
బాబు సొంత జిల్లాలో ఫ్యాన్ గాలి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22 ఎంపీటీసీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీటీసీలను కైవసం చేసుకుని ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ 9 ఎంపీటీసీలను నెగ్గింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. జెడ్పీటీసీ ఫలితం ఒక్కటి కూడా రాలేదు. సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.