Manda jaganadham
-
బాబూ.. రెచ్చగొట్టే మాటలు మానుకో: మందా
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రాంత ఉద్యోగుల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగులకు న్యాయం చేసేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని సేకరిస్తుంటే, చంద్రబాబు మాత్రం దాన్ని యుద్ధక్షేత్రంగా వర్ణిస్తూ, ‘యుద్ధానికి నేనే వస్తా’ అని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్య లు మానుకోవాలని సూచించారు. ‘తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడే తిష్ట వేయడానికి ఆంధ్రా ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ నేత విఠల్‌ను ఆంధ్రాకి కేటాయించి, సచివాలయంలోని 18 మంది ఆంధ్రా ఉద్యోగులకు స్థానికత పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా?’ అని బాబును ప్రశ్నించారు. -
కొంప ముంచిన ఆటో
కల్వకుర్తి ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థులకు ఒకే గుర్తు ఒక్క కల్వకుర్తిలోనే ఎంపీ అభ్యర్థికి 30వేల ఓట్లు..! హైదరాబాద్: ఆటో గుర్తు ఇద్దరు అభ్యర్థుల కొంప ముంచింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథం విజయాలను దారుణంగా దెబ్బతీసింది.కల్వకుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎన్నికల్లో కేటాయించిన గుర్తు ఆటో.. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాసులు పోటీ చేస్తే ఆయనకు కూడా ఆటో గుర్తు కేటాయించారు. కల్వకుర్తిలో నారాయణరెడ్డి ఆటో గుర్తుకు ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం కాస్త స్వతంత్ర ఎంపీకి అభ్యర్థికి ఓట్లు తెచ్చిపెట్టింది. పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసులకు 54వేల ఓట్లు వస్తే.. కేవలం కల్వకుర్తిలోనే 30వేలకు పైగా ఓట్లు లభించాయి. నారాయణరెడ్డికి పడాల్సిన ఓట్లు శ్రీనివాసులకు రావడంతో.. ఇక్కడ నారాయణరెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. వాస్తవంగా ఈ ఓట్లు నారాయణరెడ్డికి దక్కి ఉంటే.. ఆయన కనీసం ఆరు నుంచి తొమ్మిదివేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉండేదన్న పరిశీలకులు భావిస్తున్నారు. అదే తరహాలో ఎంపీ అభ్యర్థులు కేవలం ఆరుగురు పోటీ చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథం గుర్తు కారు. ఆటో, కారు చిహ్నాలను సరిగా గుర్తించడంఓ ఓటర్లు కాస్త పొరపడడం వల్ల మందా జగన్నాథానికి రావాల్సిన ఓట్లు రాకుండా పోయాయన్న అభిప్రాయమూ ఉంది. -
దయ్యమా, దేవతా.. ప్రజలే నిర్ణయిస్తారు: మందా
న్యూఢిల్లీ: ‘‘సోనియా గాంధీ దేవతా.. దయ్యమా? అన్నది కాదు. అది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె దయ్యమా? దేవతా? అన్న అభిప్రాయం మా పార్టీకి ఎందుకుంటుంది?..’’ అని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా జగన్నాథం పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘స్నేహహస్తం చాపాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు ఎంత త్వరగా పొత్తుల బంధం చెడిపోతే బాగుండని చూస్తున్నారు. కేసీఆర్ గతంలో సెప్టెంబరు 30లోపు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామన్న మాట నిజమే. కానీ కాంగ్రెస్ మాటపై నిలబడలేదు. స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్ఎస్పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి. దొరల పాలన అంటూ జైరాం రమేశ్ ఎలా మాట్లాడతారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఏర్పాటు అనేది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరిగేలా ఉంటుంది. మేం తెలంగాణకు న్యాయం చేయాలని, ప్యాకేజీలు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ వాళ్లు కేవలం సోనియాను స్తుతించేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ స్నేహహస్తం అంటూనే వెనుక నుంచి కత్తితో పొడిచే ప్రయత్నం చేసింది..’’ అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు కొత్తవాదన తగదు
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, ఇప్పుడు సమన్యాయమంటూ కొత్త వాదన వినిపించడం తగదని తెలంగాణ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం విమర్శించారు. సీమాంధ్ర ఎంపీలు లోక్‌సభను అడ్డుకోవడం తగదని సలహా ఇచ్చారు. సీమాంధ్ర ఎంపీలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. రేపు తెలంగాణ బిల్లు లోక్‌సభకు వస్తుంద చెప్పారు. ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పోందుతుందన్నారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఎంపీ శివప్రసాద్‌ను ఎంపీ జగన్నాదం అడ్డుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని శివప్రసాద్ నినాదాలు చేశారు. జగన్నాథం అతనిని అడ్డకొని వారించారు.