న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహాభారత యుద్ధంతో పోల్చారు. పాండవులు, కౌరవుల్లా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి తలపడబోతున్నాయని చెప్పారు. ‘‘విపక్ష కూటమిలోని పారీ్టలన్నీ వారసత్వ, బుజ్జగింపు, అవినీతి రాజకీయాల్లో ఆరితేరాయి. అవన్నీ 2జీ, 3జీ, 4జీ పార్టీలు. వాటిని రెండో తరం, మూడో తరం, నాలుగో తరం నేతలు నడిపిస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ఆదివారం బీజేపీ జాతీయ సదస్సులో ‘బీజేపీ: దేశానికి ఆశ, ప్రతిపక్షానికి నిరాశ’ తీర్మానంపై అమిత్ షా మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రధాని మోదీ విపక్షాల అనైతిక రాజకీయాలకు ఇప్పటికే చరమగీతం పాడారని, దేశంలో అభివృద్ధి రాజకీయాలను తీసుకొచ్చారని కొనియాడారు. ‘‘ప్రజల మనస్సులో ఏ సందేహాలూ లేవు. మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. మోదీ తాను కరిగిపోతూ వెలుగులు పంచే కొవ్వొత్తి లాంటివారు. దేశాభివృద్ధి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలే ఉంటే ఒకప్పుడు టీ అమ్ముకొని జీవించిన పేద తండ్రి కుమారుడైన మోదీ ప్రధాని అయ్యేవారు కాదు’’ అన్నారు.
జేపీ నడ్డా కొనసాగింపు
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆదివారం బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నడ్డా పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభ ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే ఎదుర్కొంటామని బీజేపీ ప్రకటించింది. ముఖ్యమైన పారీ్ట నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే అధికారాన్ని నడ్డాకు కట్టబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment