకాల్ని ఇవ్వడానికి బలరాముడితో సహా హస్తినా పురానికి వెళ్లాడు. ఇదే అదను అని కృత వర్మా అక్రూరుడూ కలిసి శతధన్వుణ్ని ‘మనను మోసం చేసిన సత్రాజిత్తును అతని తమ్ముడి దారిపట్టేలాగ ఎందుకు చేయకూడద’ంటూ ప్రేరేపించారు. ఆ రాత్రి అతను ఆవేశంతో సత్రాజిత్తును చంపేసి, స్యమంతకమణిని తీసుకొచ్చి వచ్చాడు. సత్యభామ తన తండ్రిని చంపే శారని కృష్ణుడికి వర్తమానం పంపింది. బలరామకృష్ణులు హుటాహుటిన వచ్చి, శతధన్వుడి వెంటబడ్డారు. వాళ్లు వస్తున్నా రని తెలిసి స్యమంతకమణిని అక్రూరుడి దగ్గర వదిలి, శతధన్వుడు గుర్రం మీద పారిపోయాడు. కృష్ణుడు అతన్ని వెంబడించి చంపేశాడు. సత్యభామ దక్కకపోవడమూ తన అన్నను చంపడమూ కృతవర్మలో పగనీ అసూయనీ ఇబ్బడి ముబ్బడిగా చేశాయి. అతను, తనవాళ్లందరూ ధర్మరాజువైపు చేరినా, తాను మటుకు దుర్యోధనుడి పక్షాన పోరాడటానికి నిశ్చయించు కున్నాడు. ఈ నిశ్చయం వెనక ఉన్న కారణం కృష్ణుడంటే మాత్సర్యం తప్ప మరొకటి కాదు. పగకూ అసూయకూ వెర్రికోపానికీ మాత్సర్యానికీ కళ్లు పచ్చ బారి అన్నీ పచ్చగానే అవుపిస్తాయి; అసలైన రూపం వాటికి అవుపించదు. పాండవులంటే ప్రత్యేకమైన ద్వేషమేమీ లేదు కృతవర్మకు; తతిమ్మా యాదవులన్నా పగా లేదు. కృష్ణుణ్ని వ్యతి రేకించడమే ధ్యేయంగా అధర్మపక్షాన చేరాడు. జయద్రథుణ్ని రక్షించడం కోసం ద్రోణుడి వెనక నిలిచాడు. అర్జునుడు శకట వ్యూహంలో ముఖాన ఉన్న ద్రోణుడితో కొంతసేపు యుద్ధం చేసి, అనవసరంగా కాలహరణం జరుగుతోందని శ్రీకృష్ణుడు హెచ్చరించడంతో గురువుకు ప్రదక్షిణం చేస్తూ అతన్ని దాటి కృతవర్మను ఎదిరిం చాడు. ‘కృతవర్మ మీద దయ చూపించ వలసిన పనిలేదు; సంబంధీకుడని ఉపేక్షించకుండా వీణ్ని చంపెయ్యి’ అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అయినా అర్జునుడు సంబంధాన్ని దృష్టిలో పెట్టు కొని, కృతవర్మ దొరికినా చంపకుండా మూర్ఛపరిచి, ముందుకు వెళ్లిపోయాడు. సాత్యకి కూడా తన గురువు అర్జునుడిలాగే ద్రోణుణ్ని తప్పించుకొని పోతూ ఉంటే, కృతవర్మ అతన్ని నిలవరించాడు. సాత్యకి భోజుడి సారథి తల నరకడంతో అతని గుర్రాలు అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు తానే తన రథాశ్వాలను అదుపులో పెట్టుకుంటూ ఏ భయమూ లేకుండా తిరిగి ఎదిరించడానికి వచ్చే లోపులో సాత్యకి ముందుకు వెళ్లిపో యాడు. అప్పుడక్కడకు వచ్చిన భీమ సేనుణ్ని ఎదుర్కొన్నాడు కృతవర్మ. అతని పరాక్రమం ముందు పాండవులు ముందుకు సాగలేకపోయారు. భీముడి