48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాలలంతా ఏకమై ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో మాలమహానాడు అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.