Malaysian airliner
-
గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం
ఎంహెచ్ 370 మలేసియా విమానం గల్లంతై 50 రోజుల దాటి పోయింది... అయినా ఇంతవరకు ఆ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆ విమాన ఆచూకీ కోసం గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఆచూకీ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ జానస్టన్ బుధవారం వెల్లడించారు. ఆ అంశంపై ఇప్పటికే మలేసియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రెండు ప్రపంచ యుద్ద సమయంలో టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో నౌకలోని 1500 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆ నౌక ఆచూకీ కోసం అన్వేషణలు తీవ్రంగా సాగిన చిట్ట చివరకు 1985 అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల అడుగున టైటానిక్‌ను కనుగొన్న విషయం విదితమే. 227 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో గతనెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంలో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు విమానాలు, నౌకలు, శాటిలైట్ల ద్వారా సముద్రంలో జల్లెడ పట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన విజ్ఞానం ద్వారా అయిన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ తెలుస్తుందని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఆ విమాన ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
మలేషియా విమానం మిస్టరీగా మిగలనుందా?
కౌలాలంపూర్: తప్పిపోయిన మలేషియా విమానం జాడ ఇంకా తెలియరాలేదు. 15 రోజులు గడిచినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో ఇది మిస్టరీగానే మిగలనుందా? కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. భారతదేశానికి చెందిన సిబ్బంది కూడా వెతుకుతున్నారు. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని, హిందూ మహాసముద్రంలో దాని శకలాలు కనిపించాయని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి. ఈ విమానంపై ప్రపంచవ్యాప్తంగా రోజుల తరబడి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ విమానం ఏమై ఉంటుందీ అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. గడిచిన వందేళ్లుగా కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? లేకపోతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని జాడను కనిపెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు. ఈ విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి. హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది. చైనా కనుగొన్న ప్రాంతంలోనే ఆస్ట్రేలియా కూడా శకలాలను గుర్తించింది. ఆస్ట్రేలియన్ వైమానిక దళం వారు ఒక చెక్క ప్యాలెట్, ఇతర శకలాలు కనుగొన్నారు. ఫ్రాన్స్ కూడా ఆ ప్రాంతంలోనే కొన్ని శకలాలను కనుగొన్నట్లు తెలియజేస్తూ ఉపగ్రహ చిత్రాలను ఈరోజు విడుదల చేసింది. ఆ శకలాలు తప్పిపోయిన విమానానివిగా భావిస్తున్నారు. దాంతో విమానం ప్రమాదానికి గురైనట్లుగానే స్పష్టమవుతోంది. ఏడు చైనా నౌకలు, రెండు మలేషియా షిప్‌లు ఆ శకలాల కోసం వెతుకుతున్నాయి. ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు నాసా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
'అదృశ్యమైన విమానం మా దేశంలోకి రాలేదు'
గత శనివారం అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం తమ దేశ భూభాగంలోకి ప్రవేశించ లేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఆచూకీ తెలియకుండా పోయిన విమానం తమ దేశంలో ఉందని వస్తున్న వార్తలను పాకిస్థాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు సుజాత్ అజీమ్ ఖండించారు. సుజాత్ అజీమ్ డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మలేషియా ఎయిర్ లైన్స్ తమ దేశంలోకి ప్రవేశించినట్లు రాడార్లు ఎక్కడ గుర్తించలేదన్నారు. గల్లంతైన విమాన ఆచూకీ కోసం వివిధ దేశాలకు చెందిన దాదాపు 95 పైగా నౌకలు బంగాళాఖాతంలో గాలింపు చర్యలు ఇప్పటికి కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.అదృశ్యమైన విమాన ఆచూకీ కోసం పాక్ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మార్చి 8వ తేదీ అర్థరాత్రి మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిని 40 నిముషాల అనంతరం ఆ విమానం మలేషియా విమానాశ్రయం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఎనిమిది రోజులుగా గల్లంతైన విమానం కోసం మలేషియా, చైనా, వియత్నాం, అమెరికాతోపాటు పలు దేశాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టిన అణు మాత్రం ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో మలేషియా ప్రభుత్వం తల పట్టుకుంది. విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అనుమానం వ్యక్తం చేశారు.ఆ విమానాన్ని మలేషియా వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్ -తుర్కెమెనిస్థాన్‌లకు తీసుకెళ్లి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.లేదా పాక్‌కు తరలించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గల్లంతైన విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.