malagundla shankar narayana
-
పవన్.. వరి ఎలా పండిస్తారో తెలుసా?
పెనుకొండ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. రైతాంగానికి, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి చేసిందో తెలుసుకోవాలని సూచించారు. బుధవారం వారు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. కౌలు రైతుల పరామర్శ పేరుతో పవన్‌కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. వేరుశనగ, వరి ఎలా పండిస్తారో.. ఏ సీజన్లో ఏ పంట వేస్తారో పవన్‌కు తెలుసా? అని నిలదీశారు. పవన్‌కల్యాణ్ ఏ రైతు కుటుంబాలను పరామర్శించారో ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించిందని, ఈ విషయాన్ని ఆయన తెలుసుకోకపోవడం శోచనీయమన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సత్సంకల్పంతో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. పీఎం కిసాన్ పథకంతో కలిపి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ అవే రాయితీలు ఇస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారం, ఉచిత ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలను రైతుల కోసం వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తోందని, వీటి గురించి తెలుసుకోకపోవడం పవన్ కల్యాణ్ అవివేకమని విమర్శించారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ప్యాకేజీ మాటలవి.. ► రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టని పవన్ కల్యాణ్.. ప్యాకేజీ తీసుకుని, వారు ఎలా చెబితే అలా ఆడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 739 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 469 మందికి పరిహారం ఇవ్వలేదు. జగన్ సీఎం అయ్యాక వీరికి రూ.23.45 కోట్లు పరిహారం అందించారు. ► 2020లో 308 మంది చనిపోగా, ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున రూ.21.56 కోట్లు, ఆ తర్వాత ఏడాది 263 మంది చనిపోగా, రూ.18.41 కోట్లు, అనంతర కాలంలో 125 మంది చనిపోగా రూ.8.75 కోట్లు చెల్లించారు. మొత్తమ్మీద రూ.72 కోట్లు ఇచ్చారు. ఈ విషయాలు తెలుసుకోకుండా పవన్ ఇష్టానుసారం మాట్లాడటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. ► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పక్షాన ఉన్న పవన్‌కల్యాణ్.. ఆనాడు 739 మంది రైతులు చనిపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అప్పుడు గాడిదలు కాస్తున్నారా? ఈయనకు స్పష్టమైన మేనిఫెస్టో లేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఊపడమే ఆయన నైజం. ► జగన్ సీఎం అయ్యాక రైతులతో సమానంగా కౌలు రైతులకూ ప్రయోజనాలు అందిస్తున్నారు. పంట సాగుదారులకు రక్షణగా చట్టం తెచ్చారు. 1.82 లక్షల మంది కౌలు రైతులకు రూ. 1,176 కోట్ల పంట రుణాలు అందించారు. 5.24 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రాయితీలు వర్తింపజేశారు. రైతు భరోసా ద్వారా అన్ని రకాల రైతులను ఆదుకున్నారు. -
ఆరెకరాల్లో 500 పడకల కోవిడ్ ఆస్పత్రి
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి శనివారం ఆయన తాడిపత్రి–కడప ప్రధాన రహదారి పక్కనే తాడిపత్రి క్రీస్తురాజు చర్చికి సంబంధించిన ఆరు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఐనోక్స్ ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆస్పత్రి ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి నేరుగా ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సానుకూలత వ్యక్తం కావడంతో స్థలానికి సంబంధించి చర్చి ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సెలిన్తో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు చర్చించారు. మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదన్నారు. ఇందులో భాగంగానే అనంతపురంతో పాటు పొరుగున ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఆరు ఎకరాల విస్తీర్ణంలో 500 పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. -
మీకు నేనెవరో తెలుసా.!
సాక్షి, అనంతపురం : నేనెవరో మీకు తెలుసా? అంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ప్రశ్నించారు. అభ్యర్థులు ఒక్కసారిగా లేచి జిల్లా మంత్రి శంకర నారాయణ అని బదులిచ్చారు. బుధవారం ఉదయం మంత్రి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలో ఉద్యోగుల వివరాలు అడిగారు. అటెండరు తప్ప తక్కిన ఉద్యోగులు లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు పని చేయాల్సి ఉండగా అటెండరు మాత్రమే ఉండడమేంటని మండిపడ్డారు. ఇంతలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, టీచరు రవి అక్కడికి చేరుకోగా తాను వచ్చి ఎంతసేపయింది ఇప్పటిదాకా ఎక్కడికెళ్లారు? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మంత్రి అభ్యర్థులతో మాట్లాడారు. క్వాలిఫై కాకపోయినా చాలామంది శిక్షణ తీసుకుంటున్నామని, తమకు కూడా మెటీరియల్ ఇచ్చేలా చూడాలని మంత్రిని కోరగా..వెంటనే ఆయన స్పందించి డెప్యూటీ డైరెక్టర్ ఉమాదేవితో ఫోన్లో మాట్లాడారు. అదనంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. మొత్తం 300 మందికి స్టడీ మెటీరియల్ ఇస్తారని మంత్రి ప్రకటించగా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మానాయక్ ఉన్నారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై మంత్రి కన్నెర్ర కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారా? అని ఐసీడీఎస్ కార్యాలయ ఉద్యోగులపై మంత్రి శంకరనారాయణ కన్నెర్ర చేశారు. బుధవారం ఉదయం మంత్రి ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, ఏయే హోదాల్లో పని చేస్తున్నారని పీడీ చిన్మయిదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయోమెట్రిక్ వివరాలను అడగగా నెల రోజులుగా యంత్రం పని చేయడం లేదని వివరించగా అటెండెన్స్ రిజిష్టర్ తెప్పించుకుని పరిశీలించారు. అందులో పలు లోపాలను గుర్తించి పీడీని మందలించారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఎందుకు సంతకాలు చేయడం లేదని ప్రశ్నించగా...ఏడాది కిందట సస్పెండ్ అయ్యారని మంత్రికి తెలిపారు. ఆ విషయం రికార్డులో పొందుపరచకుండా ప్రతినెలా ఎందుకు ఆయన పేరు రాస్తున్నారంటూ మండిపడ్డారు. మరో సీనియర్ అసిస్టెంట్ భారతి, అటెండెర్ లక్ష్మీదేవి ఆఫీసులో ఉన్నా రిజిష్టరులో ఎందుకు సంతకాలు చేయలేదని? ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని మంత్రి ప్రకటించారు. -
హామీలను అమలు చేయడమే లక్ష్యం
సాక్షి, తాడంగిపల్లి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తాడంగిపల్లి, మోపుర్లపల్లి, ఎం.కొత్తపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా రొద్దంలో అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడంగిపల్లి గ్రామంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పెనుకొండ నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే హంద్రీనీవా కాలువ వెంట ఉన్న చెరువులకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అయినా వైఎస్ జగన్ భయపడకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన నవరత్నాలను పార్టీలకు, కులమతాలకు అతీతంగా అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. 25 ఏళ్లుగా నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ హమీద్‌బాషా, ఇన్చార్జ్ ఎంపీడీఓ నసీమా, పీఆర్ జేఈ వహబ్, ప్రభుత్వ వైద్యుడు రోహిల్, అన్ని శాఖల అధికారులు, సింగిల్ విండో అధ్యక్షుడు మారుతిరెడ్డి, చైర్మన్లు లక్ష్మినారాయణ, విజయలక్ష్మి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కలిపి సొసైటీ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నూతన వధూవరులకు వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతపురం ధర్మవరంలో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్ నారాయణ కుమార్తె నవ్యకీర్తి వివాహ వేడుకకు బుధవారం వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. నూతన వధూవరులు నవ్యకీర్తి, శశికిరణ్‌ను ఆమె ఆశీర్వదించారు. యశోద కాన్సెప్ట్ స్కూల్ లో జరిగిన ఈ వివాహానికి విజయమ్మతో పాటు అనంతవెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు పార్టీ నేతలు, అభిమానులు వైఎస్ విజయమ్మకు అపూర్వస్వాగతం పలికారు.