marauding
-
పేదల సొమ్ము దోచారు
జునాగఢ్/సోనాగఢ్: నిరుపేదలు, గర్భిణులకు అందాల్సిన నిధులను కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లలో ఇటీవల ఐటీ శాఖ చేపట్టిన సోదాలను ప్రస్తావిస్తూ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ‘తుగ్లక్ రోడ్డు ఎన్నికల కుంభకోణా’నికి పాల్పడిందని ఎద్దేవా చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో మోదీ మాట్లాడారు. మధ్యప్రదేశ్.. కొత్త ఏటీఎం జునాగఢ్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ కాంగ్రెస్ నేతల ఇళ్లలో నోట్లు కట్టలుకట్టలుగా బయటపడటాన్ని మీరు గత 3–4 రోజులుగా టీవీల్లో చూసుంటారు. కానీ వాళ్లు మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఇంతకుముందు వాళ్లకు కర్ణాటక ఏటీఎంగా ఉండేది. ఇప్పుడు మధ్యప్రదేశ్ కొత్త ఏటీఎంగా తయారైంది. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కూడా పరిస్థితిలో పెద్దగా తేడా లేదు. అధికారంలోకి వచ్చి దోచుకోవడంపైనే కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఉన్నారు. చేసిన కుంభకోణాల ఆధారంగా ఈ పార్టీకి చాలా పేర్లు ఉన్నాయి. కానీ తొలిసారి ఆ కుంభకోణాలకు ఆధారం లభించింది. వీళ్లు తుగ్లక్ రోడ్డు ఎన్నికల కుంభకోణానికి పాల్పడ్డారు. నిరుపేదలు, గర్భిణులకు అందించాల్సిన నిధుల్ని కాంగ్రెస్ నేతలు వాడుకున్నారు. పాక్‌లోని ఉగ్రమూకలపై వైమానికదాడులు చేస్తే, అవి కాంగ్రెస్ పార్టీని బాధించాయి’ అని అన్నారు. నెహ్రూ వల్లే కశ్మీర్లో మరణాలు.. ‘స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా పటేల్ లేకుంటే కశ్మీర్ మనదేశంలో ఉండేది కాదు. వందలాది సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేలా పటేల్ చొరవచూపారు. కశ్మీర్ విలీనం విషయంలో నెహ్రూ ఘోరంగా విఫలమయ్యారు. అందువల్లే నేటికీ మన సైనికులు అక్కడ అమరులవుతున్నారు. ఓ చాయ్‌వాలా ఐదేళ్లు పదవీకాలాన్ని పూర్తిచేసుకోవడంపై కాంగ్రెస్ నేతలకు బెంగ పట్టుకుంది’ అని మోదీ విమర్శించారు. -
చెత్త పేరుతో సంపద లూటీ!
సాక్షి, లింగసముద్రం(ప్రకాశం) : చెత్తతో సంపద తయారీ కేంద్రాల మాట ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి మండలంలో అధికార పార్టీ నాయకులు బాగానే సంపాదించుకుంటున్నారు. చెత్త సేకరణ పేరుతో చేపట్టిన సంపద కేంద్రాల నిర్మాణాలు గ్రామస్థాయి నాయకులకు వరంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ షెడ్లు టీడీపీ నాయకులు ఉపాధిగా మలుచుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇదీ..పరిస్థితి లింగసముద్రం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి 9 లక్షల వరకు మంజూరు కావడంతో ఇదే అదునుగా భావించి నిర్మాణాలు మొదలు పెట్టారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లింపులు ఉండటంతో టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా ఉంది. నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొత్తం బిల్లులు కాజేశారు. నిరుపయోగంగా ఉన్న సంపద కేంద్రం షెడ్డు మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో కొన్ని సంపద కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలిన సంపద కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా రూ.1.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. గ్రామాలకు దూరంగా వీటిని నిర్మించడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టమవుతోంది. ఈ సంపద కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాత్రిళ్లు వ్యభిచారం, పగలు పేకాట వంటివి జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సి ఉన్నా టీడీపీ నాయకుల స్థలాలకు అనువుగా ఉంటాయన్న చోట ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం లింగసముద్రం గ్రామానికి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గ్రామానికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. రూ.8 లక్షల వ్యయంతో ఈ సంపద కేంద్రాన్ని తాటాకుల కప్పుతో ఏడాది క్రితం నిర్మించారు. తాటాకుతో నిర్మించి ఏడాది కావడంతో తాటాకు లేచి పోయి శిథిలావస్థకు చేరింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే మండలంలోని పంచాయతీల్లో చెత్త పేరుతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. సంపద కేంద్రాల వినియోగించక పోవడంతో గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారం, మట్టి దిబ్బలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. చెత్తా చెదారం మురుగు కాలువల్లో పడి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ దూతలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సేకరణ రిక్షాల కొనుగోలు ఊసేలేదు. పంచాయతీల్లో రిక్షాలను కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. -
టీడీపీ నాయకులకు దోచి పెట్టేందుకే రాజధాని నిర్మాణం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజం ఆళ్లగడ్డ: తెలుగు దేశం పార్టీలోని నాయకులకు కావలిసినంత దోచిపెట్టడానికే అమరావతి నిర్మాణం చేపట్టారే తప్ప ప్రజలకు ఉపయోగ పడేందుకు కాదని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని రామలింగారెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జి పుల్లయ్య అధ్యక్షతన నియోజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోట్ల మట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర్ర సంవత్సరాలు కావస్తున్నా కొద్దిగా కూడా అభివృద్ధి జరగలేదన్నారు. అయితే, ఆపార్టీ నాయకుల మాత్రం బాగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరిని పూర్తిగా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జిల్లాలో ఓ వైపు కరువు పరిస్థితులు, మరోవైపు పండించిన అరకొర పంటలకు గిట్టుబాటుధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అంటే 'తెలుగు దొంగల పార్టీ ' అన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను ముఖ్యమంత్రి నట్టేట ముంచారని విమర్శించారు. రైతులకు మూడు సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్సులు ఏమాత్రం అందజేయలేదన్నారు. ఇంత వరకు పేదలకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అదిగో అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి డ్రామాలడుతున్నారని ఘాటుగా విమర్శించారు. తర్వాత గోస్పాడు మండలంలోని కానాల పల్లెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, అశోక్‌రత్నం, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సత్యరాజు, శివశంకర్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.