సాక్షి, బళ్లారి: ‘కర్ణాటక ఎన్నికలు మహాభారత యుద్దం వంటివి. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరుగుతోంది. అవినీతి పరులు, రాష్ట్రాన్ని లూటీ చేసిన బీజేపీకి ఓటు వేస్తారా? అవినీతి రహిత పాలన అందించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? మీరు తేల్చుకోవాల్సిన విషయం’అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఆమె గురువారం కర్ణాటకలోని కనకగిరిలో ప్రచారసభలో మాట్లాడారు. యుద్ధంలోనైనా, ఎన్నికల్లోనైనా లక్ష్యం తప్పితే ఓడిపోతామన్నారు.
లక్ష్యం తప్పితే మళ్లీ అవినీతి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అప్పటి ఇందిరాగాంధీ పాలనను ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటున్నారంటే కారణం.. ఆమె దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు, పేదల కన్నీరు తుడిచినందుకేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక లక్షన్నర కోట్ల రూపాయలను లూటీ జరిగిందని, ఆ డబ్బుతో 30 లక్షల పేదల కుటుంబాలకు ఇళ్లు కట్టించవచ్చునని, 100 ఆస్పత్రులను నిర్మించవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఇంత భారీగా దోపిడీ చేసిన ప్రభుత్వానికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment