mantra
-
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్‌లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు. -
రహస్యమైన మంత్రాన్ని రామానుజులు అందరికీ వెల్లడించడం సమంజసమా?
మంత్రం అన్నది ఎంతో పవిత్రమైనది, గురువుల ఉపదేశంతో కేవలం మరొకరు వినకుండా ఎంతో గుహ్యంగా బోధిస్తారే, మరి అటువంటిది తమ గురువుల మాటను ధిక్కరించి దేవాలయం పైకెక్కి అంతమందికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించడం ఎంతవరకు సబబు అని నాస్తికులే కాక ఆస్తికులు కూడా అడిగే ప్రశ్న. గురువులు ఏమి చేసినా లోకకళ్యాణం కొరకు చేస్తారు. రామానుజులు తమ గురువుల వద్ద ఎంతో కష్టపడి తెలుసుకున్న శ్రీమన్నారాయణ దివ్య మంత్రాన్ని అక్కడున్న తిరుక్కోటియర్ వైష్ణవ మందిరాన్ని అధిష్టించి అక్కడ గ్రామప్రజలను ఉద్దేశించి అందరికీ ఉపదేశం చేశాడు. ఈ చర్యను గర్హించిన గురువుల పాదాలు పట్టి తాను నరకానికి పోయినా ఫరవాలేదు కానీ ఇన్ని వందలమంది బాగు పడాలి అని కోరి ఇలా చేసానని చెప్పి, ఆయన ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇందులోని సామంజస్యం విషయానికి వస్తే,ఎవరెవరికి మంత్రాన్ని ఉపదేశం తీసుకునే అర్హత ఉన్నదో, ఎవరెవరికి కైవల్య ప్రాప్తికి కర్మసిద్ధి ఉన్నదో వారు మాత్రమే ఆ సమయానికి ఆ ఊళ్ళో, అందునా ఆ ఆలయ సమీపంలో ఆయన వద్దకు వెళ్లి నేరుగా ఉపదేశం పొందగలిగారు. ఎవరికి కర్మ పరిపక్వమై మంత్రరాజాన్ని అందుకోగలిగారో వారు గురువులు రామానుజుల వద్దనుండి ఆ మంత్రాన్ని గ్రహించారు. ఎవరికి కైవల్యప్రాప్తి ఉన్నదో వారు ఆ మంత్రాన్ని అనుష్టించి ఊర్ధ్వలోకాలకు అర్హులయ్యారు. ఇవన్నీ తెలియనివారు కారు రామానుజులు. తనకేమి వద్దు కేవలం కైవల్యం కావాలని కోరిన ఆవిడకు కైవల్యం ప్రసాదించిన ఆయన ఎవరికి పడితే వారికి మంత్రాన్ని ఇచ్చారనుకోవడం మన అజ్ఞానం. అక్కడ ఎందరు ఎంత తపస్సు సాధన చేసి వున్నారో, ఏ ఏ వర్ణాలలో జన్మించి ఉన్నారో వారికి వారి కర్మానుసారం ఆయన మంత్రోపదేశం చేసారు భగవద్రామానుజులు. -
తొలి రిమోట్ ‘యుద్ధ’ట్యాంక్.. మంత్ర
చెన్నై: స్వదేశీ పరిజ్ఞానంతో రిమోట్ సాయంతో నడిచే తొలి మానవరహిత ‘యుద్ధ’ ట్యాంకులను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ( డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. రిమోట్ ఆదేశాలతో పనిచేసే మూడు ‘మంత్ర ’ సిరీస్ ట్యాంకులను తయారుచేసింది. నిఘా, మందుపాతరల గుర్తింపు, అణుధార్మికత, జీవ ఆయుధాల ప్రమాదమున్న ప్రాంతాల జాడ తెలుసుకునేందుకు ఈ మూడు రకాల ట్యాంకులను రూపొందించింది. నిఘా కోసం మంత్ర–ఎస్ రకాన్ని, బాంబుల గుర్తింపు కోసం మంత్ర ఎం రకాన్ని అలాగే అణు ధార్మికత, జీవాయుధాల ప్రమాదమున్నప్రాంతాలను గుర్తించేందుకు మంత్ర– ఎన్ రకాన్ని తయారుచేశారు. అవడిలోని ఆర్మీకి చెందిన కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ)లో వీటిని తయారుచేశారు. సీవీఆర్‌డీఈలో మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళిగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలో కొత్తగా తయారుచేసిన రెండు మంత్ర సిరీస్ ట్యాంకులను ప్రదర్శించారు. 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారి ప్రాంతమైన రాజస్తాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో వీటిని పరీక్షించారు.