చంద్రబాబుకు కొత్తవాదన తగదు | Chandrababu Naidu new argument | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కొత్తవాదన తగదు

Published Wed, Feb 12 2014 2:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

చంద్రబాబుకు కొత్తవాదన తగదు

చంద్రబాబుకు కొత్తవాదన తగదు

ఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, ఇప్పుడు సమన్యాయమంటూ కొత్త వాదన వినిపించడం తగదని తెలంగాణ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం విమర్శించారు.  సీమాంధ్ర ఎంపీలు లోక్సభను అడ్డుకోవడం తగదని సలహా ఇచ్చారు.  సీమాంధ్ర ఎంపీలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారన్నారు.

ఎంపి  కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు.  రేపు తెలంగాణ బిల్లు లోక్‌సభకు వస్తుంద చెప్పారు. ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పోందుతుందన్నారు.

ఇదిలా ఉండగా,  లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఎంపీ శివప్రసాద్‌ను  ఎంపీ జగన్నాదం అడ్డుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని శివప్రసాద్‌ నినాదాలు చేశారు.  జగన్నాథం అతనిని అడ్డకొని వారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement