mahmad ali
-
ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, షాద్‌నగర్‌టౌన్: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, 12 శాతం రిజర్వేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలో జరిగిన ముస్లిం మైనార్టీల సభలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తమ పార్టీ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచనే ఉంటే 1969లోనే ఏర్పాటయ్యేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అలుపెరుగని ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దర్గాలు, మసీదుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించుకునే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషిచేసింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ తగిన నిధులు కేటాయించారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్, నాయకులు ఇంతియాజ్, రహిముల్లాఖాన్, జిల్లెల వెంకట్‌రెడ్డి, జామి, ఇద్రీస్, నటరాజ్, యూసుఫ్ బామస్, సర్వర్‌పాషా, జమృద్‌ఖాన్, సలీం, ఎక్బాల్, అందెబాబయ్య, రాజ్యలక్ష్మి, గుల్లె కృష్ణయ్య, యుగెంధర్, చింటు, అశోక్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఈట గణేష్, శరత్కృష్ణ పాల్గొన్నారు. -
మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు
బాలానగర్ (జడ్చర్ల) : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. బాలానగర్‌లోని జాతీయ రహదారి పక్కన మహ్మద్ నజీరొద్దీన్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో అదునాతన సదుపాయలతో నూతనంగా నిర్మించిన మసీద్‌ను సోమవారం ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మసీదుల అభివృద్ధితోపాటు, అందులో పనిచేసే గురువులకు జీతం ఇచ్చే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మసీద్ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వాల్యానాయక్, ఇబ్రహిం, దాస్‌రాంనాయక్, గోపాల్‌రెడ్డి, గిరిజన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీపీ నర్సింహులు, చెన్నారెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
క్యాబినెట్ ‘కారు’ ఎక్కేదెవరు?
మహమూద్ అలీ, నాయినికి చాన్స్! తనకూ అవకాశం ఇవ్వాలంటున్న పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఎవరికి దక్కనుంది? నగర నేతల్లో ఎంతమందికి చాన్స్ ఉంటుంది? ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలివి. ఇటు నేతలు, అటు కార్యకర్తల్లో ఈ అంశమే చర్చనీయాంశమైంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని నగరానికి ప్రాధాన్యమివ్వాల్సిందే. ఈ నేపథ్యంలో నగర నేతలకు ముఖ్య బాధ్యతలు దక్కే అవకాశమే కనిపిస్తోంది. అందుకే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు నగర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి సభ్యులు మహమూద్ అలీతో పాటు మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిలకు రాష్ట్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తే శానసమండలి సభ్యులు మహమూద్ అలీ పేరును పరిశీలనకు తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా, కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నాయిని నర్సింహారెడ్డికి సైతం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాయిని నర్సింహారెడ్డి ప్రస్తుతం శాసనసభ - శాసనమండలిలో దేనిలో సభ్యులు కాకపోవటంతో ఆయన పదవిపై ఒకింత చర్చ జరుగుతోంది. ముందు క్యాబినెట్లోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వారిలో పద్మారావు (సికింద్రాబాద్), కనకారెడ్డి (మల్కాజిగిరి) గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు)లు మాత్రమే విజయం సాధించారు. అయితే వీరిలో కనకారెడ్డి, మహిపాల్‌రెడ్డిలు తొలిసారిగా విజయం సాధించగా.. పద్మారావు రెండవ మారు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఈయనకు రెండు మార్లు కార్పొరేటర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పద్మారావుకు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే భావనను పార్టీ ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నివాసం కిటకిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్ నివాసం నా యకులు, కార్యకర్తలు, జనంతో కిటకిట లాడుతోంది. రోజంతా వేలాదిగా తరలివస్తున్న సందర్శకులతో బంజారాహిల్స్‌లోని నందీనగర్ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.