Mancherial town
-
ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక వీడియోను విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె అందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోసాలను బట్ట బయలు చేస్తామన్నారు ఎమ్మెల్యేను తాము బ్లాక్ మెయిల్ చేస్తున్నాననేది అబద్దమన్నారు. ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారన్నారు.. కానీ పోలీసులు తాము పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ పుటేజీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.. తనకు ప్రాణహని ఉందన్నారు. తమకు రక్షణ. కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేకమంది ఉన్నారని వారిపై సమగ్రమైన విచారణ. జరిపించాలని కోరారు. సాయం చేస్తా.. సరదా తీర్చండి! -
ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మోదీ పర్యటించే రోజుల్లో ట్రెడ్మిల్, జిమ్ సైకిల్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేందుకు జిల్లా కేంద్రానికి చెందిన గడప రాజేశ్‌ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్‌లో అథ్లెటిక్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్) -
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
బ్యాంకు లాకర్ గదికి కన్నం స్థానికుల అప్రమత్తతో దుండగుల పరారీ మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఇద్దరు దుండగులు గేట్ ద్వారా లోనికి ప్రవేశించి లాకర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. గొడ్డలి, స్క్రూడ్రైవర్, బ్లేడ్, గునపం, పోకర్‌తో లాకర్ గదికి రంధ్రం చేశారు. మధ్యలో లాకర్ గదికి ఉన్న ఆర్సీసీ(సిమెంటు కాంక్రిట్ లేయర్) అడ్డు తగిలింది. దానిని పగులగొట్టే క్రమంలో శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు మేల్కోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు లైట్లు వేయడంతో దుండగులు పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ వి.సురేశ్, ఎస్సైలు ఎస్కే.లతీఫ్, ఎం.వెంకటేశ్వర్లు పరిశీలించారు. దుండగులు సంఘటన స్థలంలో సారా తాగినట్లు అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్యాంకు సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి. పోలీసు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.