వింటినీ ధ్వజాన్నీ ముక్కలు చేసి అతన్ని కృతవర్మ రథం నుంచి కిందికి పడిపోయే లాగ చేశాడు. అప్పుడు ధర్మరాజూ మొదలైన మహారథులు భోజుణ్ని, అంటే, కృతవర్మను బాణాలతో పీడించడం మొదలుపెట్టారు. ఇంతలో భీముడికి మెలకువ వచ్చి, భోజుడి వక్షస్సు మీద ఐదు బాణాలతో దాడిచేసి దెబ్బతీశాడు. పక్కనున్న శిఖండి కూడా విజృంభించాడు. కృతవర్మ శిఖండి వింటిని విరగ్గొట్టాడు. శిఖండి కోపంతో కత్తీ డాలూ తీసుకొని విరుచుకుపడ్డాడు. తన డాలును గిరగిరా తిప్పుతూ తనను కాపాడుకుంటూ తన కత్తిని భోజుడి రథం మీదకు విసిరాడు, అది కృతవర్మ ధనుస్సును ముక్కలు చేసింది. మరో విల్లు తీసుకొని అతను శిఖండిని ముప్పుతిప్పలు పెట్టాడు. అతను రథం మీద చతికిలపడిపోయాడు. ఇదంతా కృతవర్మ వీరోచిత పోరాటమే. సౌప్తిక పర్వంలో కృతవర్మ కసాయి వాడుగా అవుపిస్తాడు. అప్పుడు అశ్వత్థామకు బాసటగా నిలిచిన ఇద్దరిలో కృతవర్మ ఒకడు; రెండోవాడు కృపాచార్యుడు. అశ్వత్థామ పాంచాలుర శిబిరంలోకి పోయి, నిద్రపోతూన్న ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ ద్రౌపదేయుల్నీ ఊచకోత కోస్తూ ఉంటే, తతిమ్మావాళ్లు కంగారుతో కాందిశీకులై అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటే, శిబిర ద్వారంలో కసాయివాళ్లలాగ నిలుచున్న కృతవర్మా కృపాచార్యుడూ వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. శిబిరం నుంచి వచ్చిన ఒక్క క్షత్రియుడూ వీళ్ల చేతుల్లోంచి తప్పించుకోలేదు. అశ్వత్థామకు ఇంకా ప్రీతిని కలిగిద్దామని వాళ్లున్న దిక్కును మినహాయించి తతిమ్మా మూడు దిక్కుల్లోనూ నిప్పంటించారు ఈ ప్రబుద్ధులిద్దరూను. తాము చేసిన ఈ ‘గొప్ప’ కార్యాన్ని చెప్పడానికి సగం ప్రాణంతో గిలగిలా కొట్టుకొంటూన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురూను. యుద్ధం తరవాత పాండవుల వైపు ఏడుగురూ ధార్తరాష్ట్రుల వైపు ముగ్గురూ మిగిలారు: పాండవులైదుగురూ శ్రీకృష్ణుడూ సాత్యకీ వెరసి ఏడుగురు; కృపుడూ కృతవర్మా అశ్వత్థామా వెరసి ముగ్గురు ఇటువైపు. ‘అశ్వత్థామా! నువ్వు ఈ కృపకృత వర్మలతో కలిసి చేసిన ఈ కార్యం భీష్ముడు గానీ మీ తండ్రిగానీ కర్ణుడుగానీ చేయ లేదు’ అని సంతోషిస్తూ దుర్యోధనుడు తుదిశ్వాస విడిచాడు. కృష్ణుడికి వ్యతి రేకంగా యుద్ధం చేసి కృతవర్మ సాధించింది ఇంతే. తరవాత మౌసల పర్వంలో యాదవులందరితో బాటూ కృతవర్మా పోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు