టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల సొంత జిల్లా చిత్తూరులో ఫ్యాన్ గాలి వీచింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల సొంత జిల్లా చిత్తూరులో ఫ్యాన్ గాలి వీచింది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజవర్గాలుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సినీ నటి రోజా నగరి నుంచి గెలిచారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు చింతల రామచంద్రా రెడ్డి (పీలేరు), దేశాయి తిప్పారెడ్డి (మదనపల్లి), పి.రామచంద్రా రెడ్డి (పుంగనూరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు), సునీల్ కుమార్ (పూతలపట్టు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు) గెలుపొందారు. ఇక రెండు లోక్సభ నియోజవర్గాలుండగా తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరప్రసాద్ రావు నెగ్గారు. టీడీపీ ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానం నుంచి నెగ్గింది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు గెలిచారు. కాగా ఇదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో ఆయన సోదరుడు కిషన్ కుమార్ రెడ్డి ఓటమి చవిచూశారు.