Maleficent
-
విడాకులపై స్పందించిన ప్రముఖ నటి
హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా గుర్తింపు పొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట.. 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు పొడ చూపడంతో.. 2016లో వివాహబంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏంజెలినా జోలీ విడాకుల వల్ల తాను ఎంత ఒత్తిడికి గురయ్యారో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బ్రాడ్ పిట్ నుంచి విడాకులు పొందిన తర్వాత నేను చాలా తీవ్ర దుఖాన్ని అనుభవించాను. నా తలరాతలో ఏం రాసిపెట్టి ఉందో నాకు తెలియదు కానీ.. నేను పరివర్తన కాలంలో ఉన్నట్లు మాత్రం నాకు అర్థం అయ్యింది. మనిషి తన మూలాలను వెతుక్కుంటు వెళ్లినట్లు నేను.. నా అంతరంగం లోనికి ప్రయాణించడం ప్రారంభించాను’ అన్నారు జోలీ. అంతేకాక ‘పిట్తో నా బంధం ముగింపుకు వచ్చిందని నాకు అర్థం అయ్యింది. ఆ సమయంలో నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు నాకు అనిపించింది. ఆ క్షణం నుంచి మేం విడిపోవడం ప్రారంభించాము. అది నాకు చాలా క్లిష్టమైన సమయం. జీవితంలో నేను ఎక్కడ ఉన్నది నాకు తెలియలేదు. ఆ సమయంలో నేను చాలా తీవ్రమైన, నిజమైన బాధను అనుభవించాను. అయితే ఈ బాధ నాకు చాలా మేలు చేసింది. ప్రతి మనిషి జీవితం ముగింపుకు వచ్చే సరికే మిగిలేది వినయం మాత్రమే అని తెలిసివచ్చింది. అదే నన్ను, నా జీవితంతో మళ్లీ ముడివేసింది’ అని తెలిపారు. ప్రస్తుతం జోలీ, డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ‘మేలిఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘మేలిఫిసెంట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 18న ఇండియాలో విడుదల కానుంది. -
ఏంజిలినాజోలి నటించిన చిత్రం మాలిఫిషెన్ట్
-
జోలీ భయపెడుతుందా?
హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీని అక్కడి నిర్మాతలు, పంపిణీదారులు ముద్దుగా ‘బంగారు బాతు’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే, ఆమె నటించిన చిత్రాల్లో లాభాలు తెచ్చిపెట్టినవే ఎక్కువ. కానీ, ఇప్పుడే ద గోల్డెన్ స్టార్ చేసిన ‘మేల్‌ఫిసెంట్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చని పంపిణీదారులు సందేహిస్తున్నారట. ఇందులో ఏంజెలినా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారు. తన పాత్ర పేరు మేల్‌ఫిసెంట్. స్వతహాగా మంచితనానికి చిరునామా అయిన మేల్ఫిషెంట్ మోసానికి గురవుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. పలు రకాల మోసాలకు గురైన తర్వాత ఆమె మనసు బండరాయి అవుతుందని. దాంతో విలన్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మామూలుగా అన్ని సినిమాల్లోనూ అందంగా కనిపించే ఏంజెలినా ఈ చిత్రంలో మాత్రం తలకు కొమ్ములు, విరబోసిన జుత్తు, కళ్లకు లెన్స్... ఇలా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. మొత్తానికి ఈ లుక్ పిల్లలను భయపెడుతుందని చెప్పొచ్చు. కానీ, ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్న వాల్ట్ డిస్నీ అధినేతలు కూడా భయపడుతున్నారట. దేవకన్యలా అందంగా కనిపించే ఏంజెలినా అందుకు భిన్నంగా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తే, ప్రేక్షకులు ఆదరించరేమోననే భయం పట్టుకుందట. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరాజయం పాలవుతుందని భావిస్తున్నారట. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. డిస్నీవాళ్లు భయపడినట్లే జరుగుతుందో లేక వాళ్లకి ఈ సినిమా స్వీట్ షాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.