majority seats
-
యూపీలో గఠ్బంధన్ హవా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని గఠ్బంధన్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని ఏబీపీ–నీల్సన్ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్లతో కూడిన గఠ్బంధన్ (కూటమి) 42 స్థానాలు గెలుచుకోవచ్చనీ, బీజేపీ, అప్నాదళ్ కూటమికి 36 సీట్లు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 5, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. బిహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్డీయేకు 34, గఠ్ బంధన్‌కు 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. యూపీలో సీట్లు తగ్గినా బీజేపీ కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, గఠ్బంధన్ కంటే ఎక్కువగా (43శాతం) ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 7.8(2014) నుంచి 9 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. మార్చి16–24వ తేదీల మధ్య 20వేల మందికిపైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని సర్వేలో మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు మోదీ తీరు ఏవరేజ్‌గా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుకు ఓటర్లు 3.73 మార్కులు ఇచ్చారు. అవినీతి, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశాలని మెజారిటీ ఓటర్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే వారికే ఓటేస్తామని అత్యధికులు స్పష్టం చేశారు. మత సామరస్యం, ధరల నియంత్రణ, వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని సర్వే నివేదిక పేర్కొంది. బిహార్‌లో 34 సీట్లు.. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్‌జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీయే 52 శాతం ఓట్లతో 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని నీల్సన్ సర్వే పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయలోక్ సమతా పార్టీ, సీపీఐ (ఎంఎల్)తో కూడిన గఠ్‌బంధన్‌కు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మార్చి 17–26 మధ్య పది వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు నీల్సన్ సంస్థ పేర్కొంది. ఇక్కడ కూడా మోదీ పనితీరు బాగుందని, నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే పనితీరుకు 3.92 మార్కులు ఇచ్చారు. ఇక్కడ కూడా అవినీతి, నిరుద్యోగం ప్రజల ప్రధాన సమస్యలని సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరడం మంచిదేనని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, తప్పు నిర్ణయమని 39 శాతం వ్యాఖ్యానించారు. -
బంగ్లా: భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న అధికార పార్టీ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నట్లు తెలిసింది. 299 స్థానాలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలందే సరికి అవామీ లీగ్ అభ్యర్థులు 90 చోట్ల, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందారు. మరోవైపు, ఫలితాల సరళిని బీఎన్పీ నాయకత్వంలోని విపక్ష కూటమి తోసిపుచ్చింది. అధికార పార్టీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని, తాత్కాలిక తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు, పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. హసీనా రికార్డు విజయం.. అవామీ లీగ్ విజయం దాదాపు ఖాయమైనట్లేనని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అవామీ లీగ్ మరో 62 చోట్ల, బీఎన్పీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత హసీనా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం బంగ్లాదేశ్ ప్రజలు మళ్లీ తమకు పట్టం గడతారని చెప్పారు. బీఎన్పీ అధినేత్రి ఖలేదా జియా జైలుకు వెళ్లడంతో పార్టీని ముందుండి నడిపించిన ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్ ఇస్లాం థాకూర్‌గావ్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. మొత్తం 299 స్థానాల్లో 1,848 మంది పోటీచేశారు. అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదాపడింది. సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అవుతారు. మరోవైపు, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలేదా జియా పాక్షిక పక్షవాతానికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో తాజా ఫలితాలతో ఆమె క్రియాశీల రాజకీయ జీవితంపై సందిగ్ధం ఏర్పడింది. పెచ్చరిల్లిన హింస.. పోలింగ్ రోజున దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పోలీసు సహా 17 మంది మరణించారు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 13 మంది మృతిచెందగా, ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. విపక్ష కార్యకర్తల దాడిలో ఓ పోలీసు మృతిచెందాడు. మృతుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్ కార్యకర్తలే ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. -
బాబు సొంత జిల్లాలో ఫ్యాన్ గాలి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22 ఎంపీటీసీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీటీసీలను కైవసం చేసుకుని ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ 9 ఎంపీటీసీలను నెగ్గింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. జెడ్పీటీసీ ఫలితం ఒక్కటి కూడా రాలేదు. సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. -
కడప జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ముందంజ
-
జోరుగా ఫ్యాన్ గాలి
వైఎస్సార్ కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ నెట్లో హల్చల్ చేస్తున్న తాజా సర్వేల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మరో 24 గంటల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని నెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్టీవీ-నీల్సన్, టీవీ5-ఎఫ్ఎంఆర్ఎస్లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేల ఫలితాలు యూట్యూబ్, వివిధ వెబ్సైట్లు, బ్లాగ్లు, సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో.. ఈ సర్వే ఫలితాలు లీకుల పేరిట వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. టీవీ5 - ఎఫ్ఎంఆర్ఎస్ ఏప్రిల్ 29న 1.75 లక్షల శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించినట్లు నెట్లో పేర్కొన్నారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 120 నుంచి 125 శాసనసభ స్థానాలు వస్తాయని; 25 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీకి 20 నుంచి 22 లోక్‌సభ స్థానాలు వస్తాయని టీవీ5-ఎఫ్ఎంఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో తేలినట్లు చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమికి 48 నుంచి 53 శాసనసభ స్థానాలు, 3 నుంచి 5 పార్లమెంటు స్థానాలు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్, ఇతరులకు కలిపి 2 నుంచి 4 అసెంబ్లీ సీట్లు, 0 నుంచి 1 పార్లమెంటు స్థానం రావచ్చని అంచనా వేశారు. వైఎస్సార్ సీపీకి 49.3 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.1 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.6 శాతం ఓట్లు అసెంబీ స్థానాల్లో వస్తాయని లెక్కగట్టారు. లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 48.6 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.5 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.9 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఎన్టీవీ - నీల్సన్ సర్వే... ఏప్రిల్ 25న ఈ సర్వే చేశారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 117 నుంచి 123 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ, బీజేపీకి క లిపి 52 నుంచి 58 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 0-2, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే వైఎస్సార్ సీపీకి 16 నుంచి 19 పార్లమెంటు సీట్లు వస్తాయని, టీడీపీకి 6 నుంచి 9 సీట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్‌కు వస్తే ఒకటి వస్తుందని, లేకపోతే లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి అసెంబ్లీ స్థానాల్లో 48.5 శాతం, పార్లమెంటు స్థానాల్లో 48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి అసెంబ్లీలో 41 శాతం, పార్లమెంటు స్థానాల్లో 41.5 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్ 6 శాతం ఓట్లు, ఇతరులకు 4.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.