Mahankali
-
ఓల్డ్ సిటీ మహంకాళి జాతర బోనాల సందర్భంగా ఘట్టాల ఊరేగింపు (ఫోటోలు)
-
మహంకాళికి ఆన్లైన్లో ‘బోనం’
సాక్షి, హైదరాబాద్: దేశ, విదేశాల్లోని భక్తులు సైతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్ ద్వారా బోనాలు సమర్పించుకునేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం అరణ్య భవన్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఆన్లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం పంపిణీ చేస్తారని, ఆ బియ్యాన్ని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చని వివరించారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు –కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించాలనుకునే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు రూ.300, ఇతర దేశాల భక్తులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు. ఆన్లైన్లో ఎల్లమ్మ కల్యాణ సేవలు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్లైన్ సేవలను కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జూలై 5న ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్లైన్లో కల్యాణం సేవలను బుక్ చేసుకోవాలని తెలిపారు. అమ్మవారి కల్యాణానికి సంబంధించి ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారని చెప్పారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
హైద్రాబాద్‌లో ఘనంగా బోనాల పండుగ
-
‘మహా’ వైభవం
చార్మినార్, న్యూస్‌లైన్: ఆషాఢ బోనాల జాతరలో ఆఖరి ఘట్టం శ్రీమాతేశ్వరి సామూహిక ఘటాల ఊరేగింపు సోమవారం మహావైభవంగా జరిగింది. అశేష భక్తజనం వెంటరాగా... డప్పుల చప్పుళ్లు... నృత్యాల ఉత్సాహంతో పాతబస్తీలోని వీధుల్లో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓ పక్క రంజాన్ సంబరాలు... మరోవైపు బోనాల సందడులు... పోలీసుల వ్యూహం... ఉత్సవ కమిటీల సహకారంతో ఘటాల ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ముస్లింల షబ్బే-ఏ-ఖదర్ కావడంతో చీకటిపడకముందే ఊరేగింపును ముగించాలని పోలీసులు సూచించిన మేరకు... మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స్పందించింది. మధ్యాహ్నం 1.05కు ప్రారంభమైన ఘటాల ఊరేగింపు సరిగ్గా సాయంత్రం 6.30కి మక్కామసీదు, చార్మినార్ దాటి వెళ్లింది. దీంతో అటు పోలీసులు.. ఇటు ఉత్సవ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. దారిపొడవునా స్వాగతం పాతబస్తీ అన్ని దేవాలయాల్లోని అమ్మవార్ల ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. దారిపొడవునా ఘటాలకు భక్తులు, ప్రముఖులు స్వాగతం పలికారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్‌దర్వాజా సింహవాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహల్, గౌలిపురా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్హౌస్ల మీదుగా నయాపూల్ మూసీ నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీమహంకాళి ఘటం కోట్ల అలీజా, సర్దార్‌మహల్ ద్వారా చార్మినార్ చేరుకొని ప్రధాన ఊరేగింపులో కలిసింది. మతసామరస్యానికి ప్రతీక: గీతారెడ్డి పాతబస్తీ బోనాల ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి గీతారెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కలిసిమెలిసి ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకోవడం సంతోషకర విషయమన్నారు. ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ, బీజేపీ అధ్యక్షుడు బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఉస్మాన్‌గంజ్‌లో ఫలహారం బండి... జాంబాగ్ న్యూ ఉస్మాన్‌గంజ్‌లో బోనాల ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ ఊరేగింపును ప్రారంభించారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయమ్మ